నౌకారవాణా మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని ద్వారక, గోప్‌నాథ్ మరియు వెరావల్‌లోని చారిత్రక లైట్‌హౌస్‌ల వద్ద అద్భుతమైన పర్యాటక సౌకర్యాలను 1 జూలై 2023న శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు
Posted On:
30 JUN 2023 5:40PM by PIB Hyderabad
భారతదేశ విశిష్టమైన లైట్‌హౌస్‌లను ఆకట్టుకునే వారసత్వ పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన దృక్పథానికి అనుగుణంగా, ద్వారక, గోపనాథ్ మరియు వెరావల్ నగరాలలో జూలై 1, 2023న గుజరాత్‌లోని ద్వారకలో పర్యాటక సౌకర్యాలను ప్రారంబించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తూ, ఈ అద్భుతమైన నిర్మాణాలు ఘన సంస్కృతి, ప్రాముఖ్యత మరియు ఆకర్షణను ప్రదర్శించడం ఈ చొరవ లక్ష్యం.
'మన్ కీ బాత్' యొక్క 75వ ఎపిసోడ్ సందర్భంగా, గౌరవ ప్రధాన మంత్రి లైట్‌హౌస్‌ల ప్రత్యేక ఆకర్షణలు పర్యాటక ఆకర్షణలుగా కాగల వాటి సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. "పర్యాటకానికి సంబంధించినంతవరకు లైట్ హౌస్‌లు ప్రత్యేకమైనవి. వాటి భారీ పరిమాణం కారణంగా, లైట్ హౌస్‌లు ఎల్లప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. పర్యాటకాన్ని పెంచడం కోసం డీ జీ ఎల్ ఎల్ భారతదేశంలో మరో 72 లైట్‌హౌస్‌లను కూడా గుర్తించింది.
ప్రధానమంత్రి దార్శనికత నుండి ప్రేరణ పొందిన ఈ మహత్తర సందర్భం నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం మరియు ప్రచారం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది తద్వారా సందర్శకులకు మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ అనుభవాన్ని అందిస్తుంది. తరతరాలుగా నావికులకు సేవలందించిన ఈ లైట్‌హౌస్‌లు ప్రముఖ మైలురాళ్లు ఇప్పుడు ఈ లైట్‌హౌస్‌ల వద్ద ప్రపంచ స్థాయి పర్యాటక సౌకర్యాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. కొత్తగా ప్రారంభించబడిన సౌకర్యాలు ఆధునిక సౌకర్యాలతో చారిత్రక శోభను మిళితం చేస్తాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు సాటిలేని గమ్యస్థానాన్ని సృష్టిస్తాయి.
ప్రారంభోత్సవానికి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షత వహిస్తారు, గౌరవ ప్రముఖులు మరియు విశిష్ట అతిథి శ్రీ రాఘవభాయ్ హన్స్‌రాజ్‌భాయ్ పటేల్, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ మంత్రి, ప్రభుత్వం, గుజరాత్, శ్రీమతి. పూనంబెన్ మాడమ్, ఎంపీ (ఎల్‌ఎస్), జామ్‌నగర్, శ్రీ రాజేష్‌భాయ్ చుడాసమా, ఎంపీ (ఎల్‌ఎస్), జునాఘర్, శ్రీ గౌతంభాయ్ చౌహాన్, ఎమ్మెల్యే, తలజా, శ్రీ పబూభా మానెక్, ఎమ్మెల్యే, ద్వారకా, శ్రీ విమలభాయ్ చూడాసమా, ఎమ్మెల్యే, సోమనాథ్ మరియు శ్రీ టి కె రామచంద్రన్, కార్యదర్శి , ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పర్యాటక సౌకర్యాన్ని సందర్శించే సందర్శకులు ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, ఆకర్షణీయమైన దృశ్య శ్రవణ ప్రదర్శనలు మరియు గైడెడ్ టూర్‌ల ద్వారా లైట్‌హౌస్ యొక్క గొప్ప చరిత్రను అన్వేషించడానికి అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం ఒక విశాలమైన వీక్షణ డెక్‌ను కలిగి ఉంటుంది, ఇది చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యం మరియు నగరం యొక్క తీరప్రాంత దృశ్యాల ఉత్కంఠభరితమైన వీక్షణలను అందిస్తుంది.
ఈ పర్యాటక సదుపాయం యొక్క ప్రారంభోత్సవం ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తి ని సూచిస్తుంది . మన విశిష్ట వారసత్వాన్ని ప్రదర్శించే శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యాన్ని సృష్టించే మన సమిష్టి స్ఫూర్తి కి, దృష్టికి నిదర్శనం.
***
(Release ID: 1936558)
Visitor Counter : 148