నౌకారవాణా మంత్రిత్వ శాఖ
బిపర్‌జాయ్ తుఫానుకు సంసిద్ధతను సమీక్షించిన శ్రీ సర్బానంద సోనోవాల్
ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడేందుకు ఐఎండి, డిజిఎస్, ఇతర అధికారులు జారీ చేసిన సూచనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలిః శ్రీ సర్బానంద్ సోనోవాల్
ప్రజల రక్షణకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకోవలసిందిగా ఆదేశించిన శ్రీ సోనోవాల్
Posted On:
12 JUN 2023 7:42PM by PIB Hyderabad
ఉత్తర అరేబియా సముద్రంలో సంభవించిన సైక్లోన్ బిపర్‌జాయ్ జూన్ 15న గుజరాత్ తీరం దాటే అవకాశముండటంతో తుఫానుకు సంబంధించిన సంసిద్ధతను సమీక్షించేందుకు అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ అధ్యక్షత వహించారు. బలహీన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు క్షేమంగా ఉండేలా చూసేందుకు సాధ్యమైన చర్యలు అన్నీ తీసుకోవలసిందిగా శ్రీ సోనోవాల్ సమావేశం సందర్భంగా ఆదేశించారు.
జీవితాలను, పర్యావరణాన్ని కాపాడేందుకు ఐఎండి డిజిఎస్, ఇతర అధికారులు జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించడమే కాక, అవసరమైన రక్షణ, ఆశ్రయం, పునరావాసం అందించడానికి అన్ని ముందస్తు జాగ్రత్తలు/ నివారణ చర్యలు, ఉపశమనానికి సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో జరగేలా చూసుకోవాలని ఆయన అన్నారు.
కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా డిజి షిప్పింగ్, ఆయా రేవులను, సంబంధిత అధికారులను శ్రీ సోనోవాల్ ఆదేశించారు. ఎస్ ఐటిఆర్ ఇపి ప్రాంతంలోని అన్ని రేవులు తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని,దాని నుంచి కాపడేందుకు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు తాజా పరచాలని ఆయన అన్నారు.
***
(Release ID: 1931906)
Visitor Counter : 126