నీతి ఆయోగ్

భారత ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సహకార ముసాయిదా (జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. 2023-2027) పై సంతకం చేసిన - నీతీ ఆయోగ్ మరియు భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి


నీతీ ఆయోగ్ జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. అనేది భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ యొక్క సమిష్టి నిబద్ధత, భారతదేశ ఎజెండా 2030 సాధనకు, ముఖ్యంగా సబ్‌-కా-సాత్, సబ్‌-కా-వికాస్ సూత్రానికి మద్దతుగా ఉంది.

Posted On: 16 JUN 2023 7:13PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం - ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సహకార ముసాయిదా 2023-2027 పై భారతదేశంలోని నీతి ఆయోగ్ మరియు ఐక్యరాజ్యసమితి ఈరోజు సంతకం చేశాయి.  జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. పై  నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు శ్రీ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీనియర్ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, భారతదేశంలో ఐక్యరాజ్యసమితి సంస్థల అధిపతుల సమక్షంలో, నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం, భారతదేశంలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ సమన్వయ కర్త శ్రీ శోంబి షార్ప్ సంతకం చేశారు. 

 

 

జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. 2023-2027 అనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు, లింగ సమానత్వం, యువత సాధికారత, మానవ హక్కుల సాధన కోసం, జాతీయ దృష్టికి అనుగుణంగా అభివృద్ధి కోసం, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ యొక్క సామూహిక ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సూచిస్తుంది.  ఐక్యరాజ్యసమితి  సుస్థిర అభివృద్ధి సహకార ముసాయిదాను దేశ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థకు ప్రధాన ప్రణాళిక, అమలు పరికరంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ఏ/ఆర్.ఈ.ఎస్/72/279 పేర్కొంది.  దేశంలో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థల కార్యక్రమ ప్రాధాన్యతలు, జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. నుండి తీసుకోవడం జరిగింది. 

 

 

2030 ఎజెండా నుండి తీసుకోబడిన, ప్రజలు, శ్రేయస్సు, భూగోళం, భాగస్వామ్యం - అనే నాలుగు వ్యూహాత్మక స్తంభాలపై జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. 2023-2027 నిర్మించబడింది.  ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఈ నాలుగు స్తంభాలు, ఆరోగ్యం-శ్రేయస్సు;  పోషకాహారం-ఆహార భద్రత; నాణ్యమైన విద్య; ఆర్థిక వృద్ధి-మంచిపని; పర్యావరణం-వాతావరణం-డబ్ల్యూ.ఏ.ఎస్.హెచ్.-స్థితిస్థాపకత; వ్యక్తులు-సమాజం-సంస్థల సాధికారతలపై దృష్టి సారించే ఆరు ఫలితాల ప్రాంతాలను కలిగి ఉన్నాయి. 

 

 

క్లిష్టమైన రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, మొదటిసారిగా, ఎస్.డి.జి. స్థానికీకరణ, దక్షిణ-దక్షిణ సహకారంపై ఎస్.డి.జి. ల అమలు, వ్యాప్తి పట్ల భారతదేశ నాయకత్వానికి అనుగుణంగా, దక్షిణ-దక్షిణ సహకారానికి భారతదేశ నాయకత్వం వంటి అంశాలపై యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. నిర్దిష్ట దృష్టిని కలిగి ఉంటుంది.  భారతదేశ అభివృద్ధి నమూనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడం ఈ ప్రయత్నానికి కేంద్ర బిందువుగా ఉంటుంది.

 

 

భారత ప్రభుత్వం తరపున నీతి ఆయోగ్ నేతృత్వంలో, లైన్ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల బలమైన భాగస్వామ్యంతో, జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. 2023-2027 సూత్రీకరణ జరిగింది.  భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి విధానం నుండి ఇన్‌-పుట్‌ లకు ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ నాయకత్వం వహించి, సమన్వయం చేసారు.  మొత్తం సమాజంమొత్తం ప్రభుత్వంమొత్తం ఐక్యరాజ్యసమితి విధానాన్ని నిర్ధారిస్తూ, పౌర సమాజం, మేధావులు, ప్రైవేట్ రంగం, సహకార సంఘాలు, కార్మిక సంఘాల భాగస్వాములు కూడా డాక్యుమెంట్ అభివృద్ధికి సహకరించారు.  మునుపటి సహకార ముసాయిదా (2018-2022) తో పాటు, భారతదేశంలో ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఉమ్మడి దేశ విశ్లేషణ (సి.సి.ఏ) మూడవ-పక్ష మూల్యాంకనం ద్వారా జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్.  కి సమాచారం అందించడం జరిగింది. 

 

 

జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్. 2023-2027 అమలు, పర్యవేక్షణ, నివేదన బాధ్యతలకు సంయుక్త క్రియాశీలక కమిటీ ద్వారా భారత ప్రభుత్వం మరియు భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి సహ-నాయకత్వం వహిస్తాయి.

