మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నవ భారతదేశం కలల సాకారం: అమృత కాల యువత పాత్ర పై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మేటా


భవిష్యత్తుపై 16-18 సంవత్సరాల వయస్సు గల యువత ఆకాంక్షలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వ్యక్తం చేసేలా చూడడానికి ప్రచార కార్యక్రమం నిర్వహణ

Posted On: 07 JUN 2023 4:41PM by PIB Hyderabad

నవ భారతదేశం కలల సాకారం: అమృత కాల యువత పాత్ర అనే అంశంపై  మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మేటా చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు ప్రారంభించారు. భవిష్యత్తుపై 16-18 సంవత్సరాల వయస్సు గల యువత తమ  ఆకాంక్షలను వెల్లడించి కలలు సాకారం చేసుకునేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యువతకు సాధికారత కల్పించి నవ భారత నిర్మాణంలో వారికి సముచిత పాత్ర కల్పించడం లక్ష్యంగా అమృత కాల యువత కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  

ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో సృజనాత్మకతతో వారి ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రదర్శిస్తారు. దేశం అన్ని ప్రాంతాలకు  చెందిన యువతీ యువకులు పాల్గొనేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఆశయాలను సాధించడం, పెద్దయ్యాక వారు ఏమి కావాలని కోరుకుంటారు అన్న అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యత ఇస్తారు.  

ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి 

శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ  "మన యువత రేపటి భారతదేశానికి రూపశిల్పులు.  వారి ఆకాంక్షలను గుర్తించడం,ప్రోత్సహించడం, ఆకాంక్షలు నెరవేరేలా  అమృత్ తరం ప్రచారం సాగుతుంది.  కలలను సాకారం చేసుకోవడానికి యువతకు  ప్రోత్సాహం అవసరం. మెటా ఇండియా సహకారంతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ దిశలో చర్యలు అమలు చేస్తుంది" అని అన్నారు. 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేయనున్న కార్యక్రమం పట్ల 

మెటా ఇండియా పాలసీ ప్రోగ్రామ్‌లు, ప్రభుత్వ ఔట్‌రీచ్- హెడ్, నటాషా జోగ్ హర్షం వ్యక్తం చేశారు.   "యువత ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమను తాము వ్యక్తీకరించడంలో సహాయపడటానికి మెటా ఇండియా సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా మెటా ఇండియా, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వినూతన కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ఈ కార్యక్రమం  ద్వారా  నవ భారతదేశం గురించి యువత కంటున్న కలలు  దృశ్యమానంగా తీర్చి దిద్దుతారు. కార్యక్రమం ద్వారా  యువ నాయకులు సిద్ధం అవుతారు" అని నటాషా జోగ్ అన్నారు.

" తమ కలలను, ఆకాంక్షలను పంచుకోవడానికి యువతకు అమృత్ జనరేషన్ ప్రచారం ఒక అసాధారణమైన వేదికగా ఉంటుంది. భావి తరానికి శక్తి సామర్ధ్యాలు సమకూర్చడానికి  మెటా ఇండియా కృషి చేస్తోంది.  భవిష్యత్తు కోసం యువత ఆశ , ఆశయాన్ని కలిగి ఉండాలని మెటా ఇండియా ఆశిస్తోంది. దీనికి అవసరమైన సహకారాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అందిస్తాం." అని ఆయన అన్నారు. 

అమృత్ జనరేషన్ ప్రచారంలో పాల్గొనడానికి  ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో హ్యాష్‌ట్యాగ్ (#) అమృత్ జనరేషన్‌ని ఉపయోగించి వారి ఆకాంక్షలను ప్రదర్శించే రీల్‌ సృష్టించాల్సి ఉంటుంది. . అర్హత ప్రమాణాలు, సమర్పణ మార్గదర్శకాలతో సహా మరిన్ని వివరాలను Facebook GPA పేజీ ,కేంద్ర  మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ  సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చూడవచ్చు.

ప్రచార కార్యక్రమంలో పాల్గొనే వారి నుంచి 50 మందిని ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారు ఢిల్లీలో సీనియర్ విధాన రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చెందిన సీనియర్ ప్రతినిధులతో చర్చలు జరపడానికి అవకాశం పొందుతారు.  సంబంధిత రంగాలపై విలువైన సమాచారాన్ని అందించి  కలలను సాకారం చేసుకోవడానికి ఎంపిక అయిన వారు ప్రత్యేక అవకాశం పొందుతారు. 

ఎంపికైన యువ భారతీయులు గురుగ్రం లోని మెటా కార్యాలయాన్ని సందర్శించి, సృజనాత్మక  సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి నిపుణుల నుంచి సలహాలు సూచనలు పొందుతారు. 

మెటా గురించి:

 వ్యక్తుల మధ్య సంబంధాలు పెంపొందించడానికి, నూతన సామాజిక వర్గాలు అభివృద్ధి చేయడానికి,  వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సాంకేతికతలను మెటా ఇండియా రూపొందిస్తుంది. 2004లో ఫేస్‌బుక్ ప్రారంభించినప్పుడు మెటా  ప్రజలు మధ్య సంబంధాలు కల్పించే  విధానాన్ని మార్చింది. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి మెటా సహకారం అందిస్తోంది. సామాజిక సాంకేతికత లో తదుపరి పరిణామాన్ని రూపొందించడంలో సహాయపడటానికి Meta 2D స్క్రీన్‌లను దాటి ఆగ్మెంటెడ్ మరియు వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన అంశాల అభివృద్ధి పై దృష్టి సారించింది.

***


(Release ID: 1930615) Visitor Counter : 143