వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
Posted On:
08 JUN 2023 4:08PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, రేపు దిల్లీలో జరగనున్న 'ఫెడరేషన్ ఆఫ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ అసోసియేషన్స్ ఇన్ ఇండియా' (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగిస్తారు.
కేంద్ర ప్రత్యక్ష పన్నులు & కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ శ్రీ వివేక్ జోహ్రీ కీలక ఉపన్యాసం ఇస్తారు. 'ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ అసోసియేషన్స్' అధ్యక్షుడు (ఎఫ్‌ఐఏటీఏ) ఇవాన్ పెట్రోవ్; ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్స్ (IFCBA) మేనేజింగ్ డైరెక్టర్ & జపాన్ కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెయికు ఒకాఫుజి, డీపీ వరల్డ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మైక్ భాస్కరన్ ఈ కార్యక్రమంలో ప్యానలిస్ట్‌లుగా పాల్గొంటారు.
ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ 60 సంవత్సరాల ప్రయాణం గురించి ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ శంకర్ షిండే మాట్లాడుతూ, ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐది గొప్ప చరిత్రగా అభివర్ణించారు. ఇది సుదీర్ఘ ప్రయాణమని చెప్పారు. గత పనితీరును గౌరవిస్తూ, భవిష్యత్ అవకాశాలను స్వాగతిస్తూ, వర్తమానాన్ని జరుపుకుంటూ దేశ వృద్ధికి ఇది దోహదపడుతోందని వెల్లడించారు.
నెట్‌వర్కింగ్ కోసం ఎఫ్‌ఐఏటీఏ, ఐఎఫ్‌సీబీఏ వంటి అంతర్జాతీయ వేదికలను అందించడం ద్వారా కస్టమ్స్ మధ్యవర్తులు, లాజిస్టిక్స్ సేవల ప్రదాతలకు సాధికారత కల్పించేందుకు ఫెడరేషన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తుందని శ్రీ షిండే వెల్లడించారు. ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ శిక్షణ సంస్థ 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్' (ఐఐఎఫ్‌ఎఫ్) ద్వారా నిరంతర శిక్షణ కార్యక్రమాలతో, లాజిస్టిక్స్‌కు కార్యాచరణ నైపుణ్యాల వృద్ధి ప్రయోజనం కలుగుతోందని స్పష్టం చేశారు. 60 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణంలో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐతో కలిసి నడిచిన సభ్యులు, వాటాదార్లు, ప్రభుత్వ సంస్థలకు శ్రీ షిండే కృతజ్ఞతలు తెలిపారు.
ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ అనేది భారతదేశంలోని కస్టమ్స్ మధ్యవర్తుల జాతీయ అత్యున్నత సంస్థ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కస్టమ్స్ మధ్యవర్తులు, లాజిస్టిక్స్ సేవల ప్రదాతల కోసం ఎగ్జిమ్ వాణిజ్య ప్రయోజనాలను రక్షించడానికి, ప్రోత్సహించే లక్ష్యంతో 1962లో ఈ సంస్థను స్థాపించారు.
ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ 60 సంవత్సరాల ప్రయాణం, ఎగ్జిమ్ వాణిజ్యంలో చేసిన సేవ, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దాని ప్రయత్నాన్ని గుర్తు చేసుకుంటూ వజ్రోత్సవ వేడుకలను ఆ సంస్థ జరుపుకుంటోంది. ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ ఈసీ సభ్యులు (కస్టమ్స్ మధ్యవర్తులు/ఫ్రైట్ ఫార్వర్డర్లు), ప్రభుత్వ అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న లాజిస్టిక్స్ పరిశ్రమ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో, ఎగ్జిమ్ వాణిజ్యానికి ప్రయోజనం చేకూర్చే ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ వజ్రోత్స సావనీర్, కాఫీ టేబుల్ బుక్, ఇ-బిల్ ఆఫ్ లాడింగ్‌ను కూడా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమ నేపథ్య అంశం ”సరిహద్దులు చెరిపేస్తున్న ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ఏఐ”.
*****
(Release ID: 1931293)
Visitor Counter : 143