మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధునిక ఫిషింగ్ హార్బర్‌లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7,500 కోట్లకు పైగా ప్రాజెక్టులను ఆమోదించింది: పర్షోత్తమ్ రూపాలా


కొచ్చిన్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మరియు అత్యాధునికీకరణ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన చేసిన పర్షోత్తమ్ రూపాలా

Posted On: 11 JUN 2023 2:30PM by PIB Hyderabad

కొచ్చిన్లోని కొచ్చిన్ పోర్ట్ అథారిటీ విల్లింగ్‌డన్ ఐలాండ్‌లోని తోప్పుంపాడి, సాముద్రికా హాల్‌లో కొచ్చిన్ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అత్యాధునికీకరణ ప్రాజెక్టుకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, ఓడరేవుల షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్నాకుళం లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు శ్రీ హిబీ ఈడెన్, కొచ్చి నియోజకవర్గ శాసనసభ సభ్యుడు శ్రీ కె.జె.మాక్సీ, ఎర్నాకుళం నియోజకవర్గ శాసనసభ సభ్యుడు శ్రీ టి.జె.వినోద్, కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ అడ్వకేట్. ఎం. అనిల్ కుమార్, మత్స్య మంత్రిత్వ మరియు పాడిపరిశ్రమల శాఖ ప్రత్యేక విధి అధికారి డాక్టర్  అభిలాక్ష్ లిఖి, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సువర్ణ చంద్రప్పరగారి, కేరళ మత్స్యశాఖ కు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ. కె.ఎస్. శ్రీనివాస్, కొచ్చిన్ పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్, డాక్టర్ ఎం బీనా తదితరులు పాల్గొన్నారు.  భారత ప్రభుత్వపు మత్స్య శాఖ, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ పీఎంఎంఎస్‌వై కింద రూ.100 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయంతో తొప్పుంపాడి వద్ద కొచ్చిన్ ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరించడం మరియు మెరుగుపరచడం కోసం మొత్తం రూ.169.17 కోట్లతో కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ చేసిన ప్రతిపాదనకు మార్చి 2022లో భారతదేశం ఓడరేవుల మంత్రిత్వ శాఖతో కలిసి ఆమోదం తెలిపింది.  సాగరమాల కింద ఈ పనులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కొచ్చిన్ ఫిషింగ్ హార్బర్‌లో పనిచేస్తున్న 700 ఫిషింగ్ బోట్‌లకు ప్రయోజనం చేకూరుస్తుంది, ఇది సుమారు 10000 మంది మత్స్యకారుల ప్రత్యక్ష జీవనోపాధికి, విలువ గొలుసులో దాదాపు 30, 000 మంది మత్స్యకారుల పరోక్ష జీవనోపాధికి తోడ్పడుతుంది. ఆధునికీకరణ ప్రాజెక్ట్ పరిశుభ్రమైన పరిస్థితులలో గణనీయమైన మెరుగుదలకు తోడ్పడుతుందని మరియు చేపలు మరియు చేపల ఉత్పత్తుల ఎగుమతి ద్వారా ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.ఎయిర్ కండిషన్డ్ వేలం హాళ్లు, ఫిష్ డ్రెస్సింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్, అంతర్గత రోడ్లు, లోడింగ్ & అన్‌లోడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆఫీస్, డార్మిటరీ మరియు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం ఆధునీకరణ కింద చేపట్టిన ప్రధాన కార్యకలాపాలు.  శీతల గిడ్డంగులు, స్లర్రి & ట్యూబ్ ఐస్ ప్లాంట్ల ఏర్పాటు, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ సౌకర్యం, రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్, ఫుడ్ కోర్ట్, రిటైల్ మార్కెట్ మొదలైన భాగాలను కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ.55.85 కోట్లు. ఇది పీపీపీ భాగంగా కలిగి ఉంది. ఈ  సందర్భంగా మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా మాట్లాడుతూ సర్కారు రూ. 7,500 కోట్లకు పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని అన్నారు. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్.ఐ.డి.ఎఫ్), సాగరమాల పథకం మరియు ప్రధాన మంత్రి మత్స్య యోజన (పీఎంఎంఎస్వై) పథకం కింద ఆధునిక ఫిషింగ్ హార్బర్‌లు మరియు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ల అభివృద్ధి కోసం అవసరమైన ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

 

***


(Release ID: 1931692) Visitor Counter : 164