నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇరెడ 36వ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహిస్తోంది


ఇరెడ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రుణ మంజూరు, రుణ పంపిణీ మరియు లాభాలను సాధించింది

Posted On: 01 JUL 2023 3:29PM by PIB Hyderabad

ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఇరెడ) తన 36వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో 30 జూన్ 2023న నిర్వహించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధించిన విజయాలు వార్షిక ఖాతాలను ఏ జీ ఎం లో ఆమోదించడం విశేషం.

 

వాటాదారులను ఉద్దేశించి, ఇరెడ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD), శ్రీ ప్రదీప్ కుమార్ దాస్, సంవత్సరంలో ఇరెడ పనితీరు గురించి ఒక అవలోకనాన్ని అందించారు. "ఇరెడ దాని అత్యధిక వార్షిక రుణ మంజూరు, రుణ పంపిణీ, రుణ అభ్యర్థనలు, లాభం మరియు నికర విలువను సాధించింది."

 

పనితీరు అత్యుత్తమంగా ఉందని పేర్కొంటూ, సీ ఎం డీ ఆర్థిక సంవత్సరం 23లో కంపెనీ పనితీరు యొక్క స్నాప్‌షాట్‌ను అందించారు:

 

₹ 32,586.60 కోట్ల రుణ మంజూరు (ఆర్థిక సంవత్సరం 22తో పోలిస్తే 36.23% పెరుగుదల)

₹ 21,639.21 కోట్ల రుణ వితరణ (ఆర్థిక సంవత్సరం 22తో పోలిస్తే 34.65% వృద్ధి)

₹ 47,076 కోట్ల లోన్ బుక్ (ఆర్థిక సంవత్సరం 22తో పోలిస్తే 38.75% వృద్ధి)

పన్నుకు ముందు ₹ 1,139.25 కోట్లు మరియు పన్ను తర్వాత ₹ 864.63 కోట్ల లాభం (ఆర్థిక సంవత్సరం 22తో పోలిస్తే వరుసగా 36.63% మరియు 36.48% పెరుగుదల)

₹ 5,935.17 కోట్ల నికర విలువ (ఆర్థిక సంవత్సరం 22తో పోలిస్తే 12.66% వృద్ధి)

 

నిరర్ధక ఆస్తుల నిష్పత్తులలో ఆరోగ్యకరమైన మెరుగుదల

లాభదాయక ఆస్తి నాణ్యతను నిర్వహించడంలో ఇరెడ  నిబద్ధతను సీ ఎం డీ నొక్కిచెప్పారు. నెలవారీ అంతర్గత స్థితి సమీక్షలు మరియు రుణగ్రహీతలతో త్రైమాసిక పరస్పర అనుబంధ చర్యలతో కూడిన నిర్మాణాత్మక రుణ వసూళ్ల పర్యవేక్షణ వ్యవస్థ అమలును ఆయన హైలైట్ చేశారు. ఫలితంగా, ఇరెడ 18 పనిచేయని ప్రాజెక్ట్ రుణ ఖాతాలను విజయవంతంగా మూసివేసింది లేదా అప్‌గ్రేడ్ చేసింది, ₹ 202.43 కోట్ల రుణాలను తిరిగి పొందింది. ఈ ప్రయత్నాలు ఆర్థిక సంవత్సరం 23 చివరిలో పని చేయని ఆస్తి నిష్పత్తులలో ఆరోగ్యకరమైన మెరుగుదలకు దోహదపడ్డాయి:

 

స్థూల పని చేయని ఆస్తి 3.21% , ఆర్థిక సంవత్సరం 22లో 5.21% నుండి గణనీయమైన తగ్గుదల

నికర పని చేయని ఆస్తి 1.66%, ఆర్థిక సంవత్సరం 22లో 3.12% నుండి గణనీయమైన అభివృద్ధిని చూపుతోంది

సీ ఎం డీ  ఆకట్టుకునే ఆర్థిక పనితీరుతో పాటు,  ఆర్థిక ఉత్పత్తుల కోసం పెరుగుతున్న హరిత విద్యుత్ అవసరాలను గుర్తించడానికి  ఎనర్జీ డెవలపర్‌లతో భాగస్వామ్యంలో చురుకుగా పాల్గొంటుందని ఇరెడ షేర్‌హోల్డర్‌లకు తెలియజేసింది. కంపెనీ కొత్త ఉత్పత్తులపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ -మొబిలిటీ, హరిత హైడ్రోజన్ మరియు హరిత పంపిణీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు ఫైనాన్సింగ్ పరిష్కారాలను ఇప్పటికే ప్రారంభించింది.

 

సమర్థవంతమైన మరియు నైతిక వ్యాపార పద్ధతులను సులభతరం చేసేందుకు కార్పొరేట్ సుపరిపాలన, పారదర్శకత మరియు వ్యాపార నైతికత యొక్క అత్యున్నత ప్రమాణాలను పాటించేందుకు ఇరెడ కట్టుబడి ఉందని సీ ఎం డీ తెలిపారు. ఆర్థిక సంవత్సరం 23లో, ఆర్థిక సంవత్సరం ముగిసిన 25 రోజులలోపు వార్షిక ఆడిట్ ఫలితాలను ప్రచురించిన మొదటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించడం ద్వారా ఇరెడ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. సెబీ అటువంటి బహిర్గతం కోసం 60 రోజుల వ్యవధిని అనుమతించినందున ఈ సాఫల్యం ప్రత్యేకంగా గుర్తించదగినది.

ఇరెడ ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజులలోపు తన ఏ జీ ఎం ని నిర్వహించడం  చెప్పుకోదగిన నమూనా గా నిలిచింది. ఇరెడ యొక్క క్రమబద్ధీకరించబడిన అంతర్గత ప్రక్రియలు, డిజిటలైజ్డ్ డేటా మేనేజ్‌మెంట్ మరియు సుపరిపాలన సూత్రాలు మరియు అభ్యాసాలకు ఇది నిదర్శనం. ఇరెడ  మినీ రత్న (కేటగిరీ - I) మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ ఆధిపత్యం లో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ.

 

***


(Release ID: 1936789) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Hindi , Marathi