రక్షణ మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఏడేళ్ల సేవలను పూర్తి చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్
Posted On:
30 JUN 2023 3:04PM by PIB Hyderabad
దేశీయంగా తయారు చేసిన తేలిక పాటి యుద్ధ విమానం (ఎల్.సి.ఎ) తేజస్ భారత వైమానిక దళంలోకి చేరి,, 01 జూలై 2023 నాటికి ఏడేళ్లు కావొస్తోంది. తేజస్ వాయుసేనలో ఏడేండ్ల సేవలను పూర్తి చేసుకుంది. 2003లో తేజస్గా మార్చబడిన ఈ ఎయిర్క్రాఫ్ట్ బహుళ-పాత్ర ప్లాట్ఫారమ్, దాని తరగతిలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ఇది ఎయిర్ డిఫెన్స్, మెరిటైమ్ రికనైసెన్స్, స్ట్రైక్ పాత్రలను చేపట్టేందుకు రూపొందించబడింది. అంతర్లీనంగా అస్థిరమైన తేజస్ మేటి నిర్వహణ మరియు మెరుగైన యుక్తిని అందిస్తుంది. ఈ సామర్ధ్యం దాని మల్టీ-మోడ్ ఎయిర్బోర్న్ రాడార్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్ మరియు లేజర్ డిజిగ్నేషన్ పాడ్తో మరింతగా మెరుగుపరచబడింది. తేజస్ను ప్రవేశపెట్టిన మొదటి ఐఏఎఫ్ స్క్వాడ్రన్ నంబర్ 45 స్క్వాడ్రన్, 'ఫ్లయింగ్ డాగర్స్'. సంవత్సరాలుగా, స్క్వాడ్రన్ దాని ప్రస్తుత స్టీడ్తో అమర్చబడటానికి ముందు, వాంపైర్ల నుండి గ్నాట్స్కి మరియు తరువాత మిగ్-21 బిస్లోకి అభివృద్ధి చెందింది. ఫ్లయింగ్ డాగర్స్ ద్వారా ఎగురవేయబడిన ప్రతి విమానం భారతదేశంలో తయారు చేయబడింది - లైసెన్స్ ఉత్పత్తి కింద లేదా భారతదేశంలో రూపకల్పన మరియు అభివృద్ధి చేయబడిందే. మే 2020లో, నెం 18 స్క్వాడ్రన్ తేజస్ను నిర్వహించే రెండవ ఐఏఎఫ్ యూనిట్గా మారింది. మలేషియాలో ఎల్ఐఎంఏ -2019, దుబాయ్ ఎయిర్ షో-2021, శ్రీలంక వైమానిక దళం వార్షికోత్సవ వేడుకలు 2021, ఎయిర్ షో- 2022 మరియు 2017 నుండి 2023 వరకు ఏరో ఇండియా షోలతో సహా పలు అంతర్జాతీయ ఈవెంట్లలో విమానాలను ప్రదర్శించడం ద్వారా ఐఏఎఫ్ భారతదేశ స్వదేశీ ఏరోస్పేస్ సామర్థ్యాలను ప్రదర్శించింది. ఇది ఇప్పటికే దేశీయంగా విదేశీ వైమానిక దళాలతో విన్యాసాలలో పాల్గొనగా, మార్చి 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఎక్స్-డెసర్ట్ ఫ్లాగ్లె పాల్గొంది విదేశీ గడ్డపై తేజస్ యొక్క తొలి విన్యాసం ఇది . తేజస్లో83 ఎల్సీఏ ఎంకే-1కె కోసం దాని ఆర్డర్ను కలిగి ఉంది. ఇందులో అప్డేట్ చేయబడిన ఏవియానిక్స్, అలాగే యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్టీర్డ్ రాడార్, అప్డేట్ చేయబడిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మరియు బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. కొత్త వేరియంట్ పెరిగిన స్టాండ్-ఆఫ్ పరిధుల నుండి అనేక ఆయుధాలను కాల్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వీటిలో చాలా ఆయుధాలు స్వదేశీ మూలానికి చెందినవి. ఎల్.సి.ఏ ఎంకే-1ఎ విమానం యొక్క మొత్తం స్వదేశీ కంటెంట్లో గణనీయమైన ఎదుగుదలను చూస్తుంది. ఈ విమానాల ఒప్పంద డెలివరీలు ఫిబ్రవరి 2024లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో, ఎల్.సి.ఎ మరియు దాని భవిష్యత్ వైవిధ్యాలు భారత వైమానిక దళానికి ప్రధాన స్థావరంగా మారతాయి.
***
(Release ID: 1936709)
Visitor Counter : 158