పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు వార్షిక వృద్ధి 36.10% మరియు నెలవారీ వృద్ధి 15.24% నమోదు


దేశీయ విమానయాన సంస్థలు జనవరి-మే 2023లో 636.07 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేశాయి.

ఏప్రిల్'23తో పోలిస్తే మే'23లో మొత్తం ప్రయాణీకుల వృద్ధి 3.26 లక్షలు (2.52%) పెరిగింది.

ఇండిగో, విస్తారా మరియు ఎయిర్ ఏషియా జనవరి-మే'2023లో తమ మార్కెట్ షేర్‌లో పెరుగుదలను నమోదు చేశాయి

Posted On: 16 JUN 2023 5:05PM by PIB Hyderabad


దేశంలోని పౌర విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధించింది. దేశీయంగా విమానయాన సంస్థల్లో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశీయ విమానయాన సంస్థలు అందించిన ట్రాఫిక్ డేటా ఆధారంగా జనవరి-మే 2023లో ప్రయాణీకుల సంఖ్య 636.07 లక్షల మైలురాయిని చేరుకుంది. ఇది జనవరి-మే 2022 సంవత్సరంతో పోల్చితే 36.10% గణనీయమైన వార్షిక వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది. ఆ సమయంలో ప్రయాణీకుల సంఖ్య 467.37 లక్షలు.

2022,మే నెలలో ప్రయాణీకుల సంఖ్య 114.67 లక్షలు కాగా అది 2023 మేలో 132.41 లక్షలకు పెరిగింది. నెలవారీ వృద్ధిని 15.24% నమోదు చేసింది. సురక్షితమైన, సమర్థవంతమైన మరియు కస్టమర్-కేంద్రీకృత విమానయాన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క సమిష్టి కృషికి ఈ స్థిరమైన వృద్ధి నిదర్శనం.

ఏప్రిల్ 23తో పోలిస్తే మే 2023లో మొత్తం ప్రయాణీకుల సంఖ్య 3.26 లక్షలు (2.52%) పెరిగింది.

ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల భారతదేశ  విమానయాన రంగ  బలం మరియు మన్నికను ప్రదర్శిస్తుంది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి మరియు మన దేశ పౌరులకు సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడానికి నిరంతర కృషి జరుగుతోంది. జనవరి-మే 2023 మధ్యకాలంలో 636.07 లక్షల మంది ప్రయాణీకుల అధిక లోడ్ ఫ్యాక్టర్ విమాన రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది, ఇది విమానయాన పరిశ్రమ యొక్క అనుకూలమైన దిశను చాటిచెబుతోంది.

అలాగే మే 2019 కంటే మే 2023లో ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. మే 2019లో షెడ్యూల్ చేయబడిన దేశీయ విమానయాన సంస్థలకు మొత్తం 746 ప్రయాణీకులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. అయితే, మే 2023లో షెడ్యూల్ చేయబడిన దేశీయ విమానయాన సంస్థలకు మొత్తం 556 ప్రయాణీకులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.

కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కుశాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం.సింధియా ప్రకారం “విమానయాన రంగం వృద్ధిని ప్రోత్సహించడంలో మరియు భారతదేశాన్ని ప్రముఖ ప్రపంచ విమానయాన కేంద్రంగా స్థాపించడంలో వాటాదారులందరి సహకార ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయి. దేశీయ విమానయాన పరిశ్రమ యొక్క స్థిరమైన విస్తరణ మరియు ప్రాంతీయ విమానయాన సంస్థల పుట్టుక మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. దేశం అంతటా ప్రజలను కలుపుతున్నాయి మరియు ఉడాన్‌ పథకం ద్వారా చివరి మైలు కనెక్టివిటీకి భరోసా ఇస్తున్నాయి. భద్రత, సామర్థ్యం మరియు ప్రయాణీకుల సంతృప్తి  అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తూనే, విమానయాన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మరియు స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది"

ఈ సాధన అనేది పరిశ్రమ యొక్క సంపూర్ణమైన ప్రణాళిక, కార్యాచరణ ప్రభావం మరియు క్రియాశీలక చర్యల ఫలితం. కొవిడ్-19 మహమ్మారి తరువాత విమానయాన సంస్థలు మెరుగైన విమాన సేవలతో పాటు ప్రయాణీకులకు సున్నితమైన మరియు అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాలను అందించడం ద్వారా స్థితిస్థాపకతను ప్రదర్శించాయి.


 

***


(Release ID: 1932941) Visitor Counter : 211