వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫాస్ట్ ట్రాక్ విధానంలో సమస్యలను పరిష్కరించడానికి వీలుగా సేవల మెరుగుదల బృందానికి అవకాశం కల్పించే ఈ-లాగ్స్ ప్లాట్-ఫారమ్ పై పారిశ్రామిక సంఘాలు తమ అభిప్రాయాలను తప్పక తెలియజేయాలి
సమస్యల సత్వర పరిష్కారంతో, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎస్.ఐ.జి. సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోంది
Posted On:
29 JUN 2023 8:46PM by PIB Hyderabad
జాతీయ లాజిస్టిక్ విధానానికి అనుగుణంగా ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో తమ సమస్యలను సర్వీస్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ (ఎస్.ఐ.జి) పరిష్కరించడంలో సహాయపడటానికి వీలుగా తమ సమస్యలను తెలియజేయడం కోసం, పారిశ్రామిక సంఘాలు ఈ-లాగ్స్ ప్లాట్-ఫారమ్ లో పాల్గొనాలి. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఎస్.ఐ.జి. 5వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డి.పి.ఐ.ఐ.టి), లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా మాట్లాడుతూ, ఈ విషయాన్ని తెలియజేశారు. వాణిజ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యలన్నీ వాటాదారులను సంతృప్తి పరిచేలా, ఈ సమావేశంలో విజయవంతంగా పరిష్కరించడం జరిగింది.
ఒకవైపు వివిధ వ్యాపార, పారిశ్రామిక సంఘాల క్రియాశీలక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు వారిలో అపారమైన విశ్వాసాన్ని పెంపొందించడమే ఎస్.ఐ.జి. ప్రధాన కార్యక్రమం. గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలపై తదుపరి చర్యలతో పాటు, ఈ సమావేశంలో పారిశ్రామిక సంఘాలు పేర్కొన్న కొత్త సమస్యలపై కూడా విస్తృతంగా చర్చించారు.
ఇలావుండగా, ఓడరేవులో షిప్పింగ్ లైన్లలో అనుమతించని అన్ని నౌకలపై వి.పి.ఏ. విధించిన ప్రాధాన్యతా బెర్తింగ్ ఛార్జీలను ఇప్పుడు ప్రాధాన్యతా బెర్తింగ్‌ని ఎంచుకునే నౌకలకు మాత్రమే వర్తించే ఛార్జీలతో ఉపసంహరించుకుంటున్నట్లు సమావేశంలో పాల్గొన్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వి.పి.ఏ) ప్రతినిధి తెలియజేశారు. ఈ పెట్టుబడిదారుల స్నేహపూర్వక చర్య, లాజిస్టిక్ ఖర్చుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, విశాఖపట్నం పోర్టుకు కాల్ చేయడానికి షిప్పింగ్ లైన్లను ప్రోత్సహిస్తుంది. వి.పిఏ. తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని పారిశ్రామిక సంఘాలు ఎంతో మెచ్చుకున్నాయి, ఎందుకంటే ఇది చాలా కాలంగా పెండింగు లో ఉన్న ఈ సమస్య, ఇప్పుడు ఎస్.ఐ.జి. ద్వారా పరిష్కరించడం జరిగింది.
వీటితో పాటు, షిప్పింగ్ ఖర్చులను తగ్గించడం, పెద్ద ఓడల కాల్స్ కోసం ప్రధాన ఓడరేవులలో డ్రాఫ్ట్‌లను మెరుగుపరచడం వంటి అదనపు అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే, అన్ని ప్రధాన ఓడరేవుల వద్ద షిప్పింగ్ ఖర్చులను హేతుబద్ధం చేయవలసిన అవసరాన్ని ఎస్.ఐ.జి. నొక్కి చెప్పింది, ఇది వాటిని మరింత పోటీగా, ఆర్థికంగా లాభదాయకంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది, తద్వారా దేశవ్యాప్తంగా లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి.
అదేవిధంగా, ప్రధాన విమానాశ్రయ టెర్మినల్ కార్యకలాపాలను ప్రైవేటీకరించినందున, వ్యయ హేతుబద్ధీకరణ ఆవశ్యకత గురించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతినిధితో చర్చించడం జరిగింది. అలాగే, ఎలక్ట్రానిక్ బిల్లు ఆఫ్ లాడింగ్ (ఇ-వే బిల్లు) ను బ్యాంకులు ఆమోదించాలన్న పరిశ్రమ స్థిరమైన డిమాండ్ ఒక సమస్యగా ఉంది, దీన్ని కూడా సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించాలని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
ముఖ్యంగా, ఈ-లాగ్ పోర్టల్ లో ఇప్పటివరకు 29 పారిశ్రామిక / వ్యాపార సంఘాలను నమోదు చేయడం జరిగింది. వాటి సమస్యల సత్వర పరిష్కారం కోసం వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లకు నేరుగా తమ సమస్యలు తెలియజేయడానికి వీలుగా యూజర్ ఐ.డి., పాస్‌వర్డ్ లను అందించడం జరిగింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేషనల్ లాజిస్టిక్ పాలసీని 2022 సెప్టెంబర్, 17వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. జాతీయ లాజిస్టిక్స్ పాలసీ వివిధ లక్ష్యాలలో, భారతదేశంలో లాజిస్టిక్స్ ధరను 2030 నాటికి జి.డి.పి. లో అంచనా వేసిన 14 శాతం నుండి గ్లోబల్ బెస్ట్ 8 శాతానికి తగ్గించడం ప్రధానమైనది. ఈ విధానం భారతీయ వస్తువులను మరింత పోటీగా మార్చడంతో పాటు, ఈ రంగంలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విధానం మొత్తం లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ వృద్ధికి విస్తృత, బహుళ-న్యాయపరిధి, క్రాస్-ఫంక్షనల్ ఫ్రేమ్‌వర్క్ ను సులభతరం చేయడంతో పాటు, అధిక ధర, అసమర్థత వంటి సమస్యలను పరిష్కరిస్తుంది అని భావిస్తున్నారు.
