రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కార్బన్ పాదముద్ర, ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా సిన్నార్-షిర్డీ సెక్షన్ 4-లేనింగ్ పనులు


- భారతమాల పరియోజనలో భాగంగా సిన్నార్ బైపాస్ నిర్మాణంలో అనేక ముఖ్యమైన పద్ధతులు: శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 06 JUN 2023 12:24PM by PIB Hyderabad

భారతమాల పరియోజనలో భాగంగా తాము ప్రస్తుతం మహారాష్ట్రలోని సిన్నార్ బైపాస్ నిర్మాణంతో సహా ఎన్.హెచ్-160 యొక్క సిన్నార్-షిర్డీ సెక్షన్ 4-లేనింగ్‌ పనులలో నిమగ్నమై ఉన్నట్టుగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు.  కాలినడకన షిర్డీకి తీర్థయాత్ర చేసే సాయిబాబా భక్తులకు ఇది ఒక ప్రత్యేక మార్గం లేదా 'మార్గ్'గా ఉపయోగపడుతుందని, ఈ పరివర్తన ప్రాజెక్ట్ అపారమైన సామాజిక ప్రాముఖ్యతను కలిగి ఉందని మంత్రి వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. దీనికి తోడు ఇది ఆర్థిక ఉత్ప్రేరకం వలె కూడా పని చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. పరిసర ప్రాంతాలలో వేగవంతమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఆయన వివరించారు.  మహారాష్ట్రలోని రెండు ప్రధాన మతపరమైన పట్టణాలైన షిర్డీ మరియు నాసిక్/ త్రయంబకేశ్వరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి అని శ్రీ గడ్కరీ చెప్పారు. దీనికి తోడు  స్థిరత్వం పట్ల మా దృఢమైన నిబద్ధతకు అనుగుణంగా ప్రాజెక్ట్ కార్బన్ పాదముద్రను తగ్గించడానికి మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అనేక ముఖ్యమైన సాంకేతికతలను కలిగి ఉందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా సర్వీస్ రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం, సిమెంట్ ట్రీటెడ్ బేస్ (సీటీబీ) మరియు సిమెంట్ ట్రీటెడ్ సబ్ బేస్ (సీటీఎస్బీ), అలాగే 'రాప్' (రీక్లెయిమ్డ్ తారు పేవ్‌మెంట్)ని ఉపయోగించడం వంటివి పలు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయని ఆయన అన్నారు.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వంలో ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధిని పెంపొందిస్తూ మరింత సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూలమైన మొబిలిటీ నెట్‌వర్క్‌ను రూపొందించడంలో తమకు తిరుగులేని నిబద్ధత ఉందని శ్రీ గడ్కరీ అన్నారు.

***



(Release ID: 1930339) Visitor Counter : 132