శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంపూర్ణ డిజిటల్ వేదిక (కోవిన్) వేదికగా భారత్ 200 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఇచ్చి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది, సంపన్న దేశాలు కూడా దీన్ని ఊహించలేదు : డాక్టర్ జితేంద్ర సింగ్


జమ్ము-కశ్మీర్ లో మొట్టమొదటి ‘‘డాక్టర్ ఆన్ వీల్’’ పేరిట ఉచిత టెలీమెడిసిన్ స్టార్టప్ మొబైల్ శిబిరం ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ టెలీమెడిసిన్ మొబైల్ సర్వీస్ పూర్తి శరీర చెకప్ లు నిర్వహిస్తుంది; ఆ తర్వాత దాన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యుడు పరిశీలించి, మరో ప్రముఖ వైద్యుడు ప్రిస్ర్కిప్షన్ ఇస్తాడు : డాక్టర్ జితేంద్ర సింగ్

బిల్లావర్ లో ప్రారంభమైన ఈ ఉచిత టెలీమెడిసిన్ సదుపాయం ‘అందుబాటు, లభ్యత, సరసమైన ధర’ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. : డాక్టర్ జితేంద్ర సింగ్

నేడు దేశంలో అందిస్తున్న టెలీ మెడిసిన్ సేవలు ప్రపంచంలో అందిస్తున్నఇతర టెలీమెడిసిన్ సేవలకు స మానంగా ఉన్నాయి; రాబోయే రోజుల్లో అడ్వాన్స్ డ్ రోబోటిక్ సర్జరీలు కూడా టెలీమెడిసిన్ సేవలు అందిస్తాయి : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 17 JUN 2023 6:45PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సంపూర్ణ డిజిటల్  వేదిక (కోవిన్) సహాయంతో 220 కోట్ల  కోవిడ్  వ్యాక్సిన్  డోస్  లు అందించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిందని, సంపన్న దేశాలు కూడా ఈ విజయాన్ని ఊహించనైనా లేదని కేంద్ర సైన్స్  అండ్  టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి;  ఎంఓఎస్ పిఎంఓ, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్   బిల్లావర్  లోని మండ్లి బ్లాక్  లో ‘‘డాక్టర్  ఆన్  వీల్స్’’  పేరిట ఉచిత టెలీమెడిసిన్  స్టార్టప్  మొబైల్  శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం డాక్టర్  జితేంద్ర సింగ్  ప్రసంగించారు.  

ఒక ప్రభుత్వేతర సంస్థ జమ్ము-కశ్మీర్  లో మొట్టమొదటి తరహాలో అందిస్తున్న మొబైల్  టెలీ మెడిసిన్  సర్వీస్  3వ దశ ఇదని డాక్టర్  జితేంద్ర సింగ్  చెప్పారు. తొలి దశలో దోడా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గండోలో 60కి పైగా గ్రామాలకు విస్తరించిందని, రెండో దశలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కథువా జిల్లాలో గతంలో వైద్య సర్వీసుల నిరాకరణకు గురైన సుదూర గ్రామాలకు విస్తరించిందని ఆయన తెలిపారు. 

ఉత్తర భారత, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు చెందిన రెండు స్టార్టప్  గ్రూప్  లు బిల్లావర్  జిల్లాలోని మండ్లిలో నేడు ఉచిత టెలీమెడిసిన్  మొబైల్  సేవలు ప్రారంభించాయని మంత్రి తెలిపారు.

బిల్లావర్ లో ప్రారంభమైన ఈ ఉచిత టెలీమెడిసిన్  సేవ వైద్య సేవల ‘అందుబాటు, లభ్యత, సరసమైన ధర’ వంటి  సమస్యలను తొలగిస్తుందని డాక్టర్  జితేంద్ర సింగ్  చెప్పారు.   సేవల్లో నాణ్యత, వైద్యులు-సహాయం, దూర ప్రయాణం, కన్సల్టేషన్/చికిత్స వ్యయాలు వంటి మూడు అవరోధాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం ద్వారా సమర్థవంతంగా పరిష్కరించారని ఆయన చెప్పారు. సాధారణంగా అయితే ఒక మెట్రో ఆస్పత్రిలో ఇలాంటి సేవలకు భారీ వ్యయాలు కావడమే కాకుండా రెండు, మూడు వారాలైనా వ్యవధి పడుతుంది. ఈ తరహా ఉచిత టెలీమెడిసిన్  మొబైల్  శిబిరం బలహీనమైన సామాజిక-ఆర్థిక నేపథ్యం గల వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని డాక్టర్  జితేంద్ర సింగ్ అన్నారు.
 
భారతదేశం నేడు సాంకేతికంగా అత్యంత అభివృద్ధి  చెందిన దేశాలతో సమానంగా ఉన్నదని చెబుతూ ఈ టెలీ మెడిసిన్ సేవలు కూడా ప్రపంచంలోని ఏ దేశంలో అందిస్తున్న టెలీ మెడిసిన్  సేవలతో అయినా సమానంగా ఉన్నాయని డాక్టర్  జితేంద్ర సింగ్ తెలిపారు. భవిష్యత్తులో టెలీ మెడిసిన్  సేవల ద్వారా రోబోటిక్  సర్జరీలు కూడా నిర్వహిస్తారన్నారు. 

తమ ప్రభుత్వం పేదల అనుకూల ప్రభుత్వం కావడం వల్ల ఇలాంటి ఉచిత టెలీమెడిసిన్  మొబైల్  సర్వీసులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘సేవ, సమర్పణ్, స్టార్టప్’’ మంత్రాన్ని అనుసరిస్తూ బలహీనమైన సామాజిక-ఆర్థిక నేపథ్యం గల వారికి అసాధారణ వైద్య సదుపాయాలు అందిస్తున్నాయని డాక్టర్  జితేంద్ర సింగ్  తెలిపారు. 

***
 


(Release ID: 1933242) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Marathi , Hindi