సహకార మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో 'అమృత్ కాల్ : కోఆపరేషన్ ఫర్ ఎ వైబ్రెంట్ ఇండియా ద్వారా సౌభాగ్యం ' అనే ఇతివృత్తం తో 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; అధ్యక్షత వహించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
కో ఆపరేటివ్ మార్కెటింగ్ కోసం ఇ-కామర్స్ వెబ్ సైట్ ను, కో ఆపరేటివ్ ఎక్స్ టెన్షన్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ పోర్టల్ ను కూడా ప్రారంభించిన ప్రధానమంత్రి
శ్రీ నరేంద్రమోదీ
శ్రీ మోదీ సహకార మంత్రిత్వ శాఖ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్నారు; ప్రతి చొరవలో ఆయన మార్గదర్శకత్వం కారణంగా సహకార రంగంలో అనేక మార్పులు
వచ్చాయి: శ్రీ అమిత్ షా
శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక
చొరవలు చేపట్టాం; శ్రీ మోదీ పదవీకాలం సహకార రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ; శ్రీ అమిత్ షా
గత 25-30 సంవత్సరాలుగా సహకార రంగంలో స్తబ్దత ఉంది, కానీ ఈ సహకార కాంగ్రెస్ లో శ్రీ మోదీ నాయకత్వంలో, సహకార సంఘాలు ఒక శతాబ్దంలో అందించిన దానికంటే రాబోయే 25 సంవత్సరాలలో ఎక్కువ సహకారం అందిస్తాయని మనం ఒక తీర్మానాన్ని తీసుకోవాలి: శ్రీ అమిత్ షా
రూ.15,000 కోట్ల విలువైన చక్కెర మిల్లులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పన్ను వివాదాన్ని శ్రీ మోదీ ఒక చట్టం ద్వారా పరిష్కరించారు; భవిష్యత్తులో ఎలాంటి పన్ను వివాదాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు
సహకార రంగంలో మరిన్ని కొత్త రంగాలను చేర్చాలి, కంప్యూటరీకరణ, ఆధునీకరణ, సహకార సంఘాల
Posted On:
01 JUL 2023 4:59PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో 'అమృత్ కాల్ - కోఆపరేషన్ ఫర్ ఎ వైబ్రెంట్ ఇండియా ద్వారా సౌభాగ్యం ‘ అనే థీమ్ పై 17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. కో ఆపరేటివ్ మార్కెటింగ్ కోసం ఇ-కామర్స్ వెబ్ సైట్ ను, కో ఆపరేటివ్ ఎక్స్ టెన్షన్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ పోర్టల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించగా, సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బిఎల్ వర్మతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి భారతదేశంలో సహకారోద్యమం ఉందని, ఇది 115 ఏళ్ల నాటిదని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, సహకార రంగంతో సంబంధం ఉన్న కార్మికుల ప్రధాన డిమాండ్ ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అని ఆయన చెప్పారు. సహకార రంగాన్ని విస్తరించడం, సకాలంలో మార్పులు తీసుకురావడం, పారదర్శకత తీసుకురావడం, సహకార రంగంలో అంతర్జాతీయ మార్పులను భారత్ లో చేర్చడంలో గతంలో ఇబ్బందులు ఉండేవని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గత 75 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న డిమాండు ను నెరవేర్చారని శ్రీ షా అన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ప్రధాని మార్గదర్శకత్వం వల్ల సహకార రంగంలో అనేక మార్పులు సాధ్యమయ్యాయని చెప్పారు.
నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా సహకార రంగంలో అత్యున్నత సంస్థ అని, శ్రీ దిలీప్ సంఘని నాయకత్వంలో, సహకార యూనియన్ అద్భుతమైన సమన్వయం , ప్రయత్నాల ద్వారా పిఎసిఎస్ నుండి ఎపిఎసిఎస్ వరకు అన్ని కార్యక్రమాలు , మార్పులను చేపట్టిందని కేంద్ర హోం , సహకార మంత్రి అన్నారు. దేశంలో వందేళ్లకు పైగా సహకార ఉద్యమం ఎన్నో మైలురాళ్లను సాధించి దేశానికి ఎంతో అందించిందని, కానీ సహకార రంగం గత 25-30 ఏళ్లుగా స్తబ్దతను ఎదుర్కొంటోందని అన్నారు.
