హోం మంత్రిత్వ శాఖ
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా క్రెడాయ్ గార్డెన్ పీపుల్స్ పార్క్ ను ప్రారంభించారు
జగన్నాథ్ రథయాత్ర శుభవేళ శ్రీ అమిత్ షా మంగళ హారతిలో పాల్గొని అహమ్మదాబాద్ లోని జగన్నాథ ఆలయంలో మహాప్రభు ఆశీర్వాదం పొందారు.
శ్రీ జగన్నాథ రథయాత్ర విశ్వసానికి, పవిత్రతకు ప్రతీక, ప్రతి సంవత్సరం జరిగే ఈ పర్వం దైవసంబంధమైనది మరియు స్మరణీయమైనది, మహాప్రభు ప్రతి ఒక్కరినీ అనుగ్రహించుగాక: కేంద్ర హోమ్ మంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని మరియు వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు.
ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ యోగ దినోత్సవాన్ని సామూహికోద్యమంగా మార్చారు. ఇప్పుడు యోగా దినోత్సవాన్ని మొత్తం ప్రపంచం ఆమోదించింది. యోగా దినోత్సవం సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కొద్దీ రోజుల్లోనే దేశంలో భారీ మార్పులు తెచ్చారని, ఈ విషయం దేశంలో ఈనాడు ప్రతి పౌరునికి అనుభవంలోకి వచ్చింది
మౌలిక సదుపాయాల సృష్టిలో క్రెడాయ్ పని అభినందనీయమని, యువత నైపుణ్య వృద్ధి మరియు సామాజిక సంస్కరణల ద్వారా ఒక సంస్థగా దాని విశ్వసనీయత పెరిగి
Posted On:
20 JUN 2023 4:59PM by PIB Hyderabad
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా జగన్నాథ్ రథయాత్ర శుభవేళ మంగళ హారతిలో పాల్గొని అహమ్మదాబాద్ లోని జగన్నాథ ఆలయంలో మహాప్రభు ఆశీర్వాదం పొందారు. శ్రీ జగన్నాథ రథయాత్ర విశ్వసానికి, పవిత్రతకు ప్రతీక, ప్రతి సంవత్సరం జరిగే ఈ పర్వం దైవసంబంధమైనది మరియు స్మరణీయమైనది, మహాప్రభు ప్రతి ఒక్కరినీ అనుగ్రహించుగాక, జై జగన్నాథ్ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ఈ సందర్బంగా మంగళవారం శ్రీ అమిత్ షా వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు మరియు భూమి పూజ కూడా చేశారు. అహమ్మదాబాద్ నగరపాలక సంస్థ (ఏ ఎం సి) న్యూ రానిప్ వద్ద కొత్తగా నిర్మించిన పార్కును, ఏ ఎం సి, రైల్వే ఉమ్మడిగా చాందలోడియ వద్ద రూ. 67 కోట్ల ఖర్చుతో నిర్మించిన జగత్ పూర్ రైల్వే ఫ్లైఓవర్, క్రెడాయ్ ఉద్యానవనంలో పీపుల్స్ పార్క్ ప్రారంభించారు. బావ్లా వద్ద త్రిమూర్తి ఆసుపత్రికి శ్రీ షా భూమిపూజ కూడా చేశారు.
పీపుల్స్ పార్క్ ను క్రెడాయ్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 2.5 కోట్ల ఖర్చుతో నిర్మించిందని కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి తెలిపారు. పర్యావరణాన్ని, పేద, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఈ అందమైన పార్కును క్రెడాయ్ నిర్మించిందని ఆయన అన్నారు. పట్టణీకరణ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యానవనం సామాన్య పౌరులకు సౌకర్యవంతమైన స్థలం అని ఆయన అన్నారు.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031SVC.jpg
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని మరియు వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. అందుకు యోగ దినోత్సవం చక్కని ఉదాహరణ అని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ యోగ దినోత్సవాన్ని సామూహికోద్యమంగా మార్చారు. ఇప్పుడు యోగా దినోత్సవాన్ని మొత్తం ప్రపంచం ఆమోదించింది. యోగా దినోత్సవం సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రధాని మోడీ భారతీయ సంస్కృతిని ప్రపంచంలోని నలుమూలకు తీసుకెళ్లారు. యోగ దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితిలో జరిపించిన ఘనత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీదని కేంద్ర మంత్రి అన్నారు. ఔషధాలు లేకుండా జీవించగలిగే రహస్యాన్ని రుషిపుంగవులు చెప్పిన విషయం యోగశాస్త్రాలలో ఉందని అన్నారు. 2014లో ప్రారంభమైన యోగ ప్రచార ఉద్యయం వల్ల రానున్న 10-15 సంవత్సరాలలో భారీ మార్పులు రాగలవని ఆయన అన్నారు.
దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కొద్దీ రోజుల్లోనే దేశంలో భారీ మార్పులు తెచ్చారని, ఈ విషయం దేశంలో ఈనాడు ప్రతి పౌరునికి అనుభవంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రధాని పాటుపడుతున్నారని మంత్రి వెల్లడించారు. అరుణాచల్ సరిహద్దు గ్రామం కిబితూలో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన 'సచేతన గ్రామ కార్యక్రమం' చేపట్టి గ్యాస్ సిలిండర్లు, విద్యుత్, మరుగుదొడ్లు, ఆరోగ్య సౌకర్యాలు మరియు ప్రతి ఇంటికి ప్రతి నెల ఐదేసి కిలోల ఆహార ధాన్యాలు ఇస్తున్నందుకు అక్కడి ప్రజలు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005D7GE.jpg
మౌలిక సదుపాయాల సృష్టిలో క్రెడాయ్ పని అభినందనీయమని, యువత నైపుణ్య వృద్ధి మరియు సామాజిక సంస్కరణల ద్వారా ఒక సంస్థగా దాని విశ్వసనీయత పెరిగిందని కేంద్రమంత్రి అన్నారు. పీపుల్స్ పార్కుతో పాటు క్రెడాయ్ 75 అంగన్వాడీలలో క్రీడా సౌకర్యాలు కల్పించిందని అన్నారు. అది పిల్లలో ఆటపాటల పట్ల అలవాటు పెంచుతుందని అన్నారు. క్రెడాయ్ సభ్యులు ప్రతి ఒక్కరు 25 మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేయాలనీ, తద్వారా అహమ్మదాబాద్ లో పచ్చదనం పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1933874)
Visitor Counter : 131