విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎలక్ట్రిక్ వంటకు భారతదేశం యొక్క ఫాస్ట్- ఫార్వార్డింగ్ పరివర్తన:


ఇ– -వంట పరివర్తన కోసం వినియోగదారుల- కేంద్రీకృత విధానాలను అన్వేషించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించబడుతుంది.

Posted On: 03 JUN 2023 12:05PM by PIB Hyderabad

జూన్ 5, 2023న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున, భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో “ఇ–-వంట పరివర్తన కోసం వినియోగదారు-కేంద్రీకృత విధానాలపై సదస్సు” నిర్వహిస్తోంది. ఇంధన- సమర్థత, స్వచ్ఛమైన మరియు సరసమైన ఇ-–వంట పరిష్కారాల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ సమావేశం మార్గాలను అన్వేషిస్తుంది. క్లాప్స్(CLASP) సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), విద్యుత్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు..  సంస్థాగత వినియోగదారులు, వినియోగదారుల రీసెర్చ్ గ్రూపులు, విధాన రూపకర్తలు, విశ్లేషకులు, తయారీదారులు, ఇతరులను ఒకచోటకు తీసుకురావడంతోపాటు ఎలక్ట్రిక్ వంటకు మారడానికి అవసరమైన వ్యూహాలు, విధివిధానాలపై ప్రకటన చేస్తాయి.

మిషన్ లైఫ్‌కి ఇ-–వంట ప్రధానం
ఎలక్ట్రిక్ వంటపై దృష్టి కేంద్రీకరించడం అనేది మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)కి ఇ–-వంట ఒక కీలకమైన మార్గం అని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. ఇది పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రోత్సహించడానికి భారతదేశం నేతృత్వంలో జరుగుతున్న ప్రపంచ సామూహిక ఉద్యమం. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26)లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్, స్థిరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తులను పర్యావరణ అనుకూల వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది.

స్వచ్ఛమైన వంట శక్తిని పొందడం అనేది భారతదేశ శక్తి పరివర్తన ప్రయాణంలో కీలకమైన అంశం. వంట ఇంధనానికి సంబంధించి మనం చేసే ఎంపికలు స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారతదేశ అభివృద్ధి పథంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశం యొక్క స్వచ్ఛమైన వంట పరివర్తనకు శక్తి వినియోగాన్ని నడిపించే వ్యక్తిగత మరియు సమాజ చర్యలు మరియు నిర్ణయాలను పునరాలోచించడం ఎంతైనా అవసరం.

స్వచ్ఛమైన వంటపై ప్రభుత్వ విధవిధానాల గురించి విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ తివారీ  మాట్లాడుతూ ఇలా అన్నారు..  “స్వచ్ఛమైన వంట వల్ల ఆరోగ్య, ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలను గుర్తించిన భారత ప్రభుత్వం..  స్వచ్ఛమైన వంట ఇంధనాలను ప్రోత్సహించే విధానాలకు ప్రాధాన్యతనిచ్చింది. విద్యుదీకరణలో విపరీతమైన పురోగతితో పాటు, పునరుత్పాదక శక్తి నుండి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ సరఫరాలో పెరుగుతున్న వాటాతో, ఎలక్ట్రిక్ వంట పరిష్కారాలు భారతదేశాన్ని పర్యావరణ అనుకూలమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తాయి.

"శక్తి- సమర్థవంతమైన మరియు సరసమైన స్వచ్ఛ వంట ఉత్పత్తులను విస్తృతంగా స్వీకరించడాన్ని ఇది ప్రోత్సహించే  సమయం"

ఇండక్షన్ కుక్‌స్టవ్‌ల కోసం సమర్థతా విధానం అమలులో ఉన్నందున.. సమర్థవంతమైన మరియు సరసమైన ఉత్పత్తులను విస్తృతంగా స్వీకరించడాన్ని ప్రోత్సహించడం తదుపరి కీలకమైన దశ అని అదనపు కార్యదర్శి సూచించారు. ప్రజలయొక్క ఆలోచనల్లో మార్పు వచ్చేలా ఇ–వంట పరివర్తనకు సంబంధించిన వ్యూహం ఉండాలని, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం మరియు ప్రజా ఉద్యమాన్ని సృష్టించడంలో వారిని భాగస్వామిగా చేయడం పరివర్తనకు కేంద్రంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ తివారీ అన్నారు.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బక్రే మాట్లాడుతూ.. భారతీయులను స్థిరమైన జీవనశైలిని అనుసరించే 'ప్రో ప్లానెట్ పీపుల్'గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు. ఇ-–వంట పచ్చటి మరియు స్థిరమైన వాతావరణానికి మార్గం సుగమం చేస్తుందన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 70 మిలియన్లకు పైగా కుటుంబాలకు స్వచ్ఛమైన మరియు మరింత సమర్థవంతమైన వంట ఇంధనం.. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కవరేజీని విస్తరించడం ద్వారా కొత్త ఉదయానికి నాంది పలికింది. విద్యుదీకరణ స్థితితో కలిపి, ఇ–-వంటను వేగవంతం చేయడానికి ఇది మరింత అవకాశాన్ని ఇస్తుంది. ఇ-–వంటను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం జీవో ఎలక్ట్రిక్ ప్రచారాన్ని ప్రారంభించింది.

ఇ–-వంటకు సంబంధించిన పరిష్కారాలను వివరించడానికి  ఎనేబులర్స్, అప్రోచ్లతో సమావేశం.

పెరుగుతున్న ఇంధన ధరలు మరియు పెరుగుతున్న సరఫరా ఒత్తిళ్లతో, భారతదేశానికి స్వచ్ఛమైన, స్థిరమైన మరియు సరసమైన ఇ-–వంట పరిష్కారం అవసరం. - ఇది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు ఇంధన భద్రతను పెంచుతుంది. ఇ–-వంట పరివర్తన కోసం వినియోగదారు-ల కేంద్రీకృత విధానాలపై నిర్వహించిన ఈ సమావేశం.. ఫైనాన్స్, డిమాండ్ అగ్రిగేషన్, కార్బన్ క్రెడిట్‌లు మరియు వ్యాపార నమూనాలు వంటి ఇ-–వంట పరిష్కారాలను స్వీకరించడానికి అన్వేషిస్తుంది. ఇది ఇ-–వంట పరివర్తనను తీసుకురావడానికి వినియోగదారు-ల కేంద్రీకృత విధానాలు మరియు ప్రవర్తనలపై కూడా ఆలోచన చేస్తుంది. సదస్సులో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఇ–-కుకింగ్ మార్కెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌పై ప్రెజెంటేషన్ మరియు ఇ–-వంటను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమాలపై బీఈఈ ద్వారా ప్రదర్శన ఉంటుంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ తివారీ ప్రత్యేక ప్రసంగం చేయగా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బక్రే కీలకోపన్యాసం చేస్తారు.

న్యూఢిల్లీలోని హయత్ రీజెన్సీలోని సలోన్ వెస్ట్‌లో ఈ సదస్సు జరుగుతోంది.



(Release ID: 1931678) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Marathi , Hindi