 

 

“ఆవిష్కరణల ఆధారిత, సమ్మిళిత, స్థితిస్థాపక, స్థిరమైన భారతదేశానికి రాబోయే ఐదేళ్లు చాలా కీలకం.  భారతదేశానికి, "ఎవరినీ వదిలిపెట్టవద్దు" అనే సూత్రం దాని విస్తారమైన, వైవిధ్యమైన జనాభా కారణంగా, అలాగే విపరీతమైన జనాభా డివిడెండ్ కారణంగా, దాని సంభావ్యత కారణంగా చాలా ముఖ్యమైనది.  జి.ఓ.ఐ-యు.ఎన్.ఎస్.డి.సి.ఎఫ్., దాని అంగీకరించిన భాగస్వామ్యాలు, ఫలితాలు, అవుట్‌-పుట్‌ ల ద్వారా జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతల సాధనకు దోహదం చేస్తుంది.  సహకార ముసాయిదా ఒక సజీవమైన, చైతన్యవంతమైన ఫ్రేమ్‌-వర్క్‌ గా ఉండాలి.  భారతదేశం ఎలా మారుతుందో, ప్రపంచం ఎలా మారుతుందో, దాని మార్గంలో స్వీకరించాలి,” అని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు శ్రీ సుమన్ బెరీ అన్నారు.

 

 

సహకార ముసాయిదాపై సంతకం చేసిన అనంతరం, నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ,  “అభివృద్ధి, స్థితిస్థాపకత స్థాయిని అందించగల సామర్థ్యంతో భారతదేశం స్థిరంగా పురోగమిస్తోంది.  డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క బలమైన పర్యావరణ వ్యవస్థ, జాతీయ మిషన్‌ ల శ్రేణి ద్వారా భారత సాంఘిక సంక్షేమ వ్యవస్థ మరియు భద్రతా వ్యవస్థను మార్చడం ఇందులో భాగంగా ఉంది.  వాతావరణ చర్య, స్థితిస్థాపకతలో భారతదేశ నాయకత్వం వృద్ధి చెందుతూనే ఉంది.  గత శతాబ్దపు సవాళ్లను పూర్తిగా పరిష్కరించి, అమృత్-కాల్ సవాళ్లను స్వీకరించి, వికసిత్-భారత్‌ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.  సహకార ఫ్రేమ్‌వర్క్ దాని పరివర్తనలో భారతదేశంపై దృష్టి పెడుతుంది, మద్దతు ఇస్తుంది. ఇక్కడ నీరు / విద్యుత్ / ఇంటర్నెట్ వంటి ప్రాథమిక అవసరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, ఈ అంశాల నాణ్యత భవిష్యత్తుకు మరింత సందర్భోచితంగా ఉంటుంది." అని వివరించారు. 

 

 

సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను సాధించడానికి,  ప్రపంచం సగం మార్కును చేరుకోవడంతో, ఈ కొత్త ఫ్రేమ్‌-వర్క్ ఒక క్లిష్టమైన దశలో వచ్చింది.  గౌరవనీయులైన ప్రధానమంత్రి  స్పష్టమైన పిలుపుకు అనుగుణంగా భారతదేశం రాబోయే 25 సంవత్సరాలలో 'వికసిత్ భారత్' గా మారనుంది. 

 

 

సహకార ఫ్రేమ్‌-వర్క్‌ ఆవిష్కరణ సందర్భంగా భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ శోంబి షార్ప్ మాట్లాడుతూ,  “2030 ఎజెండాకు భారతదేశం కీలక రూపకర్త.  భారత ప్రభుత్వ సబ్‌-కా-సాత్సబ్‌-కా-వికాస్, సందేశంలో ప్రతిబింబించే 'ఎవరినీ వదిలిపెట్టవద్దు' అనే లక్ష్యంతో, భారతదేశం తన ఫ్లాగ్‌-షిప్ జాతీయ కార్యక్రమాలను ఎస్.డి.జి. లతో సమం చేసింది. భారీ స్థాయిలో అభివృద్ధి లాభాలను అందజేసేటప్పుడు,  2030 ఎజెండా ని అన్ని స్థాయిలలో స్థానిక చర్యలకు అన్వయించింది.  భారతదేశంలోని యువ జనాభా అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, మిగిలిన అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంలో పురోగతిని మరింత వేగవంతం చేయడంతో పాటు, ప్రత్యేకమైన జనాభా డివిడెండ్‌ ను ప్రభావితం చేయడానికి మానవ మూలధనంలో పెట్టుబడి పెట్టడం అవసరం.  ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చెప్పినట్లుగా, ఎస్.డి.జి. లను సాధించడాన్ని ప్రపంచ వాస్తవికతగా మార్చగల దేశం భారతదేశం." అని పేర్కొన్నారు. 

 

 

*****



(Release ID: 1933134) Visitor Counter : 246