మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
జలచర జంతువుల వ్యాధుల కోసం జాతీయ కార్యక్రమం(ఎన్ఎస్పీఏఏడీ) కింద ఏసీఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్(ఐసీఏఆర్ ఎన్బీఎఫ్ జీఆర్) అభివృద్ధి చేసిన ‘రిపోర్ట్ ఫిష్ డిసీజ్’ యాప్ను కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా ప్రారంభించనున్నారు.
Posted On:
27 JUN 2023 4:41PM by PIB Hyderabad
గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వాకల్చర్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రస్తుతం(2021–-22) ఈ రంగం నుండి మొత్తం ఎగుమతుల ఆదాయాలు సుమారు రూ.57,586.48 కోట్లు . అయినప్పటికీ, ఆక్వాకల్చర్ పెరుగుదలకు వ్యాధులు ప్రధాన అవరోధంగా మారాయి. జబ్బులను ముందస్తుగా గుర్తించడానికి, తద్వారా వాటి ప్రభావాలను తగ్గించడానికి జలచర జంతు వ్యాధులపై నిఘా అవసరం. నిర్మూలన మరియు నియంత్రణ కోసం వ్యాధులను ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. క్షేత్రస్థాయి వ్యాధి నివేదన యంత్రాంగం అందుబాటులో లేకపోవడం వల్ల ఆక్వాకల్చర్‌లో అనేక వ్యాధుల కేసులు నివేదించబడవు. అందువల్ల, రైతులు, క్షేత్రస్థాయి అధికారులు మరియు మత్స్య ఆరోగ్య నిపుణులను అనుసంధానించే యంత్రాంగం అవసరం.
ఈ విషయంలో.. రైతు ఆధారిత వ్యాధి నివేదన వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మరియు దేశంలోని జలచర వ్యాధుల నివేదికను మెరుగుపరచడం కోసం..
మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి మురుగన్ ఫిషరీస్ శాఖ సెక్రెటరీ ఐఏఎస్ శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ , ఫిషరీస్ శాఖ ఓఎస్డీ డాక్టర్ ఐఏఎస్ డాక్టర్ అభిలాక్ష్ లిఖి, డేర్&డీజీ సెక్రెటర్ డా. హిమాన్షు పాఠక్, ఫిషరీస్ సైన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జే.కె జెనా, ఎన్ఎస్పీఏఏడీ కో–ఆర్డినేటర్(ఐసీఏఆర్) డాక్టర్ జుజ్జవరపు బాలీజీ మెరైన్ జాయింట్ సెక్రెటరీ, ఇతర అధికారుల సమక్షంలో 28 జూన్, 2023న కృషి భవన్‌లో , కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ పర్షోత్తం రూపాలా రిపోర్ట్ ఫిష్ డిసీజ్ (ఆర్ఎఫ్డీ)యాప్ ని ప్రారంభిస్తారు. ఈ యాప్‌ను ICAR-NBFGR నేషనల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఆక్వాటిక్ యానిమల్ డిసీజెస్ (NSPAAD) కింద అభివృద్ధి చేసింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చింది.
యాప్ రైతులకు తమ పొలాల్లో ఉన్న ఫిన్ ఫిష్, రొయ్యలు మరియు మొలస్క్‌లలో వచ్చే వ్యాధులను క్షేత్ర స్థాయి అధికారులు మరియు చేపల ఆరోగ్య నిపుణులతో నివేదించడంలో ఆర్ఎఫ్డీ యాప్ సహాయం చేస్తుంది. వ్యాధిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు రైతులకు శాస్త్రీయ సలహాలను పొందడంలో ఇది సహాయపడుతుంది. వ్యాధులకు సంబంధించిన డేటా తాత్కాలిక & ప్రాదేశిక స్థాయిలో నిల్వ చేయబడుతుంది. అంతేకాకుండా వ్యాధి కేసులను మ్యాపింగ్ చేయడానికి ఈ యాప్ను ఉపయోగించవచ్చు.
రైతు ఆధారిత రిపోర్టింగ్‌ను మెరుగుపరచడంలో, శాస్త్రీయ సలహాలు పొందడంలో మరియు వ్యాధుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో.. తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఈ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. అలాగే, ఫిష్ డిసీజ్ రిపోర్టింగ్ యాప్ ఫిష్ డిసీజ్ మేనేజ్‌మెంట్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ముందస్తుగా గుర్తించడం, వేగవంతమైన ప్రతిస్పందన, సహకారం మరియు పరిష్కార మార్గాలను ఒకరితో మరకొరు పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది చేపల ఉత్పత్తి, పరిశ్రమలు మరియు పర్యావరణ వ్యవస్థలపై చేపల వ్యాధుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడం ద్వారా ఆక్వాకల్చర్ వ్యవస్థల స్థిరత్వం మరియు స్థితిస్థాపకతకు దోహదం చేస్తుంది.
ఆక్వాకల్చర్ రైతులు, మత్స్యకారులు, రాష్ట్ర &కేంద్రపాలిత ప్రాంతాల మత్స్య అధికారులు, మత్స్య శాస్త్రవేత్తలు మరియు సంబంధిత అధికారులందరూ ఈ కార్యక్రమంలో చేరాలని కేంద్రం కోరింది. ఇది వివిధ నేపథ్యాల నుండి ప్రజలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి రావడానికి వీలు కల్పిస్తుంది. ప్రతిస్పందన, మరియు ఆక్వాకల్చర్ పరిశ్రమలో సమర్థవంతమైన నిర్వహణ వ్యూహాల అమలకు వీరందరి భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుంది.
దిగువ అందించిన లింక్ ద్వారా పాల్గొనేవారు ప్రోగ్రామ్‌లో చేరవచ్చు:
లింక్: https://dof-vc.webex.com/dof-vc/j.php?MTID=mc18ca9bbedcc19b4210d410e774ef094
బుధవారం, జూన్ 28, 2023, 3:00 పీఎం | ఢిల్లీ
సమావేశ సంఖ్య: 2552 235 3903
పాస్‌వర్డ్: Y4pJ2AmKdG2 (94752265 వీడియో సిస్టమ్‌ల నుండి)
***
(Release ID: 1935756)
Visitor Counter : 145