సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పూర్వోదయను ప్రారంభించేందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ అస్సాం పర్యటన: అష్టలక్ష్మీ రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చడం; ప్రధాని మోదీ దాదాపు 60 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు
"ప్రధాని మోడీ నేతృత్వంలో గత 9 సంవత్సరాల ప్రభుత్వంలో ఈశాన్య భారత ప్రాంతాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగింది: - డాక్టర్ జితేంద్ర సింగ్.
Posted On:
01 JUL 2023 4:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రిగా, నరేంద్ర మోదీ గత 9 సంవత్సరాలలో దాదాపు 60 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు. ఇది గత పాలకుంతాల కలిసి చేసిన మొత్తం సందర్శనలకంటే ఎక్కువ. ఫలితంగా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు అద్భుతమైన అభివృద్ధి, పరివర్తన చెందుతున్నాయి. ఇది మోదీ పాలనలో అభివృద్ధికి ఒక నమూనాగా చెప్పవచ్చు.
ఈశాన్య ప్రాంతంలో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రదర్శించే ‘పూర్వోదయ్’ కాన్క్లేవ్ను గువాహటీలో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర శాస్త్రసాంకేతిక, పెన్షన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్శాఖల సహాయమంత్రి(ఇన్చార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.
తొమ్మిదేళ్ల క్రితం ఈశాన్య ప్రాంతం తిరుగుబాటు, ఘర్షణ మొదలైన తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచిందని, దీనివల్ల యువకులు ఎంతో గందరగోళానికి గురయ్యారు మరియు కలవరపడ్డారని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రస్తుతం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, ఈశాన్య యువత ఇప్పుడు భారతదేశ ప్రధాన స్రవంతి ప్రయాణంలో భాగమయ్యారని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ గత 9 ఏళ్లలో దాదాపు 60 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించగా, ఆయన మంత్రి మండలి కూడా 400 కంటే ఎక్కువ సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు. కోవిడ్ లేకపోతే ప్రధానమంత్రి 100 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించి ఉండేవారని మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో.. అంటే 2014 నుంచి 2022 వరకు ఈశాన్య రాష్ట్రాల్లోని మినిస్ట్రీ ఆఫ్ డోనర్, ఎన్‌ఈసీ పథకాల కింద రూ.15,867 కోట్ల విలువైన 1,350 ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు. సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం (AFSPA) త్రిపుర మరియు మేఘాలయా నుండి పూర్తిగా తొలగించబడిందని, కొన్ని ప్రాంతాలను మినహాయించి.. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం తొలగించబడిందని చెప్పారు. యూపీఏ హయాంలో 2006–-14 కాలంలో 8,700 కేసులు నమోదు కాగా.. ఎన్డీఏ నేతృత్వంలోని భారత ప్రభుత్వ పాలనలో 2014–-22 కాలంలో కేవలం 3,195 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. అంటే.. 63% తగ్గుదల నమోదైనందున లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా మెరుగుపడిందని ఆయన మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 2023–-24 ఆర్థిక సంవత్సరానికి.. మొత్తం బడ్జెట్ అంచనాల కేటాయింపు రూ. 5892.00 కోట్లు. ఇది సవరించిన అంచనాలు2022-–23 కేటాయింపుల కంటే 114% ఎక్కువని, 2755.05 కోట్లు మరియు సవరించిన అంచనాల 2014-–15 కేటాయింపు 1825.5 కోట్ల కంటే 223% ఎక్కువన్నారు. యూనియన్ బడ్జెట్ 2023-–24 ప్రకారం.. ఈశాన్య ప్రాంతం కోసం 10% స్థూల బడ్జెట్ మద్దతు వాటారూ. 94,679.53 కోట్లు అంటే.. సవరించిన అంచనాల ప్రకారం 2022–-23 కేటాయింపుల కంటే 31% ఎక్కువని, 72,540.28 కోట్లు మరియు సవరించిన అంచనాలు 2014–- 15 కేటాయింపుల కంటే 246% ఎక్కువన్నారు.
మోడీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 2014-–15 నుండి 2021–-22 వరకు 10% జీబీఎస్ కింద సుమారు రూ.3.37 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, 2022-–23 మరియు 2023–-24 కోసం కేటాయించిన వ్యయం 5 లక్షల కోట్లుగా మంత్రి వివరించారు. మోదీ ప్రభుత్వం 2022–-23 బడ్జెట్‌లో PM-DevINE పథకాన్ని 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించిందని, ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి 2022–-23 నుండి 2025-–26 వరకు మొత్తం రూ. 6,600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రోజుకు 0.6 కిలోమీటర్ల జాతీయ రహదారిని ఏర్పాటు చేయగా, 2014–-19 మధ్య ఈశాన్య ప్రాంతంలో రోడ్ల నిర్మాణం రోజుకు 1.5 కిలోమీటర్లకు.. అంటే రెండింతలు పెరిగిందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
2013-–14 వరకు ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు 8,480 కి.మీలు ఉండగా, 2022-–23లో మోదీ ప్రభుత్వం హయాంలో 15,735 కి.మీలకు పెరిగిందని, 85.55%. పెరిగిందన్నారుఉ. ఇది ఈశాన్య ప్రాంతంలో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధిని సూచిస్తుందని మంత్రి వివరించారు. 2014–-15 నుండి, ఈశాన్య ప్రాంతంలో కొత్త ట్రాక్‌ల అభివృద్ధికి మరియు ప్రస్తుత రైల్వే లైన్లను రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రూ.19,855 కోట్లు ఖర్చు చేసిందని, ఈశాన్య ప్రాంతంలో విమానాశ్రయాలు మరియు జలమార్గాల సంఖ్య 2014 వరకు 9 మరియు 1గా ఉంది, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వరుసగా 17 మరియు 18కి పెరిగిందన్నారు.
ఈ ప్రాంతంలో టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడానికి 2014 నుండి, రూ. 10% స్థూల బడ్జెట్ మద్దతు కింద 3,466 కోట్లు ఖర్చు చేయబడ్డాయని, మరియు ఈ ప్రాంతంలోని 4,525 గ్రామాలలో 4G కనెక్టివిటీకి అప్‌గ్రేడేషన్ పురోగతిలో ఉందన్నారు. మార్చి 31, 2021 వరకు, ఈశాన్య ప్రాంతంలోని 26.14 లక్షల గృహాలకు విద్యుద్దీకరణ జరిగిందని మంత్రి తెలిపారు.
NESIDS మరియు NLCPR పథకం కింద రీజియన్‌లో మొత్తం రూ. 3,200 కోట్ల విలువచేసే 4 పవర్ ప్రాజెక్టులు మరియు 239 పవర్ ప్రాజెక్టులు మంజూరు కాకాగా.. వీటిలోరూ. 2031.79 కోట్లు వ్యయంతో 211 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి స్వదేశ్ దర్శన్ మరియు ప్రసాద్ వంటి పథకాల నుండి ఈశాన్య ప్రాంతం కూడా లబ్ది పొందుతోంది మరియు రూ. మండలానికి రెండు పథకాల కింద 1502.48 కోట్లు మంజూరయ్యాయి. మార్చి 2022 నాటికి, ఈశాన్య ప్రాంతంలో నేషనల్ బాంబూ మిషన్ (NBM) కింద మొత్తం 208 ఉత్పత్తి అభివృద్ధి మరియు ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించబడ్డాయి. మార్చి 2022 నాటికి, విశ్రాంతి కింద 14 హైటెక్, 95 పెద్ద మరియు 53 చిన్న నర్సరీలు స్థాపించబడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
***
(Release ID: 1937276)
Visitor Counter : 153