స్టేక్ హోల్డర్ ఇంటర్-ఫేస్ ను మెరుగుపరచడం, తద్వారా ఇంటర్-ఆపరేబిలిటీని ప్రోత్సహించడం, జోక్యానికి సంబంధించిన ప్రాంతాల గుర్తింపును ప్రోత్సహించడం వంటివి నేషనల్ లాజిస్టిక్ పాలసీకి చెందిన ఫ్రేమ్- వర్క్‌లలో ఒకటి. దీనిని 'సర్వీస్ ఇంప్రూవ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్' అని పిలుస్తారు. ఈ రంగం వృద్ధికి ఆటంకం కలిగించే సమస్యలను గుర్తించడం, ప్రత్యేకించి, అంతర్-మంత్రిత్వ స్వభావంతో పాటు, తగిన జోక్యం ద్వారా వాటిని పరిష్కరించడంవంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
ఈ సమస్యలు ప్రక్రియలు, విధానాలపై అడ్డంకులుగా ఉండవచ్చు, వ్యాపారాన్ని సులభంగా చేయడంలో ఆటంకం కలిగిస్తాయి, ఇది లాజిస్టిక్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక లాజిస్టిక్ సంబంధిత సమస్యల చర్చను కూడా కలిగి ఉంటుంది. సంక్లిష్ట ప్రక్రియలు, అధిక డాక్యుమెంటేషన్ వంటి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలను పాలనా యంత్రాంగానికి సూచించండి. లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన అపరిష్కృత సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే క్రమంలో వినియోగదారులతో పరస్పర చర్య కోసం ఇప్పటికే ఉన్న యంత్రాంగాన్ని డిజిటలైజేషన్ తో పాటు బలోపేతం చేయడం అవసరం.
ఈ సందర్భంలోనే డి.పి.ఐ.ఐ.టి., లాజిస్టిక్స్ డివిజన్ లో ఎస్.ఐ.జి. ని ఏర్పాటు చేయడం జరిగింది. లాజిస్టిక్స్ ప్రత్యేక కార్యదర్శి దీనికి చైర్‌పర్సన్ మరియు కన్వీనర్ గా, లాజిస్టిక్స్ సంయుక్త కార్యదర్శి దీనికి డిజిగ్నేటెడ్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. రెవెన్యూ శాఖ, సెంట్రల్ బోర్డు అఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ, నీతి ఆయోగ్ తో సహా 13 సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన సభ్యులు ఈ ఎస్.ఐ.జి. లో నోడల్ అధికారులుగా ఉన్నారు. లాజిస్టిక్స్ సంబంధిత పరిశ్రమ సంఘాలకు ఎస్.ఐ.జి. జోక్యం అవసరమయ్యే సమస్యలు, ఇతర ఇబ్బందులను తెలియజేయడానికి అవకాశం కల్పించిన నమోదిత వాటాదారులతో 'ఈ-లాగ్స్' అనే ఈ సాంకేతిక ప్లాట్-ఫారమ్ ద్వారా ఎస్.ఐ.జ. పరస్పర సంప్రదింపులు జరుపుతుంది.
లాజిస్టిక్స్ రంగానికి చెందిన అనేక ప్రసిద్ధ పరిశ్రమ సంఘాలలో - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), అసోసియేషన్ ఆఫ్ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ఏ.ఎం.టి.ఓ.ఐ), కంటైనర్ షిప్పింగ్ లైన్స్ అసోసియేషన్ (సి.ఎస్.ఎల్.ఏ), ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ (ఐ.ఎన్.ఎస్.ఏ.), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఎఫ్.ఐ.ఈ.ఓ) వంటి కొన్ని ప్రధాన సంస్థలు ప్రస్తుతం వాణిజ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎస్.ఐ.జి. తో నిమగ్నమై ఉన్నాయి. అందువల్ల, లాజిస్టిక్స్ రంగంలో సుపరిపాలనతో పాటు, వాటాదారుల విస్తరణను మెరుగుపరచడానికి సాంకేతిక ప్లాట్-ఫారమ్ లను ఉపయోగించాలనేది ఈ-లాగ్స్ పోర్టల్ లక్ష్యం.
*****
(Release ID: 1936355)
Visitor Counter : 162