బొగ్గు మంత్రిత్వ శాఖ

మొత్తం 44.2 శాతం వృద్ధితో, జూన్ 13వ తేదీకి 110.58 మిలియన్ టన్నులకు చేరుకున్న బొగ్గు నిల్వలు 2023


విద్యుత్ రంగానికి 168.84 మెట్రిక్ టన్నులు అందేలా చర్యలు, 5.11శాతం వృద్ధి సాధన

Posted On: 15 JUN 2023 4:53PM by PIB Hyderabad

'ఆత్మనిర్భర్ భారత్' విజన్‌కు అనుగుణంగా, బొగ్గు మంత్రిత్వ శాఖ దేశ ఇంధన భద్రతను నిర్ధారించడంపై దృష్టి సారించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికి, వాటాదారులందరికీ బొగ్గు సమర్ధవంతమైన రవాణాను అందించడానికి చురుకుగా పని చేస్తోంది. మొత్తం బొగ్గు స్టాక్ స్థానం అంటే, గనులు, టిపిపిలు, రవాణాలో, 13 జూన్ .2023 నాటికి, 110.58 మిలియన్ టన్నుల (ఎంటి)కి చేరుకుంది. , గత సంవత్సరం 76.67 ఎంటి నిల్వలతో పోలిస్తే 44.22 శాతం గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఈ అధిక బొగ్గు నిల్వలు  బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా తగినంత బొగ్గు సరఫరాను నిర్వహించడానికి ఉన్న నిబద్ధతను సూచిస్తుంది.

 

అదనంగా, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) వద్ద ఈ నెల 13 నాటికి పిట్‌హెడ్ బొగ్గు స్టాక్ 59.73 ఎం.టి వద్ద ఉంది, ఇది 13.06.2022 నాటి 47.49 ఎం.టి నిల్వలతో పోలిస్తే 25.77 శాతం వృద్ధి రేటును సూచిస్తుంది. ఈ అప్‌వర్డ్ ట్రెండ్ సమర్థవంతమైన స్టాక్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు, కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రముఖంగా సూచిస్తుంది. 

 

 

అదే సమయంలో,  విద్యుత్ రంగానికి బొగ్గు పంపిణీ పరంగా, 13.06.2023 తేదీని లెక్కలోకి వేసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంచిత విజయాలు 164.84 ఎం.టికి చేరాయి, ఇది సంబంధిత కాలంతో పోల్చితే 5.11 శాతం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసింది. మునుపటి సంవత్సరం, 13.06.2022న 156.83 ఎం.టి గా ఉంది. విద్యుత్ శక్తి అవసరాలను తీర్చడానికి స్థిరమైన బొగ్గు సరఫరాను నిర్ధారిస్తుంది. 01.04.2022న థర్మల్ పవర్ ప్లాంట్స్ (టీపిపి) (డీసీబీ) వద్ద ఉన్న బొగ్గు నిల్వ 24.04 ఎం.టి, 13.06.2022 నాటికి 22.57 ఎం.టిలు.  ఫలితంగా  6.1% తగ్గుదల సూచిస్తోంది. అయితే, 1 ఏప్రిల్ 2023న టిపిపిలలో (డీసీబీ) బొగ్గు నిల్వ 34.5 ఎం.టి, 13.06.2023 నాటికి 34.5 ఎం.టి గా ఉంది, అంటే వేసవి కాలం చివరి రెండున్నర నెలల్లో బొగ్గు నిల్వలు తగ్గలేదు. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి, పంపిణీలో అధిక వృద్ధి రేటును నిర్ధారించడం ద్వారా ఇది సాధ్యమైంది. 13.06.2023 నాటికి టిపిపిలలో (డీసీబీ) బొగ్గు నిల్వ 34.55 ఎం.టిగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటి వరకు 22.57 ఎం.టి గా ఉంది.  ఇది 53.1% గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది.

 

మొత్తంమీద, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంచిత బొగ్గు ఉత్పత్తి గణనీయమైన వృద్ధిని సాధించింది, 13.06.2023 నాటికి 182.06 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో, అదే కాలానికి మునుపటి సంవత్సరం ఉత్పత్తి 168.17మెట్రిక్ టన్నులతో పోలిస్తే 8.26 శాతం ఆకట్టుకునే విధంగా  వృద్ధి రేటును సూచిస్తుంది. ఇంకా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 13.06.2023న 196.87 ఎం.టికి చేరిన మొత్తం బొగ్గు పంపిణీ గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం పంపిన 182.78ఎం.టి తో పోలిస్తే ఇది 7.71శాతం మెచ్చుకోదగిన వృద్ధి రేటును సూచిస్తుంది. బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక ప్రణాళిక, సమర్థవంతమైన అమలు ద్వారా బొగ్గు రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడానికి, దేశీయ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడానికి పూర్తిగా కట్టుబడి ఉంది.

 

****



(Release ID: 1932844) Visitor Counter : 135