మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

"రిపోర్ట్ ఫిష్ డిసీజ్" యాప్‌ను కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా ప్రారంభించారు


ఈ యాప్ చేపల రైతులు, క్షేత్రస్థాయి అధికారులు మరియు చేపల ఆరోగ్య నిపుణులను సజావుగా ఏకీకృతం చేయడానికి ఒక కేంద్ర వేదికగా ఉంటుంది.

ఈ యాప్‌ను ఉపయోగించే రైతులు నేరుగా జిల్లా మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో అనుసంధానం కాగలుగుతారు

పీ ఎం ఎం ఎస్ వై పథకం కింద ఎన్ ఎస్ పీ ఏ ఏ డీ యొక్క రెండవ దశ అమలు కోసం మత్స్య శాఖ మూడు సంవత్సరాల కాలానికి ₹33.78 కోట్లు కేటాయించింది.

Posted On: 28 JUN 2023 5:28PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, భారత ప్రభుత్వం  “రిపోర్ట్ ఫిష్ డిసీజ్” ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్‌ను ఈ రోజు ఇక్కడ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్ సమక్షంలో ప్రారంభించారు.  శ్రీ జె.ఎన్. స్వైన్, సెక్రటరీ, ఫిషరీస్ శాఖ, ఎం ఓ ఎఫ్ ఏ హెచ్ & డీ, డాక్టర్ అభిలాక్ష్ లిఖి, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్, ఎం ఓ ఎఫ్ ఏ హెచ్ & డీ మరియు డాక్టర్ హిమాన్షు పాఠక్, సెక్రటరీ, డీ ఏ ఆర్ ఈ & డీ జీ, ఐకర్, న్యూ ఢిల్లీ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. "డిజిటల్ ఇండియా"  దార్శనికతకు దోహదం చేసే, 'రిపోర్ట్ ఫిష్ డిసీజ్'ని ఐకర్-నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్, లక్నో అభివృద్ధి చేసింది. జలచర జంతు వ్యాధుల కోసం జాతీయ నిఘా కార్యక్రమం కింద ఈరోజు ప్రారంభించబడింది.

 

నేపథ్య సమాచారం 

 

పీ ఎం ఎం ఎస్ వై పథకం కింద ఎన్ ఎస్ పీ ఏ ఏ డీ యొక్క రెండవ దశ అమలు కోసం మత్స్య శాఖ మూడేళ్ల కాలానికి ₹33.78 కోట్లను కేటాయించింది. ఈ యాప్ ప్రారంభంతో, ఎన్ ఎస్ పీ ఏ ఏ డీ పారదర్శక రిపోర్టింగ్ ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ బాధ్యతలను తీర్చగలిగింది. యాప్ లబ్దిదారులను అనుసంధానం చేయడానికి కేంద్ర వేదికగా ఉంటుంది. చేపల రైతులు, క్షేత్రస్థాయి అధికారులు మరియు చేపల ఆరోగ్య నిపుణులను ఈ యాప్ సజావుగా ఏకీకృతం చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న వ్యాధి సమస్యను గతం లో గుర్తించకుండా లేదా ముందుగా నివేదించని వాటిని ఇది ఇప్పుడు నేరుగా నిపుణులకు చేరవేస్తుంది మరియు తక్కువ వ్యవధిలో సమస్య సమర్థవంతంగా పరిష్కరించబడుతుంది.

 

లాభాలు:

 

ఈ యాప్‌ను ఉపయోగించే రైతులు నేరుగా జిల్లా మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో అనుసంధానం కాగలుగుతారు. రైతులు మరియు లబ్దిదారులు ఈ యాప్ ద్వారా తమ పొలాల్లో ఫిన్ ఫిష్, రొయ్యలు మరియు మొలస్క్‌ల వ్యాధులను స్వయంగా నివేదించవచ్చు, దీని కోసం మన శాస్త్రవేత్తలు/నిపుణులు రైతులకు అదే యాప్ ద్వారా శాస్త్రీయ సాంకేతిక సహాయం అందిస్తారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మరియు రైతులకు అందించబడుతున్న శాస్త్రీయ సలహాలు రైతులకు వ్యాధుల కారణంగా వారి నష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి. దేశంలోని చేపల పెంపకందారులచే వ్యాధి నివేదనను మరింత బలోపేతం చేస్తాయి.

***



(Release ID: 1936206) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil