విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత పరిశ్రమలో ఇంధన సామర్ధ్య (ఎనర్జీ ఎఫిషియెన్సీ ) టెక్నాలజీల స్వీకరణను వేగవంతం చేయడానికి ఉత్ప్రేరక్ (యుటిపిఆర్ఇఎకె) అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ


భారత పరిశ్రమల ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి యుటిపిఆర్ఇఎకె సహాయపడుతుంది: కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్

ఎన్ డి సి ల కింద భారత దేశ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి ఇంధన సామర్ధ్య టెక్నాలజీలు కీలకం: ఇంధన శాఖ కార్యదర్శి

Posted On: 26 JUN 2023 8:48PM by PIB Hyderabad

స్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలు స్వీకరించడాన్ని వేగవంతం చేయడానికి , తద్వారా ప్రపంచ ఇంధన మార్పు లో భారతదేశ సహకారాన్ని పెంచడానికి భారత ప్రభుత్వ ఇంధన  మంత్రిత్వ శాఖ ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది. ఉత్ప్రేరక్ అని పిలువబడే (సంక్షిప్తంగా ఉన్నత్ తక్నికి ఆదర్శ్ కేంద్ర ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు యాక్సిలరేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీస్ భారతీయ పరిశ్రమల ఇంధన శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఉత్ప్రేరక పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తుంది. అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ సెంటర్ (ఎఐటీడీసీ)గా నామకరణం చేసిన ఈ కేంద్రాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బి ఇ ఇ ) విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ పి టి ఐ) న్యూఢిల్లీ క్యాంపస్ బదర్ పూర్ లో ఏర్పాటు చేసింది. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ ఈ కేంద్రాన్ని 2023, జూన్ 26న న్యూఢిల్లీలోని ఎన్.పి.టి.ఐ బదర్పూర్ లో ప్రారంభించారు.

 

ఇండస్ట్రియల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై ఈ కేంద్రం కీలక రిఫరెన్స్, రిసోర్స్ ఇన్ స్టిట్యూషన్ గా మారాలన్నది లక్ష్యం.  పేరుకు తగ్గట్టు ఈ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెమాన్ స్ట్రెషన్ సెంటర్ కీలక పారిశ్రామిక రంగాలలో ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రదర్శిస్తుంది. ఆవిష్కరిస్తుంది. ఇది ఎగ్జిబిషన్ కమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గా, విజ్ఞాన భాండాగారంగా పనిచేస్తుంది. వర్క్ షాప్ లు, సెమినార్ల ద్వారా పారిశ్రామిక రంగ నిపుణులు వివిధ కీలక రంగాలకు చెందిన ఉత్తమ పద్ధతులను పంచుకునే నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ ఫామ్ ఇది.

 

వచ్చే ఐదేళ్లలో 10,000 మందికి పైగా ఎనర్జీ ప్రొఫెషనల్స్ కు శిక్షణ ఇవ్వనున్నారు.

 

యుటిపిఆర్ఇఆర్ఎకె  ఒక వ్యూహాత్మక సామర్థ్య-నిర్మాణ సంస్థగా కూడా పనిచేస్తుంది. ఇంకా ఇంధన సామర్థ్యంలో శిక్షణలు, విద్య కోసం భారతదేశం అంతటా ఉన్న ఇంధన నిపుణులకు వన్-స్టాప్ సొల్యూషన్ ప్రొవైడర్ గా ఉంటుంది.  వచ్చే ఐదేళ్లలో పరిశ్రమ, ఇతర సంభావ్య రంగాలకు చెందిన 10,000 మందికి పైగా ఇంధన నిపుణులకు విస్తృత శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు.

 

వీటితో పాటు జాతీయ ఇంధన విధాన రూపకల్పన, ఇంధన సామర్ధ్య పరిష్కారాల్లో విద్య, పరిశోధనలను అనుసంధానం చేయడం, ఇంధన సామర్థ్యం కోసం వినూత్న అనువర్తిత పరిష్కారాలను అభివృద్ధి చేయడం వంటి కీలక అంశాలను కూడా ఈ కేంద్రం అందించనుంది.

