రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మిలిటరీ నర్సింగ్ సర్వీస్ మేజర్ జనరల్ స్మితా దేవ్రాణి & బ్రిగ్ అమిత దేవ్రాణిలకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రదానం చేసిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 22 JUN 2023 3:57PM by PIB Hyderabad

సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్ఎస్) అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) మేజర్ జనరల్ స్మితా దేవ్రాణి మరియు బ్రిగేడియర్ ఎంఎన్ఎస్, ప్రధాన కార్యాలయం, సదరన్ కమాండ్ బ్రిగేడియర్ అమితలకు  2022 మరియు 2023 సంవత్సరాలకుగాను నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు ప్రదానోత్సవం జూన్ 22, 2023న న్యూఢిల్లీలో జరిగింది.

1973లో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు సమాజానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా అందజేస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దేవ్రాణి సోదరీమణులు చేసిన విశేషమైన సేవలకు  సముచితమైన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

మేజర్ జనరల్ స్మితా దేవ్రాణి 1983లో ఎంఎన్ఎస్లో నియమితులయ్యారు. అక్టోబర్ 01, 2021న ఎంఎన్ఎస్ ఏడీజీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కార్యాలయం బ్రిగేడియర్ ఎంఎన్ఎస్, సదరన్ కమాండ్ మాట్రాన్ కమాండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్, ఎంఎన్ఎస్ డైరెక్టర్(అడ్మిన్)వంటి  క్లినికల్, స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ నియామకాలను నిర్వహించారు.
బ్రిగేడియర్ అమితా దేవ్రాణి 1986లో  సర్వీసులోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 01, 2021న సదరన్ కమాండ్‌లోని ఎంఎన్ఎస్  బ్రిగేడియర్ గా  ప్రస్తుత ప్రస్తుత పదవిలో నియమితులయ్యారు.  ఆమె ఇంతకుముందు..  పుణేలోని కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్  ప్రిన్సిపల్,   కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఆర్మీ హాస్పిటల్, రీసెర్చ్ & రెఫరల్ మరియు కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇండియన్ నేవల్ హాస్పిటల్ షిప్ (ఐఎన్హెచ్ఎస్) అశ్విని, వైస్ ప్రిన్సిపాల్ గా అనేక ముఖ్య పదవులు నిర్వర్తించారు. అక్కాచెల్లెళ్లిద్దరూ ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ జిల్లాకు చెందినవారు.

 

***


(रिलीज़ आईडी: 1934633) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil