వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కరువు సంసిద్ధత, ఖరీఫ్ పంట సాగు , కేంద్ర ప్రాయోజిత, కేంద్ర రంగ పథకాల అమలుపై బీహార్ ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్‌తో సమీక్షించిన రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి శుభ ఠాకూర్

Posted On: 28 JUN 2023 6:59PM by PIB Hyderabad

బీహార్ రాష్ట్రంలో  కరువు సంసిద్ధత, ఖరీఫ్ పంట సాగు , కేంద్ర ప్రాయోజిత, కేంద్ర రంగ పథకాల అమలుపై బీహార్ ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్‌తో  రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీమతి శుభ ఠాకూర్ ఈరోజు సమీక్షించారు. బీహార్ కృషి భవన్ లో జరిగిన సమీక్షా సమావేశానికి  ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (పంటలు) శ్రీమతి శుభా ఠాకూర్ సహ-అధ్యక్షత వహించారు.  వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ  శ్రీ సంజయ్ అగర్వాల్ కూడా సమావేశానికి హాజరయ్యారు.  రాష్ట్రంలో కేంద్ర కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ  పథకాలు అమలు జరుగుతున్న తీరును సమావేశంలో వివరంగా సమీక్షించారు. పాట్నా ఐఎండీ  అధికారి ( ఇంచార్జి) డాక్టర్ ఆనంద్ శంకర్‌తో పాటు భారత ప్రభుత్వ రైస్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ మాన్ సింగ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై  ప్రభుత్వ వ్యవసాయ డైరెక్టర్ శ్రీ అలోక్ రంజన్ ఘోష్ వివరణాత్మక ప్రదర్శనను అందించారు. బీహార్ కరువు సంసిద్ధత కోసం ఇప్పటికే చేపట్టిన చర్యలను వివరించారు. వివిధ పథకాలు  అమలు జరుగుతున్న తీరు సమావేశంలో చర్చకు వచ్చింది. 

 

బీహార్‌లో కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం సలహాలు సూచనలు అందించిందని  దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అవసరమైతే మరిన్ని  చర్యలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.  రుతుపవనాలు బీహార్‌ చేరుకున్నాయని  రాబోయే కొద్ది రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ  అధికారులు వివరించారు. వర్షపాతం  ప్రస్తుతానికి సంతృప్తికరంగా లేనప్పటికీ, రాబోయే రెండు వారాల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భవిష్యత్తు ఔట్‌లుక్ ఆశాజనకంగా ఉందని అధికారులు తెలిపారు. 

 అవసరమైతే డీజిల్, విత్తనాలు సబ్సిడీ పై సరఫరా చేసి రైతులను అడ్డుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని  చర్యలకు బీహార్ సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి  తెలిపారు.  ఇప్పటికే కంటింజెంట్ క్రాప్ స్కీమ్ అమల్లో ఉందని అధికారులు వివరించారు. అవసరమైన మొత్తంలో విత్తనాలు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. బీహార్ రాజ్య బీజ్ నిగమ్  41 వేల క్వింటాళ్ల 15 రకాల పంటలకు ముందస్తుగా టెండర్లు వేయడం వేసింది. కెవికెలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు  వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయాన్నిప్రోత్సహిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.  బీహార్ విద్యుత్ శాఖ కూడా నీటిపారుదల సౌకర్యాలు కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 18-20 గంటల నిరంతర విద్యుత్‌ను అందజేస్తుంది. ఇంకా వివరణాత్మక కరువు నివారణ ప్రణాళిక జిల్లా వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు.

రాష్ట్రానికి సంబంధించిన నోడల్ అధికారుల సమక్షంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ  పథకాలు అమలు జరుగుతున్న తీరును వివరంగా సమీక్షించారు.  బీహార్ రాష్ట్ర స్థాయి మంజూరు కమిటీ (SLSC) సమావేశం 30.6.2023న జరగనుంది. చర్చల సందర్భంగా నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించి, తదుపరి నిధుల విడుదలకను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా నిధులు వినియోగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.  దక్షిణ బీహార్‌లో పంటల వైవిధ్యభరితమైన ప్రాంతాన్ని పరిశీలిస్తామని, మొక్కజొన్న మరియు మినుములు వంటి పంటలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

 

ప్రదర్శనలు, వ్యవసాయ పనిముట్లు, విత్తనోత్పత్తి, ఇన్‌పుట్‌ల పంపిణీ వంటి కేంద్ర పథకాలలోని అన్ని భాగాలకు, రాష్ట్రం తప్పనిసరిగా జియో రెఫరెన్సింగ్‌ను నిర్వహించాలని సంయుక్త్ర కార్యదర్శి  శ్రీమతి శుభా ఠాకూర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను కూడా ఆమె  తెలియజేశారు. శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌లు, కేవీకేలతో సమావేశాలు నిర్వహించాలని ఆమె సూచించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విస్తరణ ప్రయత్నాలు సమిష్టిగా అమలు జరగాలని అన్నారు. స్వయం సహాయక గ్రూపు సభ్యుల ప్రమేయాన్ని పెంచడానికి పిఎల్ఐ ప్రయోజనాలను పొందేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ , పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పధకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. 

కరువు వంటి పరిస్థితి ఏర్పడితే ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు అమలు చేసే అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన అన్ని అత్యవసర  ప్రణాళికలు చర్చకు వచ్చాయి. . రైతులకు ఇన్‌పుట్‌లు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారు.

 

***

 


(Release ID: 1936216) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Punjabi