వ్యవసాయ రుణ పంపిణీలో 29 శాతం, ఎరువుల పంపిణీలో 35 శాతం, ఎరువుల ఉత్పత్తిలో 25 శాతం, చక్కెర ఉత్పత్తిలో 35 శాతం, స్పిండిల్ రంగంలో 30 శాతం, పాల ఉత్పత్తి, సేకరణ, అమ్మకంలో దాదాపు 15 శాతం, గోధుమల సేకరణలో 13 శాతం, వరి సేకరణలో 20 శాతం వాటాను సహకార రంగం కలిగి ఉందన్నారు. సహకార రంగంలో ముఖ్యంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలు, ఫిషరీస్ సొసైటీలు, కోఆపరేటివ్ బ్యాంకులు పేద వర్గాల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశాయన్నారు.
ఈ కోఆపరేటివ్ కాంగ్రెస్ పై భారత సహకార రంగం ఎన్నో ఆశలు పెట్టుకుందని శ్రీ అమిత్ షా అన్నారు. గత శతాబ్దంలో చేసిన కృషితో పోలిస్తే రాబోయే 25 ఏళ్ల అమృత్ కా lల్ లో దేశాభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఈ సహకార కాంగ్రెస్ లో ప్రతిజ్ఞ చేయాలన్నారు.ఇప్పుడు యువత, మహిళలను సహకార సంఘాలతో అనుసంధానం చేసేందుకు , సహకార సంఘాల ద్వారా నిరుపేదల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అన్నారు.
ఈ కోఆపరేటివ్ కాంగ్రెస్ తర్వాత సహకార సంఘాల అభివృద్ధిని సమష్టిగా ఊహించాలని, ఈ విషయంలో ఇప్పటికే చాలా పనులు జరిగాయని, ఇంకా చాలా సాధించాల్సి ఉందని శ్రీ షా అన్నారు.
సహకార రంగంలో మరిన్ని కొత్త రంగాలను చేర్చాలని ఆయన అన్నారు. సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ, ఆధునీకరణ, పారదర్శకత తీసుకురావాలంటే స్వీయ క్రమశిక్షణ, సంస్కరణలను అంగీకరించాలని
స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సహకార రంగంలో అనేక కార్యక్రమాలను
చేపట్టినట్లు కేంద్ర సహకార మంత్రి తెలిపారు. రాష్ట్రాలు, కేంద్రం హక్కులకు భంగం వాటిల్లకుండా సహకార చట్టంలో సమానత్వాన్ని రాజ్యాంగ చట్రంలోకి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. శ్రీ మోదీ చొరవతో బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టంలో సవరణను పార్లమెంటరీ కమిటీ ఏకాభిప్రాయంతో సూచించిందని, ఈ చట్టం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాబోతోందని శ్రీ షా అన్నారు. గతంలో దేశవ్యాప్తంగా పిఏసీఎస్ కు సంబంధించిన చట్టాలు వేర్వేరుగా ఉండేవని, ఏకరూపత తీసుకురావడానికి సహకార మంత్రిత్వ శాఖ పీఏసీఎస్ లకు బైలాస్ ను రూపొందించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సలహా కోసం పంపిందన్నారు. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ బైలాస్ ను ఆమోదించాయని, ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని 85 శాతం పీఏసీఎస్ లు ఇదే చట్టం కింద పనిచేస్తాయని తెలిపారు. దీని ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఏసీఎస్ లను బహుముఖంగా మార్చారని, దీని వల్ల వాటి విస్తరణ చాలా సులభమవుతుందని శ్రీ షా అన్నారు. కామన్ సర్వీస్ సెంటర్లు వంటి అనేక కార్యకలాపాలను పీఏసీఎస్ లతో అనుసంధానం చేశామని, ఇవి పీఏసీఎస్ లను లాభసాటిగా మార్చడంలో సహాయపడటమే కాకుండా, వాటిని గ్రామీణ సేవల కేంద్రంగా మారుస్తాయని ఆయన అన్నారు.
రిటైల్ అవుట్ లెట్లను మార్చడంలో కూడా తాము చొరవ తీసుకున్నామని, ఇటీవల ప్రధాని ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకానికి కూడా ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. ఈ పథకం విజయవంతం కావడంతో వచ్చే ఐదేళ్లలో నిల్వ వ్యవస్థలో సహకార సంఘాల వాటా 35 శాతానికి పెరుగుతుందని శ్రీ షా తెలిపారు.
దేశవ్యాప్తంగా సహకార సంఘాల డేటాబేస్ ను రూపొందించామని, 90 శాతం పనులు పూర్తయ్యాయని, దీని ద్వారా శూన్యతను గుర్తించి విస్తరణ చేపడతామని శ్రీ అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం దేశంలో 85 వేల పీఏసీఎస్ లు ఉన్నాయన్నారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి పంచాయతీలో పీఏసీఎస్ లు ఉంటాయని, అంటే దేశంలో 3 లక్షల పీఏసీఎస్ లు ఉనికిలోకి వస్తాయని, తద్వారా సహకార రంగం బలోపేతం అవుతుందన్నారు.
జెమ్ ప్లాట్ ఫామ్ లో కొనుగోలుదారులుగా నమోదు చేసుకునేందుకు సహకార సంఘాలకు ప్రధాని ఆమోదం తెలిపారని ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను చట్టం కింద సహకార సంఘాలకు దశాబ్దాలుగా అన్యాయం జరిగిందని, కంపెనీలతో సమానంగా వారికి సమానత్వం లభించలేదని, అయితే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని అసమానతలను ఒకేసారి తొలగించి, కంపెనీలతో సహకార సంఘాలకు సమాన హోదా కల్పించారని, ఇది రాబోయే రోజుల్లో భారీ ప్రయోజనాన్ని అందించనుందని శ్రీ షా అన్నారు.
రూ.15,000 కోట్ల విలువైన చక్కెర మిల్లులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పన్ను వివాదాన్ని ప్రధాని మోదీ ఒక చట్టం ద్వారా పరిష్కరించారని, భవిష్యత్తులో ఎలాంటి పన్ను వివాదాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారని అమిత్ షా తెలిపారు. డేటాబేస్ తో పాటు అమృత్ కాల్ సమయంలో సహకార సంఘాల విస్తరణకు కృషి చేసే సహకార విధానాన్ని కూడా రూపొందించాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. శిక్షణ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కోఆపరేటివ్ యూనివర్శిటీ ఏర్పాటుకు అంతర్ మంత్రిత్వ శాఖల (ఇంటర్ మినిస్టీరియల్) చర్చలు ప్రారంభించామని శ్రీ షా చెప్పారు. ఇది నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా కింద తహసీల్ వరకు మన శిక్షణా వ్యవస్థను ఆధునీకరించడానికి సహాయపడుతుంది. ఒకే పాఠ్యప్రణాళిక ద్వారా, సహకార సంఘాల అనేక రంగాలలో నిపుణులను కలిగి ఉంటాము.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సహకార రంగంలో 630 శిక్షణా సంస్థలు పనిచేస్తున్నాయని, వాటిని విస్తరణగా ఉపయోగించుకొని సహకార విశ్వవిద్యాలయం సజావుగా పనిచేస్తుందని, ఈ కోర్సులో ఏకరూపత వల్ల దేశవ్యాప్తంగా సహకార ఉద్యమం వేగవంతమవుతుందని అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖ అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని, ప్రతి చొరవలో ఆయన మార్గదర్శకత్వం కారణంగా సహకార రంగంలో అనేక మార్పులు వచ్చాయని శ్రీ అమిత్ షా అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి" విజన్ ను మనం సాకారం చేయగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న ప్రజలకు ప్రధాని శ్రీ మోదీ అనేక సౌకర్యాలు కల్పించారని, ఇప్పుడు ఈ వర్గం తమ వమౌళిక సదుపాయాల పోరాటం నుంచి బయటపడి భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూస్తోందన్నారు.
ఈ విభాగానికి మూలధనం లేదని, అయితే వారి చిన్న మూలధనాన్ని సేకరించే పనిని తప్పకుండా చేస్తామని, సహకార సంఘాల ద్వారా దీనిని పెద్ద పెట్టుబడిగా మార్చి, వాటిని సంస్థతో అనుసంధానిస్తామని ఆయన చెప్పారు.
సహకార రంగం స్వయంగా పారదర్శకతను, మార్పును అంగీకరించాల్సి ఉంటుందని, ఇది కష్టమే కానీ అసాధ్యం కాదని, ఈ పనిలో మనం విజయం సాధిస్తే యావత్ దేశ సహకార ఉద్యమానికి పెద్ద ఊపు వస్తుందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ
నరేంద్ర మోదీ పదవీ కాలం సహకార రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో
లిఖించ బడుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.
***
(Release ID: 1936790)
Visitor Counter : 239