గనుల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (జీఎస్ ఐ టి ఐ)కు 'అతి ఉత్తమ్ ' గుర్తింపు ఇచ్చిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్
Posted On:
13 JUN 2023 5:23PM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (జి ఎస్ ఐటీఐ)కు ఎర్త్ సైన్స్ శిక్షణ రంగంలో విశేష సేవలు, ఉన్నత ప్రమాణాలకు గుర్తింపుగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్ ఎ బి ఇ టి) గుర్తింపును మంజూరు చేసింది.
వివిధ స్థాయిల్లో సంస్థ అనుసరిస్తున్న అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు, మెథడాలజీల పరిశీలన ఆధారంగా ఈ గుర్తింపు ను ఇచ్చారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సి బి సి), నాబెట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు చెందిన బృందం ఆన్ సైట్ అసెస్ మెంట్ నిర్వహించి అతి ఉత్తమ్ గ్రేడింగ్ తో సర్టిఫికెట్ ఆఫ్ అక్రిడిటేషన్ ను ప్రదానం చేసింది.
1976 లో ఏర్పాటయిన జిఎస్ఐటిఐ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, నాగపూర్, జైపూర్, లక్నో, కోల్ కతా షిల్లాంగ్ లలో ఆరు ప్రాంతీయ శిక్షణా విభాగాలను (ఆర్టిడి) కలిగి ఉంది. చిత్రదుర్గ (కర్ణాటక), రాయ్ పూర్ (ఛత్తీస్ గఢ్), జవార్ (రాజస్థాన్), కుజు (జార్ఖండ్)లలో నాలుగు ఫీల్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఎఫ్ టి సి లు) కూడా ఏర్పాటు చేశారు. భౌగోళిక శాస్త్ర నిపుణులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులకు భూగర్భశాస్త్ర వివిధ విషయాలలో వివిధ శిక్షణలను అందించడానికి గనుల మంత్రిత్వ శాఖ విజన్ ప్రకారం ఈ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. అందువల్ల, జిఎస్ఐటిఐ అనేది గనుల మంత్రిత్వ శాఖ కింద ఒక జాతీయ శిక్షణా కేంద్రం, ఇది కేంద్ర, రాష్ట్ర విభాగాలు, పిఎస్ యులు (ఎంఇసిఎల్, ఒఎన్.జిసి, ఒఐఎల్, ఎన్ఎండిసి), జాతీయ విద్యా సంస్థలు (ఐఐటిలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు,కళాశాలలు) కాలేజీలతో సహా బహుళ భాగస్వాములకు శిక్షణ, సామర్థ్యాన్ని పెంచుతుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్పాన్సర్ చేసిన ఎన్ఎన్ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్ కింద ఈ సంస్థ క్రమం తప్పకుండా రిమోట్ సెన్సింగ్ పై కోర్సులను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన ఐటిఇసి కార్యక్రమం కింద అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములకు శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు చెందిన నిపుణులు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందారు.
జీఎస్ఐటీఐ హైదరాబాద్ లోని తన కేంద్రం, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ టి డి లు, ఎఫ్ టి సి ల ద్వారా డొమైన్ స్పెసిఫిక్, టెరైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లను అందిస్తుంది.
హిమాలయాలతో సహా వివిధ భూభాగాల మ్యాపింగ్ పద్ధతులు, ఖనిజీకరణ మండలాలను లక్ష్యంగా చేసుకునే అన్వేషణ పద్ధతులు (బంగారం, వజ్రం, రాగి, లిథియం, ఆర్ ఇ ఇ, ఇనుము, మాంగనీస్ మొదలైనవి), ఫోటో జియాలజీ ,రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, పెట్రాలజీ, జియోక్రోనాలజీ, జియోఫిజిక్స్, రసాయనశాస్త్రంలో విశ్లేషణ పద్ధతులు, పర్యావరణ ,పట్టణ భూగర్భ శాస్త్రం, సహజ విపత్తు ఉపశమనంలో డొమైన్ సామర్థ్యాలను పెంపొందించడానికి శిక్షణా కోర్సులను అందిస్తారు.
ఈ సంస్థ ఉద్యోగుల క్రియాత్మక సామర్థ్యాలను అప్ గ్రేడ్ చేయడానికి కోర్సులను అందిస్తుంది. అధికారుల్లో ప్రవర్తనా సామర్థ్యాలను పెంపొందించే అంశాలను చేర్చడంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది.
*****
(Release ID: 1932057)
Visitor Counter : 192