ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి అధ్యక్షత న జరిగిన ప్రగతి 42వ సమావేశం
10 రాష్ట్రాల లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల లో 1,21,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినపన్నెండు కీలక ప్రాజెక్టుల పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి
రాజ్ కోట్, జమ్ము, అవంతిపురా, బీబీనగర్, మదురై,రేవాడీ మరియు దర్భాంగా లలో ఎఐఐఎమ్ ఎస్ ల నిర్మాణం లో పురోగతి పైన కూడా సమీక్ష ను నిర్వహించిన ప్రధానమంత్రి
పిఎం స్వనిధి పథకం పై ప్రధాన మంత్రి సమీక్ష నునిర్వహిస్తూ, పట్టణప్రాంతాల లో అర్హులైన వీధి వ్యాపారస్తులు అందరి ని గుర్తించాలని, వారి ని ఈ పథకం లో చేర్చాలని ప్రధానకార్యదర్శుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు
‘స్వనిధి సే సమృద్ధి’ ప్రచార ఉద్యమం మాధ్యంద్వారా స్వనిధి పథకం యొక్క లబ్ధిదారుల కుటుంబ సభ్యులు అందరి కి ప్రభుత్వ పథకాలప్రయోజనాలు అందేటట్టు చూడాలని ఆదేశాలు ఇచ్చిన ప్రధాన మంత్రి
Posted On:
28 JUN 2023 7:42PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రమేయం ఉన్నటువంటి ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ఈ రోజు న 42 వ సమావేశం న జరగగా, ఆ సమావేశాని కి అధ్యక్షత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వహించారు.
ఈ సమావేశం లో 12 కీలక ప్రాజెక్టుల పై సమీక్ష ను నిర్వహించడమైంది. ఈ 12 ప్రాజెక్టుల లో ఏడు ప్రాజెక్టు లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కు చెందినవి. రెండు ప్రాజెక్టు లు రైల్ వే మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు లు. వీటికి అదనం గా రహదారి రవాణా, హైవే స్ మంత్రిత్వ శాఖ; ఉక్కు మంత్రిత్వ శాఖ; పెట్రోలియం, సహజ వాయువు ల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు లు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ల మొత్తం వ్యయం 1,21,300 కోట్ల కు పైనే. ఈ ప్రాజెక్టు లు పది రాష్ట్రాలు.. ఛత్తీస్ గఢ్, బిహార్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా, హరియాణా లతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. జమ్ము- కశ్మీర్; దాద్ రా మరియు నగర్ హవేలీ లకు చెందినవి.
ప్రధాన మంత్రి రాజ్ కోట్, జమ్ము, అవంతిపురా, బీబీనగర్, మదురై, రేవాడీ మరియు దర్ భాంగాల లో ఎయిమ్స్ నిర్మాణం తో ముడిపడ్డ ప్రాజెక్టు ల పురోగతి పైన కూడా సమీక్ష ను నిర్వహించారు. ఈ ప్రాజెక్టుల కు గల ప్రజాప్రాధాన్యాన్ని దృష్టి లో పెట్టుకొని నిర్మాణంలో భాగస్వాములు గా ఉన్న వారంతా పెండింగు పడ్డ అంశాల ను పరిష్కరించాలని, ప్రజల కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టుల ను అనుకొన్న సమయసీమ ప్రకారం అమలుపరచాలని ప్రధాన మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ‘పిఎం స్వనిధి స్కీము’ ను గురించి కూడా సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు... ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని అర్హులైన వీధి వ్యాపారులందరినీ గుర్తించి అందరికీ కవరేజి లభించేలా చూడాలని ప్రధాన కార్యదర్శులను ఆయన కోరారు. వీధి వ్యాపారులందరూ డిజిటల్ లావాదేవీలు నిర్వహించేలా ఉద్యమ స్ఫూర్తితో వారిని ప్రోత్సహించాలని ఆయన ఆదేశించారు. స్వనిధి సే సమృద్ధి అభియాన్ ద్వారా స్వనిధి లబ్ధిదారుల కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.
జి-20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాన కార్యదర్శులందరినీ ప్రధాన మంత్రి అభినందించారు. ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న ఈ సమావేశాల ప్రయోజనాలు గరిష్ఠంగా అందేలా చూడాలని, ప్రధానం గా పర్యటన ను మరియు ఎగుమతుల ను ప్రోత్సమించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
‘ప్రగతి’ సమావేశాల క్రమం లో, ఇప్పటివరకు 17.05 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన 340 ప్రాజెక్టుల పైన సమీక్షల ను నిర్వహించడం జరిగింది.
************
DS/ST
(Release ID: 1936218)
Visitor Counter : 168
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada