నౌకారవాణా మంత్రిత్వ శాఖ
నుమాలిగఢ్ రిఫైనరీ కోసం ఉద్దేశించిన తొలి ఓవర్ డైమన్షనల్ కార్గో (ఒడిసి)ని అందుకున్న శ్రీ సర్బానంద సోనోవాల్
కోల్‌కత నుంచి ఐబిపిఆర్ ద్వారా బ్రహ్మపుత్రలో ప్రయాణించిన 485 ఎంటిల బరువు, 31.5 మీటర్ల పొడవు, 8.250 మీటర్ల వెడల్పు గల ఎన్ఆర్ఎల్‌కు ఉద్దేశించిన డిహెచ్‌టి రియాక్టర్
భారతదేశంతో పాటుగా అస్సాం వృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలన్న ప్రధాని నరేంద్ర మోడీజీ దార్శనికత అయిన రవాణా ద్వారా పరివర్తన సాకారమైన క్షణమిది ః శ్రీ సోనోవాల్
ఐడబ్ల్యుఎఐ & ఎన్ఆర్ఎల్ మధ్య కుదిరిన అవగాహనాపత్రానికి అనుగుణంగా ఎంవి మెరైన్ 66 నౌక ద్వారా ఒడిసి సరుకు రవాణా
Posted On:
16 JUN 2023 7:57PM by PIB Hyderabad
జలమార్గాల ద్వారా రవాణా చేసిన తొలి ఓవర్ డైమన్షనల్ కార్గో (ఒడిసి- వాహనపు పరిమాణానికి మించిన సరుకు)ను నుమాలిగఢ్ రిఫైనరీ జెట్టీ వద్ద శనివారం నాడు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు & ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ అందుకున్నారు.
నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్) సామర్ధ్యాన్ని 3 ఎంఎంటి నుంచి 9 ఎంఎంటికి విస్తరింపచేసేందుకు దేశంలోని అంతర్గత జలమార్గాల ఇన్‌ఛార్జి, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల నోడల్ ఏజెన్సీ అయిన ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ - భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ) తొలిసారి రవాణా చేసిన సరుకు ఇది. గత ఏడాది ఎన్ఆర్ ఎల్‌కు మొత్తం 24 ఒడిసితో పాటు ఓవర్ వెయిట్ కార్గో (ఒడబ్ల్యుసి- అధిక బరువు సరుకు)ను పంపేందుకు ఐడబ్ల్యుఎఐ & ఎన్ఆర్ఎల్ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్గత జలమార్గాలను ఉపయోగించడం ద్వారా కోల్‌కొతా నుంచి నుమాలిగఢ్‌కు ఒడిసిని రవాణా చేయడమన్న చిరస్మరణీయ ఘట్టాన్ని నేడు అస్సాం వీక్షించిందని శ్రీ సోనోవాల్ అన్నారు. ఇది రవాణా ద్వారా పరివర్తన అన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ దార్శనికతను ఇది వాస్తవంగా నెరవేరుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో నుమాలిగఢ్‌ను ఇంధన కేంద్రంగా మారేలా తోడ్పడాలన్నది మోడీజీ నిబద్ధత కాగా, ఎన్ఆర్ఎల్ విస్తరణకు ఉద్దేశించిన దాదాపు 24 ఒడిసి& ఒడబ్ల్యుసిలను సాఫీగా రవాణా చేయకపోతే సాపేక్షంగా స్వల్పకాలంలో దాని సామర్ధ్య విస్తరణ సాధ్యమయ్యేది కాదన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం కింద భారత జలమార్గాలను సాధికారం చేసేందుకు ఇచ్చిన ప్రోత్సాహంతో, తమ మంత్రిత్వశాఖ ఈ రవాణా వేగంగా, సాఫీగా జరిగే బాధ్యతను తమ మంత్రిత్వ శాఖ తీసుకుందన్నారు. జలమార్గాల సుదీర్ఘ దూరాలను ప్రయాణించి తొలి ఒడిసి విజయవంతంగా ఎన్ఆర్ఎల్‌ను చేరుకోవడంతో, అస్సాంతో పాటుగా ఈశాన్య భారత వృద్ధికి తోడ్పడడంలో అంతర్గత జలమార్గాల పాత్ర తప్పనిసరి అని, ఇది ఆర్ధిక, పర్యావరణ అనుకూల, నిలకడైన రవాణా మార్గం ద్వారా మన ప్రాంతం వేగంగా పరివర్తన చెందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.
తొలి ఒడిసిని ఐబ్ల్యుఎఐ నౌక - ఎంవి మెరైన్ 66 లో కోల్‌కొత నుంచి ఇండో బాంగ్లాదేశ్ ప్రోటోకోల్ రూట్ (ఐబిపిఆర్) ద్వారా నుమాలిగడ్ రిఫైనరీ జెట్టీకి రవాణా చేశారు.
డీజిల్ హైడ్రోట్రీటింగ్ (డిహెచ్‌టి) రియాక్టర్ నికర బరువు 485 ఎంటిలు కాగా, స్థూల బరువు 521 ఎంటిలు. ఈ రియాక్టర్ పొడవు 31.5 మీటర్లు కాగా, ఎత్తు 8.20 మీటర్లు, వ్యాసం 8.00 మీటర్లు.
ఒడిసి 18 మార్చిన కోల్‌కొత నుంచి బయలుదేరి మూడు నెలల పాటు బాంగ్లాదేశ్ గుండా ప్రయాణించి నుమాలీగఢ్‌ను చేరుకుంది. ఈ రవాణాను విజయవంతం చేసేందుకు మార్చి నుంచి ధనసిరిలోని ఐదు ప్రాంతాలలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) సహాయంతో ఐడబ్ల్యుఎఐ మూడు డ్రెడ్జర్లను ఉపయోగించింది. ఈ మూడు డ్రెడ్జర్లు- సిఎస్‌డి మండోవి, సిఎస్‌డి బ్రహ్మిణి, హెచ్ఎస్‌డి భొరోలీ.
***
(Release ID: 1933063)
Visitor Counter : 134