ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 మార్చి తో ముగిసిన త్రైమాసికంలో పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్‌ పై - త్రైమాసిక నివేదిక

Posted On: 30 JUN 2023 7:14PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ, బడ్జెట్ విభాగానికి చెందిన పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ సెల్ (పి.డి.ఎం.సి), 2010-11 ఏప్రిల్-జూన్ (క్యూ-1) నుంచి, క్రమం తప్పకుండా రుణ నిర్వహణపై త్రైమాసిక నివేదికలను రూపొందిస్తోంది.  ప్రస్తుత నివేదిక 2022-23 జనవరి-మార్చి (క్యూ4 ఎఫ్.వై. 2022-23) త్రైమాసికానికి సంబంధించినది. 

 

 

ఎఫ్.వై-23 క్యూ-4 లో, కేంద్ర ప్రభుత్వం డేటెడ్ సెక్యూరిటీల జారీ / సెటిల్‌మెంట్ ప్రాతిపదికన 2,74,000 కోట్ల రూపాయలు, స్విచ్‌ ల కోసం సర్దుబాటు చేసిన తర్వాత 2,72,468.3 కోట్ల రూపాయలు సమీకరించింది.   జారీ చేసిన వెయిటెడ్ యావరేజ్ ఈల్డ్ (డబ్ల్యూ.ఏ.వై) ఈ త్రైమాసికంలో 7.34 శాతం కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి 7.32 శాతంగా ఉంది.  2022-23 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో జారీల వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ (డబ్ల్యూ.ఏ.ఎం) 16.58 సంవత్సరాలు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి 16.05 సంవత్సరాలుగా నమోదయ్యింది. 2023 జనవరి-మార్చి లో, కేంద్ర ప్రభుత్వ నగదు పరిస్థితి మిగులులో ఉండగా, ప్రభుత్వం డబ్ల్యూ.ఎం.ఏ. లో ఒక రోజు మాత్రమే ఉంది.

 

 

తాత్కాలిక సమాచారం ప్రకారం, ప్రభుత్వ మొత్తం రుణాలు (‘పబ్లిక్ అకౌంట్’ కింద మొత్తం రుణాలు, ప్రస్తుత మారకపు ధరల ప్రకారం బాహ్య రుణంతో సహా) 2022 డిసెంబర్ చివరి నాటికి 1,48,49,525 కోట్ల రూపాయలు కాగా  2023 మార్చి చివరి నాటికి స్వల్పంగా పెరిగి    1,55,59,574   కోట్ల రూపాయలకు చేరాయి.   2022-23 మూడవ త్రైమాసికం నుంచి 4వ త్రైమాసికానికి ఇది  4.8 శాతం పెరుగుదలను సూచిస్తోంది.  ఇంకా, దాదాపు 29.1 శాతం గడువు తేదీ ఉన్న సెక్యూరిటీలలో 5 సంవత్సరాల కంటే తక్కువ మెచ్యూరిటీ ఉంది.

 

 

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా దేశీయ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడి గట్టిపడింది; ప్రపంచ వస్తువుల ధరలలో పెరుగుదల; ప్రధాన కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.   అయితే, 2022-23 చివరి త్రైమాసికంలో దిగుబడి కదలికలు అస్థిరంగానే ఉన్నాయి.  10 సంవత్సరాల బెంచ్‌-మార్క్ సెక్యూరిటీపై రాబడి త్రైమాసికం ముగిసే సమయానికి 2022 డిసెంబర్, 30వ తేదీన 7.33 శాతం ఉండగా, 2023 మార్చి 31వ తేదీ నాటికి 7.31 శాతానికి తగ్గింది, తద్వారా ఈ త్రైమాసికంలో 2 బి.పి.ఎస్. తగ్గింది.

 

 

సెకండరీ మార్కెట్‌ లో, త్రైమాసికంలో 7-10 సంవత్సరాల మెచ్యూరిటీ బకెట్‌ లలో ట్రేడింగ్ కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయి, ఎందుకంటే 10 సంవత్సరాల బెంచ్‌-మార్క్ సెక్యూరిటీలో ఎక్కువ ట్రేడింగ్ గమనించడం జరిగింది.   సమీక్షలో ఉన్న త్రైమాసికంలో సెకండరీ మార్కెట్లో  “కొనుగోలు” డీల్స్‌ లో 28.09 శాతం, “అమ్మకం” డీల్స్‌ లో 27.56 శాతం వాటాతో విదేశీ బ్యాంకులు ఆధిపత్య ట్రేడింగ్ సెగ్మెంట్‌ గా ఉద్భవించగా, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాథమిక డీలర్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ అనుసరించాయి.  నికర ప్రాతిపదికన, సహకార బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాథమిక డీలర్లు నికర అమ్మకందారులుగా ఉండగా, విదేశీ బ్యాంకులు, ఎఫ్‌ఐ.లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ‘ఇతరులు’ సెకండరీ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు.  కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల యాజమాన్యం నమూనా ప్రకారం వాణిజ్య బ్యాంకుల వాటా 2022 డిసెంబర్ చివరి నాటికి 36.1 శాతంగా ఉండగా, 2023 మార్చి చివరి నాటికి 36.6 శాతానికి పెరిగింది.

 

 

2023 మార్చి తో ముగిసిన త్రైమాసికంలో పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్‌పై పూర్తి నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

Quarterly Report on Public Debt Management for the quarter ended March 2023

 

 

****


(Release ID: 1936717) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi