సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

'ఛాంపియన్స్ 2.0 పోర్టల్', సమూహ ప్రాజెక్టుల జియో టాగింగ్ కోసం మొబైల్ యాప్, టెక్నాలజీ సెంటర్స్' మరియు మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'ఎం ఎస్ ఎం ఇ' ఐడియా హకెతాన్ 3.0' ప్రారంభించిన శ్రీ నారాయణ్ రాణే .


దేశ స్థూలదేశీయోత్పత్తి, ఎగుమతుల పెంపులో ఎంఎస్ఎంఇ ల పాత్రను శ్రీ రాణే ఉద్ఘాటించారు. 2030 నాటికి దేశ స్థూలదేశీయోత్పత్తిలో సగం ఎంఎస్ఎంఇల ద్వారా రాగలదనే ఆశాభావాన్ని రాణే వ్యక్తం చేశారు.

Posted On: 27 JUN 2023 9:16PM by PIB Hyderabad

 

       అంతర్జాతీయ  ఎంఎస్ఎంఇ దినోత్సవం సందర్బంగా సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ 'ఉద్యమి భారత్ - ఎంఎస్ఎంఇ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంది.   కేంద్ర  ఎంఎస్ఎంఇ  శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ గౌరవఅతిథిగా హాజరయ్యారు.  

       ఈ సందర్భంగా సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థల  ప్రగతి, అభివృద్ధికి మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు ఉపక్రమణలను  'ఛాంపియన్స్ 2.0 పోర్టల్',  సమూహ ప్రాజెక్టుల జియో టాగింగ్ కోసం మొబైల్ యాప్,  టెక్నాలజీ సెంటర్స్' మరియు 'ఎం ఎస్ ఎం ఇ' ఐడియా హకేతాన్ 3.0' ను ముఖ్యఅతిథి,  గౌరవఅతిథి ప్రారంభించారు.  అంతేకాక  'ఎం ఎస్ ఎం ఇ' ఐడియా హకేతాన్ 2.0'  ఫలితాలను ప్రకటించి మహిళా పారిశ్రామికవేత్తలకు  'ఎం ఎస్ ఎం ఇ' ఐడియా హకేతాన్ 3.0'  ప్రారంభించారు.  
       
       ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేశ స్థూలదేశీయోత్పత్తి, ఎగుమతుల పెంపులో ఎంఎస్ఎంఇ ల పాత్రను శ్రీ రాణే ఉద్ఘాటించారు.  
2030 నాటికి దేశ స్థూలదేశీయోత్పత్తిలో సగం ఎంఎస్ఎంఇల ద్వారా రాగలదనే ఆశాభావాన్ని రాణే  వ్యక్తం చేశారు.  ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చడానికి చర్యలు తీసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.  

      దేశ ఆర్హిక వ్యవస్థ వృద్ధిలో ఎంఎస్ఎంఇల పాత్రను ప్రశంసిస్తూ 2014 తరువాత స్థూలదేశీయోత్పత్తి ర్యాంకింగ్ లో ఇండియా స్థితి  10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగిందని సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ అన్నారు.  

      ఈ సందర్బంగా ఇరువురు కేంద్ర మంత్రులు ధ్రువీకరణ పత్రాలను పంపిణీచేసి ప్రేరేపణ కలిగించారు.  ప్రధానమంత్రి ఉపాధి ఉత్పత్తి కార్యక్రమం (పి ఎం ఇ జి పి) యూనిట్ల లబ్ధిదారులు 10,075 మందికి 400 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని కూడా ఉత్సవాలలో విడుదల చేశారు.

     ఈ సందర్బంగా పలు సంస్థల మధ్య  కుదిరిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వాటిలో  ఎన్ టి ఎస్ సి చెన్నై,  హైదరాబాద్ లలో ఎలక్ట్రానిక్స్  శ్రేష్ఠత కేంద్రం ఏర్పాటుకు ఎన్ ఎస్ ఐ సి, ఎల్ జి ఎలక్ట్రానిక్స్, భారత ఎలక్టానిక్స్ రంగ నైపుణ్య మండలి   మధ్య ,   పి ఎం వికాస్ (ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్) పోర్టల్ సృష్టికి  ఎంఎస్ఎంఇ,  చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) మధ్య కుదిరిన ఒప్పందాలు కూడా  ఉన్నాయి.  

        మంత్రిత్వ శాఖ స్కీములు,  ఉపక్రమణలకు  కార్యక్రమంలో విశేషంగా ప్రచారం కల్పించారు. అంతేకాక   వ్యాపార వాతావరణం  పెంపునకు మంత్రిత్వ శాఖ చేస్తున్న యత్నాలను   ప్రస్తావీస్తూ  సహనీయ /ధారణీయ అలవాట్లను ఆచరించవలసిందిగా ఎం ఎస్ ఎం ఇ లను ప్రోత్సహించారు.


 

****



(Release ID: 1936108) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Marathi , Hindi