నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

సంకల్ప్ కార్యక్రమం కింద క్లస్టర్ ఆధారిత ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రాజెక్టులో శిక్షణ పొందిన 98 మంది ట్రైనర్లను ధృవీకరించిన ఎంఎస్ డిఇ

Posted On: 13 JUN 2023 7:51PM by PIB Hyderabad

ఆటోమోటివ్ సెక్టార్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎ ఎస్ డి  సి), జిఐజడ్-ఐజివిఇటి,  మహారాష్ట్ర స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ (ఎంఎస్ఎస్ డిఎస్) సహకారంతో చేపట్టిన క్లస్టర్ బేస్డ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రాజెక్టు ద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన శిక్షకుల (టి ఒ టి ) సమూహాన్ని సృష్టించడానికి నైపుణ్యాభివృద్ధి , వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ (ఎం ఎస్ డిఇ) తన నిబద్ధతను ప్రదర్శించింది.

 

2023 జూన్ 10న పుణెలో ఎ ఎస్ డి సి నిర్వహించిన స్నాతకోత్సవంలో చివరి నాలుగు బ్యాచ్ ల 98 మంది శిక్షకులకు సర్టిఫికేట్ లు ప్రదానం చేశారు.

 

స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) జాతీయ విభాగంలో భాగంగా శిక్షణ పొందిన ట్రైనర్ లు ఆటోమోటివ్ సెక్టార్ డెవలప్మెంట్ కౌన్సిల్ , ఐజిసిసి (జర్మన్ సర్టిఫికేషన్ ఏజెన్సీ) మదింపుల తరువాత డ్యూయల్ సర్టిఫికేషన్ పొందారు. అడ్వాన్స్ డ్ వెల్డింగ్, సీఎన్ సీ ఆపరేషన్స్, రోబోటిక్స్, క్వాలిటీ కంట్రోల్, అడ్వాన్స్ డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి ట్రేడ్ లను టి ఒ టి  ప్రోగ్రామ్ కవర్ చేసింది. ఎంఎస్.డిఇ, ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఏఎస్ డీసీ), జీఐజెడ్ -ఐజీవీఈటీ, మహారాష్ట్ర స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ (ఎంఎస్ ఎస్ డీఎస్ ) ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.

 

ఈ సర్టిఫికేషన్ కార్యక్రమానికి స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్ శ్రీ నీలంబూజ్ శరణ్,  ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సీఈఓ అరిందమ్ లాహిరి ఐజీవీఈటీ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ రోడ్నీ రెవియర్ తదితరులు హాజరయ్యారు.

 

పుణెలోని సుఖకర్తా జనరల్ ఇంజినీరింగ్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్

(ఎస్ జి ఇ సి పి ఎల్ ) సహకారంతో నిర్వహించిన ఈ టి ఒ టి కార్యక్రమం ఎనిమిది బ్యాచ్ లలో మొత్తం 189 మంది ట్రైనర్లకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు.

ఇందులో ఒక నెల తరగతి గది శిక్షణ, తరువాత ఒక నెల ఆన్-ది-జాబ్ శిక్షణ ఉన్నాయి. ఈ చొరవ సాంకేతిక ,వృత్తి విద్య ,శిక్షణ (టివిఇటి) డొమైన్ లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది, పరిశ్రమ 4.0 అవసరాలకు అనుగుణంగా ట్రైనర్ ల సాంకేతిక ,బోధనా నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేసింది. అంతేకాక, పాఠ్యప్రణాళిక అభివృద్ధిలో పరిశ్రమ సభ్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా నైపుణ్యాల అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించింది.

 

ఈ సందర్భంగా శ్రీ నీలంబూజ్ శరణ్ మాట్లాడుతూ, ఆటోమోటివ్ రంగంలో క్లస్టర్ ఆధారిత టి ఒఓటి ప్రభుత్వ ,ప్రైవేట్ రంగం ,పరిశ్రమ అలైన్ మెంట్ మధ్య సమన్వయానికి ఒక ప్రత్యేక ఉదాహరణ అని అన్నారు. క్లస్టర్ ఆధారిత టిఓటి ప్రాజెక్ట్ ఆటోమోటివ్ రంగంలో శిక్షకులకు నైపుణ్య శిక్షణ ,అప్ స్కిల్ అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషించింది.

 

ప్రపంచబ్యాంకు ఎయిడెడ్ స్కీమ్ స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్ నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) ద్వారా చేపట్టిన కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా పూర్తి చేయడంలో ఏఎస్ డీసీ, సుఖకర్తా జనరల్ ఇంజినీరింగ్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్  యూనిట్ల క్రియాశీలక భాగస్వామ్యాన్ని ఆయన అభినందించారు.  పరిశ్రమలో వేగవంతమైన పురోగతి , మార్పులతో నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను తీర్చడానికి శ్రామిక శక్తిని సిద్ధం చేయడానికి అత్యంత సమర్థవంతమైన శిక్షకుల సమూహాన్ని అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా సర్టిఫికెట్లు పొందిన ట్రైనర్లను ఆయన అభినందించారు.

 

ఎఎస్ డిసి సిఇఒ శ్రీ అరిందమ్ లాహిరి మాట్లాడుతూ, పోటీ ఆటోమోటివ్ రంగంలో అప్ స్కిల్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. శ్రామిక శక్తి నైపుణ్యాలను నిరంతరం పెంచడం ద్వారా, ఈ రంగంలో సృజనాత్మకత, సమర్థత ,శ్రేష్ఠతను పెంపొందించవచ్చని ఆయన అన్నారు.

 

టి ఒటి నమూనాను మొదట ఔరంగాబాద్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు, అడ్వాన్స్ డ్ వెల్డింగ్, సిఎన్ సి ఆపరేషన్స్ , రోబోటిక్స్ అనే మూడు ఉద్యోగ పాత్రలను కవర్ చేశారు, ఒక్కో బ్యాచ్ చొప్పున మొత్తం 75 మంది శిక్షకులు ఉన్నారు. ప్రస్తుతం, భారతదేశం అంతటా ఆటో ఒ ఇ ఎం  లకు మద్దతు ఇచ్చే 3000+ పరిశ్రమలు ఉన్న పుణె లోని ఆటోమోటివ్ క్లస్టర్ లో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతోంది. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధిక విలువ జోడింపులను ప్రోత్సహించడానికి, నైపుణ్యాలను అకడమిక్ మార్గాలతో అనుసంధానించడానికి ఆటోమోటివ్ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేయడానికి , అప్ గ్రేడ్ చేయడానికి కట్టుబడి ఉంది.

 

పరిజ్ఞానం, నైపుణ్యాలు, బోధనా పద్ధతులను అందించడంలో శిక్షకుల కీలక పాత్రను గుర్తించిన కేంద్రం స్కిల్ ఇండియా మిషన్ లో అంతర్భాగంగా ట్రైనర్ల (టిఒటి ) శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చింది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రభావాన్ని రెట్టింపు చేస్తూ వివిధ రంగాల్లో సమర్థవంతమైన, బలమైన శ్రామిక శక్తిని తయారు చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.

 

****



(Release ID: 1932233) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Manipuri