వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఇథనాల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు / ప్రాజెక్టు పూర్తికి గడువును 2023 సెప్టెంబర్ 30కి పొడిగించిన కేంద్రం


1,244 కోట్ల లీటర్లకు పెరిగిన ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం

2023 జూన్ 11 నాటికి చమురు మార్కెట్ కంపెనీలకు (ఓ ఎం సి) డిస్టిల్లరీల నుంచి సరఫరా అయ్యే ఇథనాల్ 310 కోట్ల లీటర్లను దాటింది

ఇథనాల్ ప్రాజెక్టుల గడువును పెంచడం వల్ల వ్యవసాయ రంగం ఆర్హిక స్థితి వృద్ధిచెందుతుంది. అదేవిధంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గి విదేశ మారకద్రవ్యం ఆదా అవుతుంది. వాయు కాలుష్యం తగ్గుతుంది.

Posted On: 26 JUN 2023 9:42PM by PIB Hyderabad

       ఇథనాల్ ఉత్పత్తి  సామర్ధ్యం  పెంచడానికి వీలుగా చక్కర మిల్లులకు ఆర్ధిక సహాయం అందించే స్కీములో భాగంగా,  కొత్త డిస్టిల్లరీలు
/ ప్రస్తుతం ఉన్న డిస్టిల్లరీల విస్తరణకు / బాయిలర్ల ఏర్పాటుకు / కేంద్ర కాలుష్య బోర్డు ఆమోదించిన ఏ పధ్ధతి ఏర్పాటుకైనా బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సరళమైన నిబంధనలతో రుణాలు ఇప్పిస్తున్నది.   ద్రవాల ఉద్గారం లేకుండా చూడాలని కేంద్ర కాలుష్య బోర్డు నిర్దేశిస్తున్నది.  డిస్టిల్లరీలు తీసుకునే రుణాలపై బ్యాంకులు తీసుకునే వడ్డీలో కొంత మొత్తని ప్రభుత్వం భరిస్తుంది.   ప్రభుత్వం 2018-21 మధ్య  ప్రకటించిన స్కీముల కింద మంజూరు చేసే రుణాల పంపిణీ గడువును 2023 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.

       ఇంతకు ముందు ఇథనాల్ ప్రాజెక్టులకు సంబంధించిన రుణాల పంపిణీ  గడువు 2023 మార్చి 31 వరకు ఉండేది.   రుణ దరఖాస్తుల     ను పరిశీలించి ఆమోదించే ప్రక్రియలో ఎదురవుతున్న బహుళ సవాళ్లకు తోడుగా బహుళ సంస్థలతో  సమానవ్యయం కారణంగా ప్రతిపాదనలను బ్యాంకులు / ఆర్ధిక సంస్థలు పరిశీలించి పంపిణీ చేయడం నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేకపోయాయి.  అందువల్ల 2018-21 మధ్య కాలంలో ప్రకటించిన వడ్డీ తగ్గింపు / సబ్సిడీ స్కీముల కింద రుణాల పంపిణీ గడువును పొడిగించవలసిన అవసరం ఏర్పడింది.    వార్షిక వడ్డీలో 6% ప్రభుత్వం ఇవ్వడం   లేక బ్యాంకులు వసూలు చేసే వడ్డీలో  సగం సబ్సిడీ ఇవ్వడం,  ఏది తక్కువైతే అది కేంద్రం భరిస్తుంది.   ఒక సంవత్సరం మారటోరియం (రుణస్థగనం)తో సహా బ్యాంకులు ఐదేళ్ల కాలానికి ఇచ్చే రుణాలకు ఇది వర్తిస్తుంది.

        గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ విధానాల వల్ల మొలాసిస్ ఆధార డిస్టిల్లరీల (స్వేదనశాల) ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.  ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇథనాల్ మిశ్రిత పెట్రోలు (ఈ బి పి) కోసం సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  2023లో  ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం 1244 కోట్ల లీటర్లకు పెరిగింది.   గత తొమ్మిదేళ్లలో ఆయిల్ మార్కెట్ కంపెనీలకు ఇంధన శ్రేణి ఇథనాల్ ఉత్పత్తి, సరఫరా ఎనిమిది రేట్లు పెరిగింది.   అదే విధంగా మిశ్రణం శాతం 2021-22లో 12 శాతానికి చేరింది.  2025 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం 1700 కోట్ల లీటర్ల పెంచవలసి ఉంటుంది.  

        ఇథనాల్ ప్రాజెక్టులకు రుణ సహాయం గడువును పెంచడం వల్ల  ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం  పెంపునకు తద్వారా వ్యవసాయ
ఇథనాల్ ప్రాజెక్టుల గడువును పెంచడం వల్ల వ్యవసాయ రంగం  ఆర్హిక స్థితి వృద్ధిచెందుతుంది.   అదేవిధంగా విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుంది.  ముడి చమురు దిగుమతి  బిల్లు  తగ్గడం వల్ల  విదేశ మారకద్రవ్యం ఆదా అవుతుంది.  దాంతోపాటు వాయు కాలుష్యం తగ్గుతుంది.  




 

*******



(Release ID: 1935762) Visitor Counter : 147