వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ ఉప ఉత్పతులుగా ఉత్పత్తి అయ్యే వంట పాత్రలకు IS 18267: 2023 ప్రామాణికం నిర్దేశించిన బిఐఎస్
పర్యావరణ పరిరక్షణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, వినియోగదారుల ప్రయాజనాల పరిరక్షణ లక్ష్యంగా ప్రమాణాల రూపకల్పన ప్రోత్సహిస్తుంది
త్వరగా భూమిలో కలిసిపోయే వంట గది పరికరాలకు పెరుగుతున్న గిరాకీ
ఉత్పత్తి రంగం లోకి ప్రవేశించనున్న పెద్ద-స్థాయి తయారీదారులు, ఎంఎస్ఎంఈ లకు ప్రయోజనం కల్గించనున్న బిఐఎస్
Posted On:
22 JUN 2023 8:35PM by PIB Hyderabad
వ్యవసాయ ఉప ఉత్పతులుగా ఉత్పత్తి అయ్యే వంట పాత్రలకు ప్రమాణాలు నిర్దేశిస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఉత్తర్వులు జారీ చేసింది. IS 18267: 2023 ప్రమాణాలు వ్యవసాయ ఉప ఉత్పతులుగా ఉత్పత్తి అయ్యే వంట పాత్రలకు వర్తిస్తాయని బిఐఎస్ పేర్కొంది.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, సుస్థిర అభివృద్ధి సాధించడం లక్ష్యంతో "ఆగ్రి ఉప-ఉత్పత్తుల నుండి తయారు చేసిన ఆహారాన్ని అందించే పాత్రలు - స్పెసిఫికేషన్"ను బిఐఎస్విడుదల చేసింది. తయారీదారులు, వినియోగదారులకు సమగ్ర మార్గదర్శకాలు అందిస్తుంది, దేశవ్యాప్తంగా నాణ్యత విధానాలు ఒకే విధంగా ఉండేలా బిఐఎస్ చర్యలు అమలు చేస్తుంది.
త్వరగా భూమిలో కలిసిపోయే వంట గది పరికరాలు ఉపయోగించడం వల్ల పర్యావరణ భద్రత, సహజ వనరులను సంరక్షించి వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి అవకాశం కలుగుతుంది. లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పించే విధంగా ప్రమాణాలు రూపొందాయి. వ్యవసాయ ఉప ఉత్పత్తులను ఉపయోగించి తయారయ్యే పాత్రల్లో హానికరమైన పదార్థాలు ఉండవు.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పాత్రలు ఉత్పత్తి అవుతాయి. శ్రేయస్సును నిర్ధారిస్తాయి. బిఐఎస్ నిర్దేశించిన ప్రమాణం వల్ల రైతులకు ఆర్థిక అవకాశాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అమలు లోకి రావడం వల్ల గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఒకసారి వాడి పారవేసి వస్తువుల వినియోగం పెరుగుతోంది. డిస్పోజబుల్ ప్లేట్ మార్కెట్ పరిమాణం 2020లో$ 4.26 బిలియన్‌గా ఉంది. 2028 నాటికి మార్కెట్ పరిమాణం $ 6.73 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇది 2021 నుంచి 2028 వరకు 5.94% వార్షిక వృద్ధి రేటు సాధించింది.
భారతదేశంలో అనేక పెద్ద, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాయి తయారీదారులు బయోడిగ్రేడబుల్ వంట పాత్రల ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బిఐఎస్ నిర్దేశించిన ప్రమాణంతో ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు. ఈ ఉత్పత్తులకు డిమాండ్ నిలకడగా పెరుగుతోంది, వారి ఉత్పత్తిలో పాల్గొన్న తయారీదారుల సంఖ్యలో స్థిరమైన వృద్ధికి దారి తీస్తుంది.
బయోడిగ్రేడబుల్ పాత్రల ఉత్పత్తికి ముడి పదార్థాలు, తయారీ పద్ధతులు, పనితీరు, పరిశుభ్రత అవసరాలతో సహా వివిధ అంశాలు ప్రమాణం పరిధిలోకి వస్తాయి. ప్లేట్లు, కప్పులు, గిన్నెలు లాంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ముడి పదార్థాలుగా ఆకులు , తొడుగులు వంటి వ్యవసాయ ఉప-ఉత్పత్తుల వినియోగాన్ని ఇది నిర్దేశిస్తుంది. మొక్కలు, చెట్ల భాగాల ఏ విధంగా ఉపయోగించాలి అన్న అంశాన్ని ప్రమాణం సిఫార్సు చేస్తుంది. హాట్ ప్రెస్సింగ్, కోల్డ్ ప్రెస్సింగ్, మౌల్డింగ్ , స్టిచింగ్ వంటి తయారీ సాంకేతికతలను అందిస్తుంది. పదునుగా ఉండే పరికరాల వినియోగం, రసాయనాల వినియోగాన్ని ప్రమాణం నిషేధిస్తుంది.
***
(Release ID: 1934697)
Visitor Counter : 166