చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించేందుకు చింత‌న శిబిర్‌ను నిర్వ‌హించిన న్యాయ‌, చ‌ట్ట మంత్రిత్వ శాఖ‌

Posted On: 25 JUN 2023 5:45PM by PIB Hyderabad

న్యాయ వ్య‌వ‌హారాల విభాగం, శాస‌న విభాగం ఆదివారం న్యూఢిల్లీలో అత్యంత విజ‌య‌వంత‌మైన చింత‌న్ శిబిర్‌ను నిర్వ‌హించాయి. కేంద్ర చ‌ట్ట‌, న్యాయ మంత్రిత్వ శాఖ స‌హాయ‌మంత్రి (ఇన్‌ఛార్జి) శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌, న్యాయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ నితేన్ చంద్ర‌, శాస‌న విభాగ ప్ర‌స్తుత ఇన్‌ఛార్జి కార్య‌ద‌ర్‌శి శ్రీ ఎస్‌.కె.జి. ర‌హాతే, కార్య‌క్ర‌మంలో గెస్ట్ స్పీక‌ర్ ఐటిఎటి &బికె విధాత్రి అధ్య‌క్షులు శ్రీ జి.ఎస్‌.ప‌న్నువంటి ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై, పాల్గొన్నారు.  


సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న, ప్ర‌ముఖుల‌కు ఔప‌చారిక స‌త్కారంతో శిబిరం ప్రారంభ‌మైంది. జీవితంలోని వివిధ కోణాల‌లో చ‌ట్టం & న్యాయ మంత్రిత్వ శాఖ ప్రాముఖ్య‌త‌ను, విజ‌యాల‌కు అద్దం ప‌డుతూ, యావ‌త్ భార‌త‌దేశ వృద్ధిలో దాని స‌హ‌కారాన్ని వివ‌రించే ఒక క్లుప్త స‌మాచార వీడియో డాక్యుమెంట‌రీని విభాగం ప్రారంభించింది. 
అద‌నంగా, ఈ సంద‌ర్భానికి మ‌రింత ప్రాముఖ్య‌త‌ను జోడిస్తూ,  డిఒఎల్ఎ ఎట్ ఎ గ్లాన్స్ః 2022-23 శీర్షిక‌తో ఒక కాఫీ టేబుల్ పుస్త‌కాన్ని ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.  ఇది 2022-23వ సంవ‌త్స‌రంలో కొన‌సాగుతున్న ప‌ని, విజ‌యాల వివ‌ర‌ణాత్మ‌క వివ‌ర‌ణ‌ను క‌లిగి ఉండి, ఉద్యోగుల అవిశ్రాంత ప్ర‌య‌త్నాలు, సామూహిక విజ‌యానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. 



న్యాయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ నితేన్ చంద్ర స్వాగ‌తోప‌న్యాసాన్ని చేయ‌గా, శాస‌న విభాగం ఇన్‌ఛార్జి కార్య‌ద‌ర్శి శ్రీ ఎస్‌.కె.జి. ర‌హాతే ప్ర‌సంగించారు. కార్య‌క్ర‌మంలో కీల‌కోప‌న్యాసం చేసిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ శ్రోత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, శిబిరాన్ని ఏర్పాటు చేసిన విభాగాన్ని ప్రశంసించారు. కొన‌సాగుతున్న కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు, పౌరులంద‌రికీ న్యాయం స‌మానంగా అందుబాటులో ఉంచేందుకు త‌న అంకిత‌భావాన్ని పున‌రుద్ఘాటించారు. కాలం చెల్లిన చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసి, సంక్లిష్ట‌మైన వాటిని స‌రళీకృతం చేయాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెబుతూ, ఈ ప్ర‌య‌త్నాల ద్వారా న్యాయ‌స్థానాల‌పై భారాన్ని త‌గ్గించ‌డం ప‌ట్ల త‌న నిబ‌ద్ధ‌త‌ను వ్య‌క్తం చేశారు. 
గౌర‌వ వ‌క్త బి.కె. విధాత్రి ప్ర‌సంగిస్తూ, హాజ‌రైన వారిని సంభాష‌ణ‌లో నిమ‌గ్నం చేస్తూ, త‌మ కంఫ్ట‌ర్ జోన్ (సౌక‌ర్య క్షేత్రం) నుంచి బ‌యిట‌కు వ‌చ్చి, బేధాల‌ను  అంతం చేసి, ఒక సంఘ‌టిత బృందంగా త‌మ ల‌క్ష్యాల‌ను సాధించేందుకు క‌లిసి ప‌ని చేసేందుకు వారిని ప్రేరేపించడంతో పాటు ప‌ని ఒత్తిడి, భారాన్ని పోరాడే స్ఫూర్తిని పెంపొందించారు. 

 


ప్రేర‌ణాత్మ‌క సెష‌న్ త‌ర్వాత‌, న్యాయ వ్య‌వ‌హారాల విభాగం, శాస‌న విభాగం, ఆదాపు ప‌న్ను అప్పెలేట్ ట్రిబ్యున‌ల్‌, కేంద్ర ఏజెన్సీ సెక్ష‌న్ ప్ర‌తినిధులు త‌మ త‌మ ప్రెజెంటేష‌న్లు ఇచ్చారు. 2049కి ముందు భార‌త‌దేశం విశేష వృద్ధిని సాధించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ దార్శ‌నిక‌త అయిన భార‌త స్వాతంత్య్ర అమృత్‌కాల్‌కు అనుగుణ‌మైన భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌డ‌మే కాక‌, విభాగాలు ఇప్ప‌టివ‌ర‌కూ సాధించిన విజ‌యాల స‌మ‌గ్ర స‌మీక్ష గురించి ఈ ప్రెజెంటేష‌న్ల‌లో వివ‌రించారు. 
అనంత‌రం, సిబ్బంది త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసేందుకు, సూచ‌న‌లు చేసేందుకు, ప్ర‌శ్న‌లు వేసేందుకు ప్ర‌శ్నోత్త‌ర సెష‌న్ ప్రారంభ‌మైంది. ప్ర‌తి అభిప్రాయానికి త‌గిన విలువ‌ను ఇవ్వ‌డం ద్వారా అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌ను పెంపొందించారు. 


అద‌న‌పు కార్య‌ద‌ర్శి, న్యాయ స‌ల‌హాదారు డాక్ట‌ర్ అంజు రతి రాణా వంద‌న స‌మ‌ర్ప‌ణ‌తో కార్య‌క్ర‌మానికి ముగింపు ప‌లికారు. అత్యంత ముఖ్య‌మైన చింత‌న్ శిబిర్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసినందుకు హాజ‌రైన వారంద‌రికీ ఆమె హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలుపుతూ, వారి అచంచ‌ల‌మైన నిబ‌ద్ధ‌త‌, అంకిత‌భావానికి ప్ర‌తి ఒక్క‌రిగా ప్ర‌గాఢ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

 

***



(Release ID: 1935276) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Hindi , Manipuri