మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
కృషి భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం- 2023 వేడుకలు
నాడు పోస్టు చేయడమైనది:
21 JUN 2023 2:39PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య విభాగం వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) -2023 వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ శాఖకు చెందిన అన్ని కార్యాలయాలు, స్వయంప్రతిపత్త సంస్థలలో దీనిని నిర్వహించారు. న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో జరిగిన ఐడీవై- 2023 కార్యక్రమంలో పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ కూడా ఐడీవై- 2023ని న్యూఢిల్లీలోని చంద్రలోక్ బిల్డింగ్‌లోని విస్తరణ కార్యాలయంలో దీనిని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2023 కార్యక్రమాలను నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 'యోగా ఫర్ వసుధైక కుటుంబం' ఇతివృత్తంతో దీనిని నిర్వహించారు. ఆరోగ్యం, శ్రేయస్సుకు దీనిని ఒక భారీ ఉద్యమంగా ఐడీవై-2023 నిర్వహించారు. ఈ కార్యకలాపాలలోకి మరింత ఎక్కువ మందిని తీసుకురావాలని డిపార్ట్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 1934307)
సందర్శకుల సూచీ సంఖ్య : : 123