విద్యుత్తు మంత్రిత్వ శాఖ

నిర్దిష్ట ధరకు పవర్ ప్లాంట్ల ద్వారా బయోమాస్ గుళికలను కొనుగోలు చేయడం కోసం బయోమాస్ కో-ఫైరింగ్ విధానాన్ని సవరించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ


ప్రభుత్వ నిర్ణయం, ఇంధన భద్రతను పెంపొందించడానికి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఒక అడుగు: కేంద్ర విద్యుత్ ఎన్ఆర్ఈ మంత్రి ఆర్.కె. సింగ్

ఈ నిర్ణయం రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అలాగే థర్మల్ పవర్ యుటిలిటీస్ కి స్థిరమైన బయోమాస్ సరఫరా గొలుసును స్థాపించడానికి, కృషి చేయడానికి ప్రోత్సహిస్తుంది.

Posted On: 27 JUN 2023 4:08PM by PIB Hyderabad

థర్మల్ పవర్ ప్లాంట్లలో (టిపిపిలు) కో-ఫైరింగ్ కోసం ఉపయోగించే బయోమాస్ గుళికల ధరలను నిర్దిష్ఠ ప్రమాణానికి ఖరారు చేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ (ఎంఓపి) నిర్ణయించింది. బయోమాస్ గుళికల మార్కెట్ పరిస్థితులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, గుళికల తయారీ సంస్థలు, రైతులు, బ్యాంకర్లు మొదలైన వాటితో సహా వాటాదారుల నుండి స్వీకరించిన అభ్యర్థనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బెంచ్‌మార్క్ చేసిన ధర వ్యాపార సాధ్యత, విద్యుత్ టారిఫ్‌పై ప్రభావం, పవర్ యుటిలిటీల ద్వారా సమర్థవంతమైన వేగవంతమైన పెల్లెట్ సేకరణను పరిగణనలోకి తీసుకుంటుంది. గుళికల ధర బెంచ్‌మార్కింగ్ టిపిపి లు అలాగే పెల్లెట్ విక్రేతలు గుళికల సహ-ఫైరింగ్ కోసం స్థిరమైన సరఫరా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది. సిఈఏ క్రింద కమిటీ ఖరారు చేసిన బెంచ్‌మార్క్ ధర 1 జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది.

కమిటీ సిఫార్సులను అమలు చేసే వరకు, పవర్ యుటిలిటీలు తమ టిపిపిలకు బయోమాస్ గుళికల తక్షణ అవసరాన్ని తీర్చడం కోసం స్వల్పకాలిక టెండర్లకు వెళ్ళాలి. ఇంధన భద్రత, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, అదే సమయంలో రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లలో బయోమాస్‌ను కో-ఫైరింగ్ చేయడం ప్రభుత్వ ప్రధాన విధానమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ అన్నారు. సవరించిన విధానం ఈ లక్ష్యాలను వేగంగా సాధించడంలో సహాయపడుతుంది.

నిర్ణయాన్ని వివరిస్తూ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ మాట్లాడుతూ, రైతులు, పారిశ్రామికవేత్తలతో పాటు థర్మల్ పవర్ యుటిలిటీలు స్థిరమైన బయోమాస్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, కో-ఫైరింగ్ కోసం లక్ష్యాలను సాధించడానికి, స్టబుల్ బర్నింగ్‌ను తగ్గించడానికి, నిర్ధారించడానికి ఈ నిర్ణయం ప్రోత్సహిస్తుందని చెప్పారు. భారతదేశ పౌరులకు పరిశుభ్రమైన మరియు పచ్చని భవిష్యత్తుకి ఇది మార్గం వేస్తుంది. 

విధానం మరొక సవరణలో, దేశంలో ప్రస్తుతం టొర్రిఫైడ్ బయోమాస్ గుళికల లభ్యత పరిమితంగా ఉన్నందున, టోర్రిఫైడ్ గుళికలను సాంకేతికంగా అనివార్యమైన యుటిలిటీల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని, నాన్-టొర్రీఫైడ్ పెల్లెట్‌లను ఉపయోగించగల యుటిలిటీలు ఉండాలని నిర్దేశించారు. 

థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గుతో బయోమాస్‌ను కోఫైరింగ్ చేయడం తప్పనిసరి చేసే బయోమాస్ విధానానికి అనుగుణంగా, ఇప్పటివరకు  దేశంలోని 47 థర్మల్ పవర్ ప్లాంట్‌లలో 64,350 మెగావాట్ల సామర్థ్యంతో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బయోమాస్ ఇంధనం సహ-ఫైరింగ్ చేయబడింది. వీటిలో,  50000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో అందించారు.  ఇది గతంలో ఎన్నడూ లేని అత్యధిక వార్షిక పరిమాణాన్ని కూడా అధిగమించింది. ఇంకా,  సుమారు 114 మిలియన్ మెట్రిక్ టన్నుల బయోమాస్ గుళికలు  టెండరింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా 69 లక్షల మెట్రిక్ టన్నుల బయోమాస్ గుళికలకు  కొనుగోలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎంఓపి నుండి సమర్థ్ మిషన్ ద్వారా అమలులో ఉన్న ఎనేబుల్ విధానాలు,  దేశవ్యాప్తంగా టిపిపిలలో బయోమాస్ కోఫైరింగ్ గణనీయమైన వృద్ధిని చూపుతున్నాయి.

****



(Release ID: 1935760) Visitor Counter : 121