సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిబ్బంది నిర్వహణ &ప్రజా పరిపాలనలో సహకారంపై ప్రస్తుతమున్న అవగాహన ఒప్పందాన్ని ఐదేళ్ల పాటు, 2028 వరకు పొడిగించిన భారత్‌-సింగపూర్

Posted On: 06 JUL 2023 6:04PM by PIB Hyderabad

భారత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు &పింఛన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ప్రజా సేవల విభాగం కలిసి తమ సహకార ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాయి. ఇరు పక్షాలు విధివిధానాల పత్రంపై ఇవాళ సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, సిబ్బంది నిర్వహణ &ప్రజా పరిపాలనలో సహకారం 2028 వరకు కొనసాగుతుంది.

భారత్‌ తరపున పరిపాలన సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, సింగపూర్‌ తరపున భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ శ్రీ సైమన్ వాంగ్ ఎంవోయూ మీద సంతకం చేశారు.

డీఏఆర్‌పీజీ, సింగపూర్ హైకమిషన్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ప్రజా సేవల విభాగం శాశ్వత కార్యదర్శి కూడా ఈ కార్యక్రమానికి వర్చువల్‌ పద్ధతిలో హాజరై, ప్రసంగించారు.

రెండు దేశాల ప్రజా సేవల విభాగాల మధ్య వివిధ రకాల సహకారాల ద్వారా రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేయడం ఈ ఎంవోయూ లక్ష్యం. పరిపాలన సంస్కరణలు & ప్రభుత్వ రంగ పరివర్తన, ప్రజా సేవల పంపిణీ, నాయకత్వం & నైపుణ్యాభివృద్ధి, ఇ-పరిపాలన, సామర్థ్యం పెంపు, శిక్షణ వంటి అంశాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి.

 

<><><><><>


(Release ID: 1937859) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi , Punjabi