ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్-అమెరికా హైటెక్ హాండ్ షేక్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ

Posted On: 24 JUN 2023 7:24AM by PIB Hyderabad

వాషింగ్టన్  డీసీలో వైట్ హౌస్ లో ఈరోజు జరిగిన భారత్-అమెరికా హైటెక్ హాండ్ షేక్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ పాల్గొన్నారు. అమెరికా వాణిజ్య శాఖామంత్రి జినా రైమాండో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ అమెరికా, భారత  సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థల సీఈవోలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూశారు.’అందరికీ కృత్రిమ మేథ’, ‘మానవాళి కోసం తయారీ’ అనే అంశం మీద ఈ సమ్మేళనం దృష్టి సారించింది.  

భారత్-అమెరికా దేశాల మధ్య  సాంకేతిక సహకారాన్ని మరింత పటిష్ఠ పరచుకోవటానికి ఈ సమావేశం ఒక సదవకాశాన్నిచ్చింది. సాంకేతిక రంగ భాగస్వామ్యంలో ఇరుదేశాలూ పోషించాల్సిన పాత్ర మీద  ప్రధానంగా చర్చ జరిగింది. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ కోసం, ప్రపంచ మానవాళి కోసం కృత్రిమ మేథ వినియోగం మీద చర్చించారు.  రెండు దేశాల సాంకేతిక రంగ పర్యావరణాలలో ఇప్పుడున్న అనుసంధానాన్ని వాడుకోవటం మీద సీఈవోలు ప్రధానంగా చర్చించారు. భారతదేశంలో ప్రతిభావంతులైన నిపుణులు ఉండటం, డిజిటల్ ప్రజా మౌలిక వసతులు విస్తరించటం అంతర్జాతీయ సహకారానికి  బాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.  క్రమం తప్పకుండా పరస్పర సహకారం అవసరమని, తద్వారా వ్యూహాత్మక సహకారంతో ప్రమాణాలు మెరుగుపరచుకోగలమని, సరికొత్త ఆవిష్కరణలు  సాధ్యయమవుతాయని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్ – అమెరికా సాంకేతిక సహకారానికి  ఎంతో అవకాశం ఉందని, అది సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు.  నవకల్పనల సంస్కృతిని పెంచుతున్న భారత యువ ప్రతిభావంతుల పాత్రను ప్రధాని అభినందించారు.

భారత్-అమెరికా సాంకేతిక భాగస్వామ్యాన్ని  బయోటెక్నాలజీ, క్వాంటమ్ సహా కొత్త రంగాలకు విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు  బైడెన్  ఈ సందర్భంగా సీఈవో లకు పిలుపునిచ్చారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రజల, ప్రపంచ మెరుగైన భవిష్యత్ నిర్మాణానికి దోహదపడగలదని ఇరుదేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపార దిగ్గజాలు:  

1. రేవతి అద్వైతి , సీఈవో, ఫ్లెక్స్

2. శామ్ ఆల్ట్ మన్, సీఈవో, ఓపెన్ ఏఐ

3. మార్క్ డగ్లస్ , ప్రెసిడెంట్ అండ్ సీవో, ఎఫ్ ఎం సి  కార్పొరేషన్

4. లీసా సు , సీఈవో , ఏఎండీ

5. విల్ మార్షల్, సీఈవో, ప్లానెట్ లాబ్స్

6. సత్యా నాదెళ్ళ, సీఈవో, మైక్రోసాఫ్ట్  

7. సుందర పిచ్చాయ్, సీఈవో, గూగుల్

8. హేమా తనేజా, సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ కెటలిస్ట్

9. థామస్ టుల్, ఫౌండర్, టుల్కో ఎల్ ఎల్ సి   

10. సునీతా విలియమ్స్, నాసా వ్యోమగామి  

భారత్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు :

1. ఆనంద్ మహీంద్రా, ఛైర్మన్, మహీంద్రా గ్రూప్

2. ముఖేశ్ అంబానీ, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయెన్స్ ఇండస్ట్రీస్

3. నిఖిల్ కామత్, కో ఫౌండర్, జేరోధా అండ్ ట్రూ బీకన్

4. వృందా కపూర్, కో ఫౌండర్, థర్డ్ ఐ టెక్

 

*******



(Release ID: 1935024) Visitor Counter : 121