పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అడవుల శాస్త్రీయ నిర్వహణకు, నూతన విధానాల రూపకల్పనకు నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ –2023 విడుదల

Posted On: 17 JUN 2023 4:13PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వానికి చెందిన పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వశౄఖ , అడవుల శాస్త్రీయ నిర్వహణ, నూతన విధానాల రూపకల్పనకు వీలుగా నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ –2023 ను విడుదల చేసింది.
ఈ నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్–2023ని అడవుల డైరక్టర్ జనరల్, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఐఎఫ్.ఎస్ అధికారిశ్రీ చంద్ర ప్రకాశ్ గోయల్ విడుదల చేశారు.
ఏడారీకరణ, కరవు వ్యతిరేక దినం సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసిఎఫ్ఆర్ఇ)  సంస్థ డెహ్రాడూన్ లో  2023 జూన్ 17న  ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో  విడుదల చేశారు.
అడవుల నిర్వహణ విషయంలో శాస్త్రీయ వ్యవస్థ ఉన్న ప్రపంచంలోని అతి కొద్ది దేశాలలో ఇండియా ఒకటి. వర్కింగ్ ప్లాన్ ద్వారా ఇండియాలో అడవుల శాస్త్రీయ నిర్వహణను సాధించడం జరుగుతోంది.
నేషనల్ వర్కింగ్ ప్లాన్ను కోడ్ ను 2004 లో తొలిసారి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2014లో తీసుకువచ్చిన సవరణల ద్వారా ఏకరూపత సాధిండంతోపాటు, దేశంలోని వివిధ ఫారెస్టు డివిన్ల శాస్త్రీయ నిర్వహణకు సంబంధించిన  వర్కింగ్ ప్లాన్ రూపకల్పనకు     ఇది  మార్గదర్శిగా పనికివస్తుంది.

భారతదేశంలోని అడవులను పలు కారణాల రీత్యా నిర్వహించడం జరుగుతోంది. అవి, పర్యావరణ స్థిరత్వం, సహజ వారసత్వ సంపదను కాపాడడం, భూసార పరిరక్షణ,పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా ఉండడం, ప్రజల భాగస్వామ్యంతో  వృక్ష సంపద , అడవుల విస్తీర్ణం పెంపు,,అటవీ ఉత్పత్తుల పెంపు తదితరాలు ఉన్నాయి.
ఇండియాలో, ప్రపంచంలో అటవీ యాజమాన్య నిర్వహణ నూతన దృష్టికోణంలో ముందుకు పోతున్నది. నూతన సాంకేతికతలు, నూతన ఆవిష్కరణలు వస్తున్నాయిన. దీనితో అటవీ యాజమాన్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మనం దృష్టిపెట్టవలసి ఉంది. అడవులపై ఆధారపడిన వారి అవసరాలకు అనుగుణంగా వీటికి రూపకల్పన చేయాలి.

దేశంలోని వివిధ అటవీ డివిజన్కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో ఈ నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ –2023 మార్గదర్శకంగా పనికివస్తుంది.  అటవీ యాజమాన్య ప్రణాళికా రూపకల్పనలో  దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్య అంశాలపై
నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ –2023 మార్గనిర్దేశం చేస్తుంది.  అడవుల నిర్వహణలో సుస్థిర యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి  అవసరమైన సూత్రాలను చేర్చడానికి ఇది ఉపకరిస్తుంది. ఇందులో అడవుల విస్తీర్ణం, అడవుల స్థితిగతులు, వృక్షసంపద, అడవుల నిర్వహణ, పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు,  అటవీ ఉత్పాదకత పెంపు, వన్య ప్రాణి సంరక్షణ, అడవుల ను కాపాడడం, భూసార పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, అడవుల ద్వారా ఆర్థిక, సాంస్కృతిక, ఆథ్యాత్మిక ప్రయోజనాలు గమనంలో ఉంచుకోవడం, అడవుల వృద్ధికి తగిన విధానాలు రూపొందించడం, చట్టపరమైన, వ్యవస్థాపరమైన ఫ్రేమ్ వర్క్ రూపొందించడం వంటివాటికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
దేశంలో తొలిసారిగా నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ –2023, ఆయా రాష్ట్ర అటవీ విభాగాలు, నిరంతరం అడవులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి , ఆ సమాచారాన్ని కేంద్రీకృత డాటాబేస్ లో ఎప్పటికప్పుడు చేర్చాలని సూచిస్తున్నది.
నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ –2023లో ఇండియన్ ఫారెస్ట్ మానేజ్మెంట్ స్టాండర్డ్ ఒక భాగంగా ఉంది. ఇది దేశంలో వైవిధ్యంతో కూడిన అటవీ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది అటవీ యాజమాన్యంలో ఏకరూపత తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో శాస్త్రీయంగా అడవుల నిర్వహణలో గడించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సుస్థిర అటవీ యాజమాన్య నిర్వహణకు ప్రమాణాలను , ఇండియన్ ఫారెస్ట్ మానేజ్మెంట్ స్టాండర్డ్లో పొందుపరచడం జరిగింది. దీనిఇన అంతర్జాతీయ సూచికలు, అంతర్జాతీయ ప్రాతిపదికల ఆధారంగా రూపొందించడం జరిగింది.

ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్టాండర్డ్ అనేది , ఆయా రాష్ట్ర అటవీ విభాగాలు,  వర్కింగ్ ప్లాన్లకు అనుగుణంగా అనుసరించే యాజమాన్య పద్ధతుల సమర్థతను కొలవడానికి ఉపకరిస్తుంది..

***



(Release ID: 1933241) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Marathi , Hindi , Odia