గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రేపు రాష్ట్రపతి భవన్‌లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పివిటిజి సమావేశానికి హాజరుకానున్న భారత రాష్ట్రపతి
Posted On:
11 JUN 2023 9:11PM by PIB Hyderabad
రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాష్ట్రపతి భవన్‌లోని క్రీడా మైదానంలో పివిటిజి (నిర్ధిష్టంగా బలహీన గిరిజన సమూహాలకు సంబంధించి మంగళవారం జరుగనున్న సమావేశంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.
విస్త్రతమైన సంభాషించడానికి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పలు పథకాలు, చొరవల గురించి వారికి తెలియచెప్పేందుకు రాష్ట్రపతి భవన్‌కు 75మంది పివిటిజిల సభ్యులను రాష్ట్రపతి ఆహ్వానించారు.
పివిటిజి సభ్యులకు ఉదయంపూట రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్‌లో పర్యటించేందుకు టూర్‌ను నిర్వహిస్తున్నారు.
గరిజన సాంస్కృతిక నృత్యాలు అయిన బీహార్‌కు చెందిన మల్ పహాడియా, గుజరాత్‌కు చెందిన సిద్ది, కేరళకు చెందిన ఇరుల, రాజస్థాన్‌కు చెందిన సహారియా, మధ్యప్రదేశ్‌కు చెందిన బైగా పర్ధౌనీ, ఒడిషాకు చెందిన బుడిగాలికి ఈ ఆవరణ ఆతిథ్యమివ్వనుంది.
అంతేకాకుండా, ప్రతి పివిటిజి సమూహానికి చెందిన ఒక పురుష, ఒక మహిళా అతిథిని రాష్ట్రపతి సత్కరించనున్నారు. అనంతరం గ్రూప్ ఫోటో సెషన్ ఉండనుంది.
రాష్ట్రపతి భవన్‌లోని క్రీడా మైదానంలో పివిటిజి అతిథులు హైటీ, విందుభోజనానికి హాజరవుతారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్, గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ టుడు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇంతకుముందు, మే నెలలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా కాలుజ్ స్టేడియంలో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టిఆర్ఐఎఫ్ఇడి). నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌టిఎఫ్‌డిసి) గిరిజన తెగలకు ఊతం ఇవ్వడాన్ని వేగవంతం చేసేందుకు ఝార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల సమ్మేళనాన్ని భారత రాష్ట్రపతి సందర్శించి, మహిళా స్వయం సహాయకసభ్యులతో ముచ్చటించారు.
బడ్జెట్ 2023-24లో వివిధ పథకాలు, చొరవలకు అదనంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి పివిటిజి డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రకటించడాన్ని ప్రస్తావించడం సముచితం. ఇది పవిటిజి కుటుంబాలు, ఆవాసాలను రక్షిత గృహాలు, స్వచ్ఛమైన మంచి నీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం పౌష్టికాహారం, రహదారులు, టెలికాం అనుసంధానతకు, నిలకడైన జీవనోపాధి అవకాశాలవంటి ప్రాథమిక సౌకర్యాలను నెరవేరుస్తుంది..
రేపటి సమావేశ లక్ష్యం పివిటిజి సమూహాల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి తెలియజేయడం.
****
(Release ID: 1931902)
Visitor Counter : 140