రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు భద్రత కల్పించి, పనితీరు మెరుగుపరచడానికి ఆవిష్కరణలుమరింత మెరుగైన అంతర్జాతీయ సహకారం అవసరం ... రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


శిక్షణ, సాంకేతికత రంగాలలో పెట్టుబడులు ఎక్కువ కావాలి.. శ్రీ రాజ్‌నాథ్ సింగ్

శాంతి పరిరక్షక కార్యకలాపాలలో మహిళలకు మరింత ప్రాధాన్యత పెరగాలి.. పెరగాలి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాలి.. శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 13 JUN 2023 12:12PM by PIB Hyderabad

హింసాత్మక ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు భద్రత కల్పించి, పనితీరు మెరుగుపడేలా చూసేందుకు దేశాల  సహకారం అవసరమని రక్షణ శాఖ మంత్రి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శాంతి పరిరక్షక దళాల సామర్ధ్యాన్ని పెంపొందించడానికి వినూత్న విధానాలు, ఆవిష్కరణలు అవసరమని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్  అన్నారు. 2023 జూన్ 13 న న్యూఢిల్లీలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం  75 వ వార్షికోత్సవం   భారత సైన్యం నిర్వహించిన ప్రత్యేక స్మారక సదస్సులో ఆయన ప్రసంగించారు.

 శ్రీ రాజ్‌నాథ్ సింగ్  తన ప్రసంగంలో శాంతి పరిరక్షక దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రస్తావించారు.సవాళ్లు అధిగమించడానికి  సిబ్బందికి  భద్రత కల్పించడానికి, శక్తి సామర్ధ్యాలు పెంపొందించడానికి చేపట్టే శిక్షణ, సాంకేతికత రంగాలపై  పెట్టుబడి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.  శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో మహిళలు అర్ధవంతమైన భాగస్వామ్యం కోసం చర్యలు అమలు జరగాలని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమాల్లో మహిళలు పోషిస్తున్న పాత్రను గుర్తించి గౌరవించాలని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

ప్రపంచ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతా మండలితో సహా ఐక్యరాజ్య సమితికి చెందిన అన్ని సంస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్  స్పష్టం చేశారు.  “అత్యధిక జనాభా కలిగిన  భారతదేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. దీంతో  అది  ఐక్యరాజ్య సమితి నైతిక చట్టబద్ధత ప్రశ్నార్ధకంగా మారింది.  ఐక్యరాజ్యసమితి సంస్థలను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా,ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా  మార్చడానికి సమయం ఆసన్నమైంది. ”అని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి  శాంతి పరిరక్షక దళాలు పనితీరు పట్ల  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు.   'బాహ్యత' అనే ఆర్థిక భావన ద్వారా కార్యకలాపాలకు ప్రపంచ ప్రపంచ దేశాలు సహకారం అందించాలని అన్నారు. 

“వివాదం తలెత్తినప్పుడు సంబంధిత వర్గాలపై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల అనేక వర్గాలపై పరోక్ష ప్రభావం ఉంటుంది.  రష్యా-ఉక్రెయిన్ వివాదం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు కనిపించాయి.  వెలువడిన ప్రతికూల బాహ్యతలు చాలా ఉన్నాయి.  రష్యా-ఉక్రెయిన్ వివాదం వల్ల   వివిధ ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఆహార సంక్షోభం ఏర్పడింది.  ప్రపంచంలో ఇంధన సంక్షోభానికి ఆజ్యం పోసింది. ఒక నిర్దిష్ట ప్రదేశం లేదా ప్రాంతంలో జరిగిన సంఘర్షణ మొత్తం ప్రపంచాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిస్థితులు  సృష్టిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంఘర్షణను పరిష్కరించడంలో, శాంతి పునరుద్ధరించడం లో ప్రపంచ దేశాలు తమ వంతు బాధ్యత నిర్వర్తించడానికి సిద్ధం కావాలి.  శాంతి సానుకూల ప్రభావం  కలిగి చూపిస్తుంది. వివాదాన్ని పరిష్కరించి శాంతిని పునరుద్ధరించడం వల్ల  మానవ జీవితాలనురక్షించడానికి,  అధిక ఆర్థిక వృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. శాంతి స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.  ఆర్థిక వృద్ధి సాధనకు అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల   మిగిలిన ప్రపంచం కూడా ప్రయోజనం పొందుతుంది, ”రక్షణ శాఖ మంత్రి తెలిపారు. 

శాంతి వల్ల కలిగే  సానుకూల ప్రయోజనాలు,  యుద్ధం పరిస్థితుల వల్ల ఏర్పడు   ప్రతికూల పరిస్థితులను   పరిష్కరించడానికి బాధ్యతగల దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సంఘర్షణ ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాలను మోహరించి ఐక్యరాజ్య సమితి తన భాద్యత నిర్వర్తిస్తుంది అని  ఆయన  తెలిపారు.

