ఆయుష్
సమగ్ర వైద్యాన్ని ప్రోత్సహించినందుకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రశంసించారు
Posted On:
17 JUN 2023 7:48PM by PIB Hyderabad
విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)ని సందర్శించారు. శ్రీ రమేష్ బిధూరి, పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ, శ్రీ రాంవీర్ సింగ్ బిధూరి, ఎమ్మెల్యే, బదర్‌పూర్ న్యూఢిల్లీ, శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి; శ్రీ మనోజ్ నేసరి, ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుండి రోగ నియంత్రణ నుండి నివారణ చర్యల వైపు ప్రపంచ మార్పును గురించి ప్రస్తావించారు. “ప్రపంచ స్థాయిలో సంపూర్ణ సమగ్ర ఆరోగ్య భావనను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సాంప్రదాయ ఔషధ చికత్స కోసం ప్రపంచ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది అని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం ఈ బాధ్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తించి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను స్థాపించడం ద్వారా ఖచ్చితమైన చర్యలు తీసుకుంది. మేము గత 9 సంవత్సరాలలో చూసిన అద్భుతమైన పరివర్తనను ఢిల్లీ నివాసితులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ఈ ఇన్స్టిట్యూట్ లెక్కలేనన్ని జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిన సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. 20 సంవత్సరాలకు పైగా ఆగిపోయిన తరువాత ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభించబడడమే కాకుండా ప్రతిరోజూ వేలాది మంది జీవితాలకు వైద్యం అందిస్తూనే ఉంది. శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం వల్లనే ఆయుర్వేదం ప్రస్తుత ప్రాముఖ్యతను సాధించింది.
ఏ ఐ ఐ ఏ డైరెక్టర్ ప్రొఫెసర్. డాక్టర్ తనూజా నేసరి మాట్లాడుతూ, "ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం, తరచుగా ఏ ఐ ఐ ఏ ఆఫ్ ఆయుర్వేదంగా పిలవబడుతుంది, దీనిని గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2017లో ప్రారంభించారు. మేము సాక్ష్యాధారిత శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణమైన వైద్యాన్ని అందిస్తున్నాము. ఇప్పటి వరకు 54 అవగాహన ఒప్పందాలపై విజయవంతంగా సంతకం చేసాము అని పేర్కొన్నారు. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ సందర్శనతో మా ఇంక్యుబేషన్ సెంటర్ ఉనికి విశ్వ ప్రాశస్త్యం లోకి వచ్చింది. మా గౌరవనీయ అతిథులందరికీ స్వాగతం పలికేందుకు ఈ అమూల్యమైన అవకాశాన్ని మాకు అందించినందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి మా కృతజ్ఞతలు." అని అన్నారు.
***
(Release ID: 1933230)
Visitor Counter : 197