రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో ముగిసిన సముద్ర భాగస్వామ్య ఐఎన్-ఎఫ్ఎన్ విన్యాసం
Posted On:
01 JUL 2023 3:13PM by PIB Hyderabad
భారతీయ నావికాదళ నౌకలు,ఐఎన్ఎస్ రాణా - మార్గదర్శక క్షిపణి విధ్వంసక నౌక, దేశీయంగా నిర్మించిన సముద్ర తీర పాట్రోల్ నౌక ఐఎన్ఎస్ సుమేధలు ఫ్రెంచ్ నావికాదళ నౌక ఎఫ్ఎస్ సర్కౌఫ్ తో కలిసి 30 జూన్ 2023న బంగాళాఖాతంలో మారిటైమ్ పార్ట్నర్‌షిప్ ఎక్సర్‌సైజ్ (ఎంపిఎక్స్- సముద్ర భాగస్వామ్య విన్యాసాలు) నిర్వహించాయి. ఫ్రెంచి నావికాదళపు లా ఫెయెట్ క్లాస్ యుద్ధ నౌక సర్కౌఫ్ 26-29 జూన్ 2023 వరకు విశాఖపట్నాన్ని సందర్శించి, భారతీయ నావికాదళ ఓడలతో కలిసి పలు కార్యకలాపాలలో పాల్గొన్నాయి. ఇందులో వృత్తిపరమైనన, సామాజిక పరస్పర చర్యలు, క్రీడా అమరికలు, సహా క్రాస్ డెక్ సందర్శనలు జరిగాయి.
విశాఖపట్నం నుండి బయలుదేరినపు్పడు, ఎఫ్ఎస్ సర్కౌఫ్ ఐఎన్ రాణా సుమేధా పలు విన్యాసాలను చేపట్టింది. ఇందులో వ్యూహాత్మక విన్యాసాలు, రెప్లెనిష్‌మెంట్ ఎట్ సీ (ఆర్ ఎఎస్ - సముద్రంలో సరుకు నింపే) విధానాలు, యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా వైమానిక రక్షణ, క్రాస్ డెక్ హెలికాప్టర్ కార్యకలాపాలు ఉన్నాయి.
రెండు నౌకాదళాల మధ్య సన్నిహిత స్నేహాన్ని పునరుద్ఘాటిస్తూ ఓడల మధ్య సంప్రదాయ వీడ్కోలు స్టీమ్ పాస్ట్‌తో ఎంపిఎక్స్ ముగిసింది. భారతదేశానికి ఎఫ్ఎస్ సర్కౌఫ్ సందర్శన బలమైన నౌకాదళం నుంచి నౌకాదళం సంబంధాలు, పరస్పర చర్య, భారత నావికాదళం, ఫ్రెంచ్ నౌకాదళాల మధ్య బలమైన బంధాలను సూచిస్తుంది.
ఇంతకు, ఈ ఏడాది, యుద్ధ నౌక ఎఫ్ఎస్ లా ఫయేట్, మిస్ట్రల్ - క్లాస్ ఉభయచర దాడి చేసే వర్గపు నౌక ఎఫ్ఎస్ డిక్స్‌మ్యూడ్ లు కూడా గైడెడ్ మిస్సైల్ ఓడ సహ్యాద్రితో 10-11 మార్చి 2023వరకు ఎంపిఎక్స్‌లో పాల్గొన్నాయి.
***
(Release ID: 1936787)
Visitor Counter : 220