వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఐ ఏ ఆర్. ఐ లో అంతర్జాతీయ హాస్టల్ - మధుమాస్‌ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
03 JUL 2023 5:34PM by PIB Hyderabad
గురు పూర్ణిమ శుభ సందర్భంగా, ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ హాస్టల్ 'మధుమాస్'ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి మరియు డైరెక్టర్ జనరల్ మరియు సెక్రటరీ డా. హిమాన్షు పాఠక్ పాల్గొన్నారు.
కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పరిశోధన, విద్య మరియు బోధనలో గణనీయమైన కృషి చేస్తున్నందుకు ఐకార్ -ఐ ఏ ఆర్. ఐ బృందాన్ని అభినందించారు. దేశం ఆహార భద్రతను సాధించడంలో ఐఎఆర్‌ఐ అందిస్తున్న సహకారాన్ని ప్రపంచం మొత్తం గౌరవిస్తోందని అన్నారు. అంతర్జాతీయ విద్య మరియు పెరుగుతున్న విద్యార్థుల నమోదు రేటును దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వ విలువైన సహాయంతో ఉన్నత నాణ్యత సౌకర్యాలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థి-కేంద్రీకృత హాస్టళ్లు సంస్థ నిర్మిస్తున్నది. అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన "మధుమాస్" ఇంటర్నేషనల్ హాస్టల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన అందరినీ అభినందించారు. అమృత్ కాల్‌లో, వ్యవసాయ రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య మరియు పరిశోధనలతో ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్టిట్యూట్ ముందుకు రావాలని, ఈ కలను సాకారం చేసేందుకు ఈ ఇంటర్నేషనల్ హాస్టల్ సముచిత ముందడుగు అవుతుందన్నారు. వ్యవసాయం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు, పెరుగుతున్న ఆహార డిమాండ్‌తో సహా సవాళ్ల వల్ల శాస్త్రవేత్తలపై పెరిగిన బాధ్యతలను ఆయన గుర్తు చేశారు, అయితే ఈ సమస్యలను పరిష్కరించడంలో ఐఎఆర్‌ఐ విజయవంతమవుతుందని తన నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి తన ప్రసంగంలో ఐఎఆర్‌ఐ అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ అంశాల విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే అంతర్జాతీయ హాస్టల్ నిర్మాణం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క ఆహారం మరియు పోషక భద్రత యొక్క సాకారనికి దోహదపడిన ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన అధునాతన పంట రకాలు మరియు సాంకేతికతలను ప్రస్తావించడం ద్వారా సంస్థ యొక్క సహకారాన్ని ఆయన ప్రశంసించారు. బీ. ఎస్ సీ సహా 4 సబ్జెక్టులలో యూ జీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించినందుకు ఐఎఆర్‌ఐ డైరెక్టర్‌ను ఆయన అభినందించారు. (వ్యవసాయం), బి.టెక్. (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బి.టెక్. (బయోటెక్నాలజీ), మరియు బీ. ఎస్ సీ . (కమ్యూనిటీ సైన్స్) లో 158 జాతీయ స్థాయి విద్యార్థులు నమోదు చేసుకున్నారు. నాణ్యమైన మానవశక్తిని పెంపొందించేందుకు ఉన్నత విద్య దోహదపడుతుందని, అదే సమయంలో యువ విద్యార్థుల ఉనికి క్యాంపస్‌ను మరింత చైతన్యవంతం చేస్తుందని అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కొత్త మెళకువలను నేర్చుకుని, ఆహార ఉత్పత్తి మరియు ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు వారి స్వంత గ్రామాల్లో వాటిని అమలు చేయాలని ఆయన అన్నారు.
హాస్టల్ 504 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తుంది మరియు 400 సింగిల్ బెడ్ రూమ్‌లు, బాత్రూమ్ మరియు వంటగదితో 56 ఒకే పడకల గదులు; మరియు 48 కుటుంబ అపార్ట్‌మెంట్‌లు వున్నాయి. హాస్టల్ కాంప్లెక్స్‌లో ఫుడ్ కోర్ట్, వ్యాయామశాల, రెస్టారెంట్, సోలార్ ఎనర్జీ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, జనరేటర్ బేస్డ్ పవర్ బ్యాకప్, వై-ఫై నెట్‌వర్క్, ఆర్. ఓ. మొదలైనవి ఉన్నాయి.
డాక్టర్ హిమాన్షు పాఠక్ తన స్వాగత ప్రసంగంలో నూతన విద్యా విధానం -2020 అమలులో ఐకార్ పాత్రను, భారతదేశంలో వ్యవసాయ పరిశోధన, విద్య మరియు విస్తరణను బలోపేతం చేయడంలో ఐఎఆర్‌ఐ యొక్క అద్భుతమైన సహకారాన్ని హైలైట్ చేశారు. దేశంలో వ్యవసాయాభివృద్ధిలో వివిధ కోణాల్లో ఐఎఆర్‌ఐ సహకారం అద్భుతంగా ఉందని ఆయన చెప్పారు. ఐఎఆర్‌ఐ పూర్వ విద్యార్ధులు అంతర్జాతీయ సంస్థలలో అనేక గౌరవనీయమైన స్థానాలతో పాటు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అలాగే పద్మ అవార్డులు వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడ్డారు. ఐఎఆర్‌ఐ మెరుగైన వంగడరకాలు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా ఆహార భద్రతలో గణనీయమైన కృషి చేసింది, బాస్మతి, వరి రకాలు 90 శాతానికి పైగా ఎగుమతి అవుతున్నాయి గోధుమ రకాలు భారతదేశంలో 50% కంటే ఎక్కువ గోధుమ ఉత్పత్తి అవుతున్నాయి.
చివరగా, ఐకార్-ఐఎఆర్‌ఐ, న్యూ ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ ఏ. కె. సింగ్ అధికారికంగా ధన్యవాదాలను ప్రతిపాదించారు. ఇలాంటి సౌకర్యాలతో విదేశీ, ప్రవాస విద్యార్థులను ఆకర్షించవచ్చని ఆయన హైలైట్ చేశారు. కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రి, సెక్రటరీ డేర్ & డిజి-ఐసిఎఆర్ మరియు ఇతర ప్రముఖులు హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు మరియు హాస్టల్ సౌకర్యాలను సందర్శించారు.
***
(Release ID: 1937094)
Visitor Counter : 196