ఐక్యరాజ్య సమితి చేపడుతున్న శాంతి పరిరక్షక కార్యకలాపాలకు భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శాంతి పునరుద్ధరణ కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో  భారత సైనిక దళం పాల్గొంటుందన్నారు.  ఇప్పటివరకు శాంతి పరిరక్షక కార్యకలాపాలకు భారతదేశం సుమారు 2.75 లక్షల మంది సైనికులను పంపింది.  ప్రస్తుతం 5,900 మంది సైనికులు ఐక్యరాజ్య సమితి చేపట్టిన 12 కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 1950లో కొరియా సంక్షోభంతో భారతదేశం శాంతి పునరుద్ధరణ కార్యక్రమాలకు సహకారం అందించడం ప్రారంభించింది. భారతీయ దళాలు సంక్లిష్టమైన విధులు నిర్వర్తిస్తూ  శాంతి కార్యకలాపాల  పర్యవేక్షణలో పాల్గొంటున్నాయి .  వృత్తిపరమైన నైపుణ్యానికి భారత  విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఐక్యరాజ్య సమితి  శాంతి పరిరక్షకులుగా పనిచేసిన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయులందరికీ రక్షణ  మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశానికి చెందిన   సైనికులు, పోలీసు సిబ్బంది  పౌర నిపుణులు శాంతి కోసం అసాధారణమైన అంకితభావం  అచంచలమైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు. సిబ్బంది  నిస్వార్థంగా కొన్ని అత్యంత సవాలు, ప్రమాదకరమైన వాతావరణాలలో సేవలందించారు. శాంతి పరిరక్షక స్ఫూర్తిని కలిగి ఉన్నారు.  ఐక్యరాజ్యసమితి  నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది   నిబద్ధత, వృత్తి నైపుణ్యం, త్యాగాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి, ”అని మంత్రి పేర్కొన్నారు. 

 

విధి నిర్వహణలో తమ కుటుంబ సభ్యులను  కోల్పోయిన కుటుంబాలకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తన సంతాపాన్ని తెలియజేసి  వారికి ప్రభుత్వ సహాయాన్ని అందించారు. మరింత న్యాయమైన, శాంతియుతమైన, సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడం ద్వారా శాంతి పరిరక్షకుల త్యాగాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. “ చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి , అవగాహన, సహకారం కోసం ప్రపంచ దేశాలు ముందుకు రావాలి.. ప్రతి వ్యక్తి శాంతి, సామరస్యం కోసం కృషి చేస్తే గౌరవంగా జీవించగలిగే భవిష్యత్తునునిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది' అని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  

 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ  శాంతి పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం అందిస్తున్న సహకారాన్నివివరించారు.   ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన 5,900 మంది  శాంతి పరిరక్షక కార్యకలాపాలలో సేవలందిస్తున్నారు అని ఆయన తెలిపారు.భారతదేశానికి చెందిన  మహిళా సిబ్బంది బృందాలు కాంగోలో ఐక్యరాజ్యసమితి  ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్,ఐక్యరాజ్యసమితి  తాత్కాలిక భద్రతా దళం ) మహిళా సిబ్బంది అధికారులు, సైనిక పరిశీలకులతో కలిసి పనిచేస్తున్నారని  ఆయన పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా భారతదేశం పాల్గొన్న  గొప్ప శాంతి పరిరక్షక కార్యక్రలాపాలతో రూపొందించిన చిత్ర సంకలనాన్ని  ఆవిష్కరించారు.  దేశ శాంతి పరిరక్షణ చరిత్రను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి శ్రీమతి రుచిరా కాంబోజ్ ఈ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, భారతదేశంలో ఐక్యరాజ్యసమితి  రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ శాంబి షార్ప్ ,రక్షణ మంత్రిత్వ శాఖ,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

యూఎన్  ప్రొటెక్షన్ ఫోర్స్  మాజీ హెడ్ ఆఫ్ మిషన్ మరియు ఫోర్స్ కమాండర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ జనరల్ సతీష్ నంబియార్ (రిటైర్డ్) శాంతి పరిరక్షణలో  భారత దళాలు నిర్వర్తించిన పాత్ర అను అంశంపై ప్రసంగించారు. 

కార్యక్రమంలో ఆర్మీ స్టాఫ్ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కంపోజ్ (రిటైర్డ్)   యూఎన్  రాయబారి శ్రీ అసోకే ముఖర్జీ, భారతదేశంలో ఐక్యరాజ్యసమితి  రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ శాంబి షార్ప్ తదితరులు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పనిచేస్తున్న వారి వృత్తి నైపుణ్యం, అంకితభావం  ధైర్యాన్ని గౌరవించటానికి, శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం మే 29న ఐక్యరాజ్య సమితి  శాంతి పరిరక్షక అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

***



(Release ID: 1932116) Visitor Counter : 258