రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్‌ల ఉమ్మడి కార్యకలాపాలు
ఆకాశమే హద్దుః భారతీయ నావికాదళ బహుళ విమాన వాహక దళ ప్రదర్శన
Posted On:
10 JUN 2023 1:11PM by PIB Hyderabad
అరేబియా సముద్రంలో 35 విమానాలకు పైగా సమన్వయపూరితమైన మోహరింపుతో, బహుళ వాహక కార్యకలాపాల ప్రదర్శనతో హిందూ మహాసముద్రంలో భారతీయ నావికాదళం సముద్రంలో తన ప్రబల నావికాదళ సామర్ధ్యాలను ఆదివారం ప్రదర్శించింది. సముద్ర రంగంలో తన జాతీయ ప్రయోజనాలను, ప్రాంతీయ సుస్థిరతను నిర్వమించడం, సహకార భాగస్వామ్యాలను పెంచిపోషించాలన్న భారత్ నిబద్ధతను ఈ నావికాదళ పరాక్రమానికి సంబంధించిన ఈ ప్రదర్శన పట్టి చూపుతుంది.
హిందూ మహా సముద్రంలోను, వెలుపల సముద్ర భద్రత, శక్తి ప్రదర్శనను పెంచాలన్న భారత నావికాదళ అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలు రాయిని ఇది సూచిస్తుంది. ఈ విన్యాసంలో విభిన్నమైన నౌకలు, జలాంతర్గాములు, విమానాల సముదాయంతో సహా ఎన్ఎస్ విక్రమాదిత్య, దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ అన్న రెండు ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్స్ (విమాన వాహక నౌక)తో సముద్ర రంగంలో భారతదేశ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
విన్యాసాలలో కేంద్రంగా ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లు ఎంఐజి-29 కె ఫైటర్ జెట్లు, ఎంహెచ్60ఆర్, కమోవ్, సీకింగ్, చేతక్ & ఎఎల్‌హెచ్ హెలికాప్టర్లు సహా విస్త్రతమైన విమానాలకు ప్రయోగ వేదికను అందించే ఫ్లోటింగ్ సావరిన్ ఎయిర్ ఫీల్డ్స్ ( తేలియాడే శ్రేష్టమైన విమనాశ్రయాలు)గా పని చేస్తాయి. ఈ చలనశీల స్థావరాలను ఎక్కడైనా మోహరించి, మిషన్ సౌలభ్యాన్ని పెంచడం, ఉద్భవిస్తున్న ముప్పులకు ఎప్పటికప్పుడు స్పందించడం, ప్రపంచవ్యాప్తంగా మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు నిరంతర వాయు కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఇందుకు అదనంగా, ఈ ప్రాంతంలో ఉమ్మడి భద్రతా అవసరాలకు తోడ్పడే సామర్ధ్యంతో, సన్నద్ధతతో భారతీయ నావికాదళం ఉందనే హామీని మన మిత్రులకు అవి ఇస్తాయి.
రెండు వాహక యుద్ధ బృంద కార్యకలాపాల విజయవంతమైన ప్రదర్శన అన్నది సముద్ర రంగంలో ఆధిపత్యాన్ని నిర్వహించేందుకు సముద్ర ఆధారిత వాయు శక్తి కీలక పాత్ర పోషిస్తుందనడానికి శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటుంది.
భారత్ తన భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తున్నందున, దేశపు రక్షణ వ్యూహాన్ని రూపొందించడంలో, ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ల ప్రాముఖ్యత అత్యంత కీలకంగా ఉంటుంది.
***
(Release ID: 1931333)