రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

న్యూదిల్లీలో మాల్దీవుల ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్‌తో సమావేశమైన ఎన్‌సీసీ డీజీ

Posted On: 22 JUN 2023 3:29PM by PIB Hyderabad

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్, న్యూదిల్లీలో, మాల్దీవుల కమాండెంట్, ఎన్‌సీసీ మెరైన్ కార్ప్స్ & కమాండింగ్ ఆఫీసర్ బ్రిగేడియర్‌ జనరల్ వైస్ వహీద్‌తో ఇవాళ సమావేశమయ్యారు.
భారతదేశ ఎన్‌సీసీ చరిత్ర, దేశవ్యాప్తంగా విస్తరణ, క్యాడెట్‌లు & శిక్షకుల శిక్షణ, భారతదేశం-మాల్దీవుల మధ్య యువత మార్పిడి కార్యక్రమం మాల్దీవుల అధికారికి ఈ సమావేశంలో వివరించారు. మాల్దీవుల ఎన్‌సీసీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై కూడా చర్చలు జరిగాయి. సవాళ్లను ఎదుర్కొనేందుకు మాల్దీవులకు మద్దతు అందించేందుకు ఎన్‌సీసీ భారత్‌ అంగీకరించింది. శిక్షకులు & క్యాడెట్‌ల కోసం ఎన్‌సీసీ ఇండియా నిర్వహిస్తున్న కోర్సుల్లో సభ్యులుగా మారాలని వారిని ఆహ్వానించింది.

రెండు దేశాల యువత మధ్య సాంస్కృతిక & చారిత్రక మార్పిడిని ప్రోత్సహించడం, సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా రెండు సంస్థల సహకారాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

 

******


(Release ID: 1934632) Visitor Counter : 111