 

"2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం కీలకం"

 

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాన మంత్రి కలను సాకారం చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ నొక్కి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్పత్తి తో ముడి పెట్టిన ప్రోత్సాహక పథకాలను (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్)  ప్రవేశపెట్టిందని, మనం పురోగతి సాధించడానికి, ప్రపంచ మార్కెట్ లో పోటీపడటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని మంత్రి పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్తమ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ పరిశ్రమల ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఉత్ప్రేరక్  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది; అంతేకాక, ఇంధనాన్ని ఆదా చేయడం పరిశ్రమకు మాత్రమే కాకుండా దేశానికి కూడా ప్రయోజనకరం‘ అన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ కేంద్రం లోగోను ఆవిష్కరించి బ్రోచర్ ను విడుదల చేశారు.

 

"ఎన్ డి సిల కింద భారతదేశ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీస్ కీలకం"

 

జాతీయంగా నిర్ణయించిన కంట్రిబ్యూషన్స్ (ఎన్ డిసి) కింద భారతదేశ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు కట్టుబాట్లను చేరుకోవడంలో ఇంధన-ఇంటెన్సివ్ టెక్నాలజీలు పోషించాల్సిన కీలక పాత్రను విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ప్రముఖంగా వివరించారు.

"గ్లాస్గోలోని కాప్ 26 లో, భారత ప్రధాని భారతదేశం కోసం నవీకరించిన ఎన్డిసిలను ప్రకటించారు, వీటిలో ఒకటి 2020 - 2030 మధ్య కాలంలో భారతదేశ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఒక  బిలియన్ టన్నుల కు తగ్గించడం. ఇందులో సగం పునరుత్పాదక శక్తి లోతుగా చొచ్చుకుపోవడం ద్వారా వస్తుంది, మిగిలిన సగం శక్తి-సామర్థ్య చర్యల నుండి వస్తుంది. బి ఇ ఇ  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ (పి ఎ టి ) కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. పిఎటి ప్రోగ్రామ్ ప్రారంభ దశలలో మెరుగైన నిర్వహణ పద్ధతుల ద్వారా ఇంధన సామర్ధ్య మార్జిన్లను ఎక్కువగా రాబట్టగలిగారు. ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, పేపర్, క్లోర్-ఆల్కలీ, టెక్స్ టైల్స్ వంటి రంగాల్లో ఇంధన ఆధారిత కొత్త టెక్నాలజీలను మన పరిశ్రమల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది‘ అన్నారు.

 

"అతి త్వరలో ఇండియన్ కార్బన్ మార్కెట్ ప్రారంభం కాబోతోంది"

 

ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడంలో పరిశ్రమకు సహాయపడటంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించాలని విద్యుత్ కార్యదర్శి అన్నారు. భారత్ త్వరలోనే భారత కార్బన్ మార్కెట్ ను ప్రారంభించబోతోందని, ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాలను పరిశ్రమకు ఇవ్వాలన్న ఆలోచన ఉందని అన్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి, ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో మన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ బృహత్తర ప్రయత్నం నేపథ్యంలోనే ఉత్ప్రేరక్ ను చూడాల్సి ఉంది' అని పేర్కొన్నారు.

 

ఈ కేంద్రాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన వ్యవస్థల గురించి కార్యదర్శి మాట్లాడుతూ, స్టీరింగ్ కమిటీ , సలహా మండలి ఆవశ్యకత వివరించారు. కేంద్రం నుంచి విలువను పొందాలంటే దాని సౌకర్యాలను నిరంతరం అప్ గ్రేడ్ చేసేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

బి ఇ ఇ కి బడ్జెట్ కింద విద్యుత్ మంత్రిత్వ శాఖ తగినన్ని నిధులు కేటాయిస్తుండగా, దాని మెరుగైన నిర్వహణకు కేంద్రంలోనే సమావేశమై అవసరమైన కార్యకలాపాలను సిఫారసు చేయడం, కార్యకలాపాలను పర్యవేక్షించే స్టీరింగ్ కమిటీ ఉండాలని అన్నారు. రెండవది, ఈ వేదికపై భాగస్వాములను ఎలా ఏకతాటిపైకి తీసుకురావాలో మనం చూడాలి, తద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం , పరిశ్రమల ద్వారా వాటి మోహరింపును వేగవంతం చేయడం వంటి కేంద్రం ప్రధాన లక్ష్యాలు సాధించబడతాయి. భాగస్వాములలో కొత్త ఇంజనీర్లు, ఎనర్జీ మేనేజర్లు, ఎనర్జీ ఆడిటర్లు, డెసిషన్ మేకర్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీల తయారీదారులు ఉన్నారు. వాటన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో కూడిన సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఇది కేంద్ర కార్యకలాపాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మార్గనిర్దేశం చేస్తుందని ఆన్నారు.

 

"కేంద్రం విజయాన్ని ఎనర్జీ-ఎఫిషియెన్సీ టెక్నాలజీస్ పరిశ్రమ స్వీకరణ రేటు ఆధారంగా అంచనా వేయాలి"

 

ఈ కేంద్రంలో నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అన్నింటికంటే ముఖ్యమని సెక్రటరీ చెప్పారు. పరిశ్రమలతో సంప్రదింపులు జరపడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా వినియోగించబడుతోందనే దాన్ని బట్టి ఈ కేంద్రం విజయాన్ని అంచనా వేయాలి. చివరగా, సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి,  విస్తరణ స్థాయికి చేరుకున్న తర్వాత, వాటిని గ్రాడ్యుయేట్ చేసి కొత్త సాంకేతికతలను లక్ష్యంగా చేసుకోవాలి, ‘‘కేంద్రం స్థిరంగా కాకుండా డైనమిక్ గా ఉండాలి‘‘ అన్నారు.

 

ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, పేపర్, క్లోర్-ఆల్కలీ, టెక్స్ టైల్స్  వంటి ఐదు పీఏటీ రంగాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి మూడు డెమో హాళ్లను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ముడి పదార్థాల కోసం ప్రీ-ప్రాసెసింగ్ వ్యవస్థలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు , ముడి పదార్థాలను బట్టీ కాల్సినర్ (కో-ప్రాసెసింగ్) ,వ్యర్థ ఉష్ణ రికవరీ వ్యవస్థలు వంటి వివిధ ఇంధన సమర్థవంతమైన సాంకేతికతలను ఈ హాళ్ళలో ప్రదర్శిస్తారు. ఎనర్జీ ప్రొఫెషనల్స్ కోసం లెర్నింగ్ సెషన్స్ వంటి శిక్షణ,. విద్యా కార్యకలాపాల కోసం ఈ కేంద్రంలో రెండు లెక్చర్ హాల్స్ కూడా ఉన్నాయి.

 

బి ఇ ఇ  మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై సహకారం, సాంకేతిక బదిలీని ఈ కేంద్రం చేపట్టనుంది. ఈ కేంద్రంలో పరిశోధనా కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్ సీసీబీఎం), సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీపీపీఆర్ ఐ), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ (ఎన్ ఐఎస్ ఎస్ టీ), జవహర్ లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్ మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ ఏఆర్ డీడీసీ), సౌత్ ఇండియా టెక్స్ టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (సిట్రా), నార్తర్న్ ఇండియా టెక్స్ టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (ఎన్ ఐటీఆర్ ఏ) వంటి వివిధ పరిశోధనా సంస్థలతో బి ఇ ఇ  భాగస్వామ్యం కుదుర్చుకోనుంది.  పరిశోధన -అభివృద్ధి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తిరిగి వాటిని ప్లాంట్లలో ప్రదర్శించవచ్చు.

 

గుర్తించిన రంగాలలో క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల కోసం పరిశోధన , అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ కేంద్రం ఒక ప్రాంతీయ కేంద్రంగా కూడా పనిచేస్తుంది (తరువాత ఇతర ఇంధన ఇంటెన్సివ్ రంగాలు చేర్చబడతాయి).

ఈ రంగాల డీకార్బనైజేషన్ కోసం కార్బన్ క్యాప్చర్, యూసేజ్ అండ్ స్టోరేజ్ (సీసీయూఎస్) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఇది పూర్తిస్థాయిలో పనిచేస్తే, నెట్ వర్కింగ్, కాన్ఫరెన్సింగ్, శిక్షణ , ఇంధన సమర్థవంతమైన సాంకేతికతలపై సమాచార వ్యాప్తి కోసం అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది.

 

ఈ సందర్భంగా బి ఇ ఇ, ఎన్ పి టి ఐ మధ్య సహకారానికి అవగాహన ఒప్పందం కుదిరింది.

 

విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ తివారీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డీజీ అభయ్ బక్రే , ఎన్ పి టి ఐ  డీజీ డాక్టర్ త్రిప్తా ఠాకూర్ , బి ఇ ఇ డీడీజీ డాక్టర్ అశోక్ కుమార్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు జితేష్ జాన్ తో పాటు  బి ఇ ఇ, ఎన్ పి టి ఐ అధికారులు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1935539) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi , Manipuri