ఉక్కు మంత్రిత్వ శాఖ

2023 ఏప్రిల్-జూన్ లో అత్యుత్తమ త్రైమాసిక ఉత్పత్తిని సాధించిన ఎం.ఓ.ఐ.ఎల్., గత ఏడాది కంటే 35 శాతం వృద్ధిని నమోదు చేసింది


2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కూడా 3.96 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయి త్రైమాసిక అమ్మకాలు నమోదయ్యాయి

Posted On: 03 JUL 2023 1:51PM by PIB Hyderabad

ఎం.ఓ.ఐ.ఎల్. తన ఉత్పత్తి వృద్ధి ని కొనసాగిస్తూ, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.36 లక్షల మెట్రిక్ టన్నుల అత్యుత్తమ త్రైమాసిక మాంగనీస్ ఖనిజ ఉత్పత్తి ని సాధించి,   గత ఏడాది ఇదే కాలంలో (సి.పి.ఎల్.వై) ఉత్పత్తి కంటే 35 శాతం మేర గణనీయమైన వృద్ధి ని నమోదు చేసింది.  సంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఏ జూన్ నెలలోనూ సాధించనంతగా ఈ జూన్ నెలలో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మేర అత్యుత్తమ ఉత్పత్తి సాధించింది. 

 

విక్రయాల విషయంలో కూడా,  ఎం.ఓ.ఐ.ఎల్. తన అత్యుత్తమ మొదటి త్రైమాసిక విక్రయ పనితీరును నమోదు చేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, గత ఏడాది ఇదే కాలం (సి.పి.ఎల్.వై) కంటే 39 శాతం మేర వృద్ధితో 3.96 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాలను నమోదు చేసింది.

అన్వేషణ కార్యకలాపాలపై తన వృద్ధి కొనసాగిస్తూ, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎం.ఓ.ఐ.ఎల్., 20,086 మీటర్ల మేర తన అత్యుత్తమ త్రైమాసిక అన్వేషణాత్మక  కోర్ డ్రిల్లింగ్ చేసింది.  ఇది  గత ఏడాది ఇదే కాలం (సి.పి.ఎల్.వై) లో త్రవ్వకాల కంటే 3.8 రెట్లు ఎక్కువ.  ఇది దాని ప్రస్తుత గనుల నుండి మెరుగైన ఉత్పత్తికి ఒక రికార్డు కింద మాత్రమే కాకుండా దేశంలో కొత్త మాంగనీస్ గనులను తెరవడానికి కూడా ఇది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 

 

ఈ త్రైమాసికంలో  ఎం.ఓ.ఐ.ఎల్.  అత్యధిక ఎలక్ట్రోలిటిక్ మాంగనీస్ డయాక్సైడ్ (ఈ.ఎం.డి) ఉత్పత్తి చేసింది.   ఈ.ఎం.డి. అనేది వంద శాతం దిగుమతి ప్రత్యామ్నాయ ఉత్పత్తి.   దీనిని ఎక్కువగా ఫార్మాస్యూటికల్స్ మరియు బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. 

 

ఈ అద్భుతమైన ఫలితాలపై ఎం.ఓ.ఐ.ఎల్. సి.ఎం.డి. శ్రీ అజిత్ కుమార్ సక్సేనా స్పందిస్తూ, ‘ప్రతి నెల మార్చి నెల మాదిరి' ఫలితాలు సాధించాలనే స్పష్టమైన పిలుపు స్ఫూర్తితో ఎం.ఓ.ఐ.ఎల్. ప్రదర్శించిన సమిష్టి కృషిని అభినందించారు.  ఈ సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం ఎం.ఓ.ఐ.ఎల్. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

*****



(Release ID: 1937095) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi , Punjabi