నౌకారవాణా మంత్రిత్వ శాఖ

రూ. 169.17 కోట్ల విలువైన కొచ్చిన్ చేపల రేవుకు శంకుస్థాపన చేసిన శ్రీ శర్వానంద సోనోవాల్


ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చేందుకు కలిసి పనిచేస్తున్న ఓడరేవులు, నౌకానిర్మాణం, జలమార్గాల (ఎం ఓ పి ఎస్ డబ్ల్యు) మంత్రిత్వ శాఖ , మత్స్య శాఖ. ఈ ప్రాజెక్టు వల్ల చేపలు మరియు చేపల ఉత్పత్తుల ఎగుమతి ఏటా రూ. 1500 కోట్లు పెరుగుతుంది: శర్వానంద సోనోవాల్

సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కొచ్చిన్ చేపల రేవులో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.

మత్స్యకారుల సంక్షేమానికి దోహదం చేస్తున్న సాగరమాల తద్వారా ఆర్ధిక వృద్ధికి ఊతమిస్తోంది

Posted On: 11 JUN 2023 3:47PM by PIB Hyderabad

కేరళలోని తోప్పుమ్ పాడి వద్ద కొచ్చిన్ చేపల రేవు ఆధునీకరణ మరియు విస్తరణ పనులకు కేంద్ర ఓడరేవులు, నౌకానిర్మాణం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ ,  కేంద్ర మత్స్య, పశుగణాభివృద్ధి మరియు పాడిపరిశ్రమ మంత్రి శ్రీ పరుషోత్తం రూపాల శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ. 169.17 కోట్లు.  మొత్తం ప్రాజెక్టు వ్యయం గ్రాంట్ల రూపంలో ఉంటుంది.  రూ. 50 కోట్లు మత్స్య శాఖ పరిధిలోని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎం ఎం ఎస్ వై)  పథకం నుంచి,  రూ. 50 కోట్లు ఓడరేవులు, నౌకానిర్మాణం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సాగరమాల ప్రాజెక్టు పథకం నుంచి,  రూ. 55.84 కోట్లు  ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో (పి పి పి) నిర్వాహకుని పెట్టుబడి ఉంటాయి.

ప్రాజెక్టు మొదటి దశలో వేలం కోసం మూడు ఎయిర్ కండిషన్డ్ హాళ్లు,   ఒకటి మామూలు హాలు,  ఒక చేపలు కడిగే యూనిట్, ఇతర అనుబంధ యూనిట్లు ఉంటాయి.  ఈ ప్రాజెక్టు కింద అంతర్గత రోడ్లు,  లోడింగ్ , అన్ లోడింగ్ ప్లాటుఫారాలు నిర్మిస్తారు.  వ్యర్ధాల నిర్వహణ ప్రాంతం అభివృద్ధి చేస్తారు.  క్యాంటిన్ సౌకర్యం ఉంటుంది.  డ్రైవర్లు వేచి ఉండే ప్రాంతం, పూడిక తీయడం,  యంత్ర పరికరాలు ,  ఉపకరణములు మొదలైనవి ఉంటాయి.    వేలం పాటల కోసం నాలుగు ఉష్ణోగ్రత నియంత్రిత హాళ్లు నిర్మించడంవల్ల చేపల రేవు సామర్ధ్యం రోజుకు  415 టన్నులు పెరుగుతుంది.

'చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయడం ద్వారా మత్స్య రంగాన్ని బలోపేతం చేయవచ్చని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వసిస్తున్నారని,
అయన నాయకత్వంలో ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చేందుకు   ఓడరేవుల మంత్రిత్వ శాఖ,  మత్స్య శాఖ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని,  కొచ్చిన్ చేపల రేవును అభివృద్ధి చేయడం వల్ల మత్స్యకారుల సంక్షేమానికి దోహదం చేస్తుందని, తద్వారా ఆర్ధిక వృద్ధికి ఊతమిస్తుందని  కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ శర్వానంద సోనోవాల్ తెలిపారు
          'ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత  చేపలు మరియు చేపల ఉత్పత్తుల ఎగుమతి ఏటా రూ. 1500 కోట్లు పెరుగుతుంది.  అంతేకాక  
 పరిశుభ్రత బాగా మెరుగవుతుంది' అని సోనోవాల్ తెలిపారు.

          తోప్పుమ్ పాడి రేవులో సంవత్సరంలో 10 నెలలు చేపల వేట సాగుతుంది.   ఆగస్టు నుంచి నవంబర్ వరకు చేపల వేట అత్యధికంగా ఉంటుంది.  ఈ రేవులో 40 నుంచి 60 పడవలు వేటకు వెళ్తాయి.  రోజుకు 250 టన్నుల చేపలు పడతారు.  రొయ్యలతో పాటు పలు రకాల సముద్ర చేపలను వేటాడతారు.

            సాగరమాల కార్యక్రమం కింద 2035 నాటికి  రూ. 5.5 లక్షల కోట్ల విలువైన 802 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   ప్రైవేటు భాగస్వామ్యంలో  రూ. 45,000 కోట్ల విలువైన మొత్తం 29 ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేశారు. తద్వారా ఖజానాపై ఆర్ధిక  భారం తగ్గింది.   రూ. 51,000 కోట్ల విలువైన మరో 32  పి పి పి ప్రాజెక్టులు అమలవుతున్నాయి. నిర్మాణంలో ఉన్న మరో 200 ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తవుతాయి.
         ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్టాలలో నాలుగు ప్రాజెక్టులను సాగరమాల అభివృద్ధి కంపెనీ ద్వారా  రూ. 530 కోట్ల పెట్టుబడితో పూర్తిచేశారు.
సాగరమాల కార్యక్రమం కింద  ఓడరేవులు, నౌకానిర్మాణం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు రూ. 620 కోట్ల విలువైన 9 చేపల రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసింది.  దానివల్ల  30వేల మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుంది.   అంతేకాక రూ. 550 కోట్ల ఖర్చుతో అయిదు చేపల రేవులను ఆధునీకరించారు. 

***



(Release ID: 1931820) Visitor Counter : 131