ఆర్థిక మంత్రిత్వ శాఖ
2023-24 ఆర్థిక సంవత్సరానికి 12.73% వృద్ధిని నమోదు చేసిన స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి 11.18% పైగా పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను వసూళ్లు 13.70% వృద్ధిని చూపుతూ 17.06.2023 నాటికి రూ.1,16,776 కోట్లుగా నమోదు
రిఫండ్స్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 39,578 కోట్లు విడుదల
Posted On:
18 JUN 2023 7:31PM by PIB Hyderabad
ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గొప్ప వృద్ధిని నమోదు చేసాయి. 2023 జూన్ 17వ తేదీకి నికర పన్నుల సేకరణ రూ.3,79,760 కోట్ల రూపాయలుగా నమోదయింది. గత ఏడాది ఈ సేకరణ రూ. 3,41,568 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికర పన్ను సేకరణ 11.18 శాతం పెరిగింది.
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 3,79,760 కోట్లు (17.06.2023 నాటికి)లో కార్పొరేషన్ పన్ను (సీఐటి) రూ. 1,56,949 కోట్లు (నికర రిఫండ్), వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టిటి)తో సహా రూ. 2,22,196 కోట్లు (నికర రిఫండ్) ఉన్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్నుల స్థూల సేకరణ (రిఫండ్స్ కోసం సర్దుబాటు చేయడానికి ముందు) రూ. 4,19,338 కోట్లు ఉంటే, ఇది 2022-23 ఆర్థిక సంవత్సరపు వసూళ్ల కంటే 12.73% వృద్ధిని నమోదు చేసింది. అంటే మునుపటి ఆర్థిక సంవత్సరం సంబంధిత కాలంలో ఈ పన్ను సేకరణ రూ. 3,71,982 కోట్లు ఉంది.
స్థూల పన్ను సేకరణ రూ. 4,19,338 కోట్లలో కార్పొరేషన్ పన్ను (సిఐటి) రూ. 1,87,311 కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టిటి)తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) రూ. 2,31,391 కోట్లు. మైనర్ హెడ్ వారీగా వసూలు చేయడంలో అడ్వాన్స్ ట్యాక్స్ రూ. 1,16,776 కోట్లు; మూలం వద్ద మినహాయించిన పన్ను రూ. 2,71,849 కోట్లు; సెల్ఫ్-అసెస్‌మెంట్ పన్ను రూ. 18,128 కోట్లు; రెగ్యులర్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూ. 9,977 కోట్లు; ఇతర మైనర్ హెడ్స్ కింద పన్ను రూ. 2,607 కోట్లు నమోదయ్యింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికానికి ముందస్తు పన్ను వసూళ్లు 17.06.2023 నాటికి రూ. 1,16,776 కోట్లు నమోదయింది. తక్షణమే ముందున్న ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 సంబంధిత కాలానికి ముందస్తు పన్ను వసూళ్లు రూ. 13.70% వృద్ధిని చూపుతూ, 1,02,707 కోట్లు నమోదయింది. ముందస్తు పన్ను వసూళ్లు 17.06.2023 నాటికి రూ. 1,16,776 కోట్లు అయితే దీనిలో కార్పొరేషన్ పన్ను (సిఐటి) రూ. 92,784 కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐ టి) రూ. 23,991 కోట్లు కలిపి ఉంది.
రిఫండ్ మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.06.2023 వరకు రూ.39,578 కోట్లు చెల్లించడం జరిగింది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో 2022-23లో 30.13% వృద్ధిని చూపుతూ సంబంధిత కాలంలో రూ.30,414 కోట్లు రిఫండ్స్ జమ చేయడం జరిగింది.
****
(Release ID: 1933365)
Visitor Counter : 219