సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ప్ర‌పంచ సికిల్ సెల్ అవ‌గాహ‌నా దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌

Posted On: 20 JUN 2023 12:10PM by PIB Hyderabad

ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌మూహాలు, కుటుంబాలు, వ్య‌క్తుల‌ను ప్ర‌భావితం చేసే సికిల్ సెల్ డిసీజ్ (ఎస్‌సిడి) గురించి అవ‌గాహ‌న‌ను పెంచేందుకు ప్ర‌తి ఏడాది 19 జూన్‌న ప్ర‌పంచ సికిల్ సెల్ అవ‌గాహ‌నా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు.  సికిల్ సెల్ వ్యాధి అనేది జ‌న్యుప‌ర‌మైన ర‌క్త రుగ్మ‌త‌, దీనిని అర్థ‌చంద్రాకారం లేదా కొడ‌వ‌లి రూపంలో ఉండే అసాధార‌ణ ఎర్ర‌టి ర‌క్త క‌ణాల ద్వారా వ‌ర్గీక‌రించ‌డ‌మే కాక అప‌క్ర‌మ రూపంలో ఉన్న క‌ణాల వ‌ల్ల‌ ర‌క్త నాళాల‌లో అడ్డంకులు ఏర్ప‌డి భిన్న‌మైన ఆరోగ్య ప‌రిణామాల‌కు దారి తీస్తుంది. ఈ ఏడాది సికిల్ వ్యాధి దినోత్స‌వ ఇతివృత్తం ప్ర‌పంచ సికిల్ సెల్ స‌మూహాల‌ను నిర్మించి, బ‌లోపేతం చేయ‌డం, న‌వ‌జాత శిశువుల స్క్రీనింగ్‌ను అధికారికంగా చేయ‌డం & మీ సికిల్ సెల్ వ్యాధి స్థితిని తెలుసుకోవ‌డం.
సికిల్ సెల్ వ్యాధిపై పోరాటంలో న‌వ‌జాత శిశువులు, వ‌యోజ‌నుల  జ‌న్యురూపాన్ని అవ‌గాహ‌న చేసుకోవ‌డం తొలి అడుగు అని గుర్తించ‌డమ‌న్న‌ది ఈ ఇతివృత్త సారాంశం. అలాగే, సికిల్ సెల్ వ్యాధి స్థితిని గుర్తించేందుకు అధునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించ‌వ‌ల‌సిందిగా ఇతివృత్తం విజ్ఞ‌ప్తి చేస్తుంది. భార‌త సామాజిక న్యాయం& సాధికార‌త మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేసే విక‌లాంగ వ్య‌క్తుల సాధికార‌త విభాగం (డిఇపిడ‌బ్ల్యుడి) అన్న‌ది దేశంలో  వైక‌ల్యం ఉన్న వ్య‌క్తుల అభివృద్ధి అజెండాను చూసుకునే నోడ‌ల్ సంస్థ‌. ప్ర‌జ‌ల‌లో సికిల్ సెల్ వ్యాధి గురించిన అవ‌గాహ‌న‌ను సృష్టించాల‌న్న దృష్టితో, భార‌త‌దేశ వ్యాప్తంగా 30కి పైగా ప్ర‌దేశాల‌లో విభాగంతో సంబంధం క‌లిగి ఉన్న సంస్థ‌ల వ్యాప్తంగా ప్ర‌పంచ సికిల్ సెల్ వ్యాధి దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను డిపార్ట్‌మెంట్ నిర్వ‌హించింది. ప్ర‌పంచ సికిల్ సెల్ వ్యాధి దినోత్స‌వాన్ని నిర్వ‌హించేందుకు అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు, జాతీయ స్థాయి సెమినార్లు & వ‌ర్క్‌షాప్‌లు, అన్‌లైన్ క్విజ్ కార్య‌క్ర‌మం, వెబినార్లు వ్యాసాలు & పోస్ట‌ర్ల త‌యారీ పోటీలు త‌దిత‌రాల‌ను నిర్వ‌హించారు.
  

 

***



(Release ID: 1933876) Visitor Counter : 162