విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఒడిశాలో 2 గి.వా. పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, 1 గి.వా. సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రిడ్‌కో ఒడిషాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌హెచ్‌పీసీ

Posted On: 24 JUN 2023 6:05PM by PIB Hyderabad

భారతదేశంలో అతి పెద్ద జల విద్యుత్ అభివృద్ధి సంస్థ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, ఒడిశా ప్రభుత్వానికి చెందిన గ్రిడ్‌కో ఒడిషాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. “ఒడిశాలో పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌లు (పీఎస్‌పీలు), పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు” ఈ ఒప్పందం కుదిరింది. ఒడిశా రాష్ట్రంలో కనీసం 2 వేల మెగావాట్ల స్వీయ గుర్తింపు పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, కనీసం వెయ్యి మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు (భూమిపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు /నీటిపై తేలే సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు) ఏర్పాటు చేయడం ఎంఓయూలో భాగం.

ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (స్ట్రాటజీ బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ) రజత్ గుప్తా, గ్రిడ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ త్రిలోచన్ పాండా ఎంఓయుపై 23 జూన్ 2023న సంతకం చేశారు. ఇంధన శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, గ్రిడ్‌కో ఛైర్‌పర్సన్‌ నికుంజ బి ధాల్‌ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు సంస్థల ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 1935046) Visitor Counter : 146