భారత ఎన్నికల సంఘం

స్వీయ-అభ్యాసం కోసం తాజా ఏఐ సాధనాలను ఉపయోగించి శిక్షణ కంటెంట్ & బోధన అంశాలను రూపొందించనున్న ఐఐఐడిఈఎం : సీఈసీ రాజీవ్ కుమార్


ద్వారకలోని ఐఐఐడిఈఎంలో ఈసీఐ కొత్త హాస్టల్ బ్లాక్‌ ప్రారంభం

Posted On: 06 JUN 2023 5:30PM by PIB Hyderabad

ప్రధాన ఎన్నికల కమీషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ అనుప్ చంద్ర పాండే, శ్రీ అరుణ్ గోయెల్ తో కలిసి ఈరోజు ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడిఈఎం)లో హాస్టల్ బ్లాక్‌ను ప్రారంభించారు.  ఐఐఐడిఈఎం అనేది 2011లో ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం శిక్షణ, సామర్థ్యాభివృద్ధి  విభాగం. ఇది ఎన్నికల అధికారులు, ఇతర భాగస్వాములకు ఉచిత, న్యాయమైన, విశ్వసనీయమైన, దోష రహిత ఎన్నికలను నిర్వహించడానికి శిక్షణ ఇవ్వడానికి, సిద్ధం చేయడానికి, సన్నద్ధం చేయడానికి పని చేసే సంస్థ. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈసిఐ,  ఐఐఐడిఈఎం నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు శిక్షణ కంటెంట్, శిక్షణా పద్ధతులను రూపొందించాలని, అత్యాధునిక ఏఐ టూల్స్‌ని ఉపయోగించి ఆసక్తిని కలిగించేలా, స్వీయ-అభ్యాస విధానంలో రూపొందించాలని ఐఐఐడిఈఎంని కోరారు. “ఎన్నికల ప్రక్రియలు చాలా పటిష్టంగా ఉన్నాయి, అన్ని మార్గదర్శకాలు, సమాచారం, ఫారమ్‌లు ప్రమాణీకరించాము.  సులభంగా రిఫరెన్స్, సెర్చ్, ఇంటరాక్టివ్ ట్రైనింగ్ కోసం ఏఐ సాధనాల ద్వారా వాటిని ఒక విధంగా ఏకీకృతం చేయాలి” అని సీఈసీ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఇతర ప్రజాస్వామ్య దేశాలలో కూడా ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడానికి  ఐఐఐడిఈఎం  సహకారాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని శ్రీ రాజీవ్ కుమార్ సూచించారు. 

ఈసీ శ్రీ అనుప్ చంద్ర పాండే మాట్లాడుతూ, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వగలిగితే భారతదేశంలో ఖచ్చితమైన పని విధానంతో 10 లక్షల పోలింగ్ స్టేషన్లలో 1 కోటి ఎన్నికల అధికారులతో ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు.  ఐఐఐడిఈఎం  స్థాయికి సంబంధించిన అపెక్స్ ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్ధారించడానికి కీలకమైన సహాయాన్ని అందిస్తుంది. ఇతర ఈఎంబిల నుండి ఎన్నికల నిర్వహణ రంగంలో ఆలోచనలు అనుభవాల మార్పిడికి, ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి  ఐఐఐడిఈఎం  ఒక వేదికను కల్పిస్తోందని ఆయన అన్నారు. ఈసీ శ్రీ అరుణ్ గోయెల్  ఐఐఐడిఈఎం  అధికారులను అభినందిస్తూ,  ఐఐఐడిఈఎం  ఆలోచనా ప్రక్రియ, చర్చల మూలాధారం కావాలని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి  ఐఐఐడిఈఎం తాజా ట్రెండ్‌లకు అనుగుణంగా పనిచేయాలని  శ్రీ గోయెల్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

 

కొత్త హాస్టల్ భవనం

ఈరోజు ప్రారంభించిన హాస్టల్ భవనంలో 84 గదులు, 9 సూట్‌లు ఉన్నాయి. ఫ్లై-యాష్ బ్రిక్స్, తక్కువ విఓసి పెయింట్స్, హీట్ ఇన్సులేషన్ కోసం డ్రై స్టోన్ క్లాడింగ్, క్యావిటీ స్పేస్‌తో కూడిన డ్రై స్టోన్ క్లాడింగ్, సోలార్ రిఫ్లెక్టింగ్ ప్రాపర్టీస్‌తో తక్కువ హీట్ ట్రాన్స్‌మిషన్ ఉన్న డబుల్ గ్లేజ్డ్ యూనిట్ గ్లాస్, సోలార్ వాటర్ హీటింగ్, వంటి పర్యావరణ అనుకూల లక్షణాలతో ఈ భవనం రూపొందించారు. ఎనర్జీ సేవింగ్ ఎలక్ట్రికల్, లైట్ ఫిట్టింగ్‌లు, కారిడార్‌లలో ఆక్యుపెన్సీ సెన్సార్ ఆధారిత లైటింగ్ ఏర్పాటు చేసారు.  హాస్టల్ బ్లాక్‌లో పాల్గొనేవారి కోసం రిక్రియేషన్ రూమ్, వ్యాయామశాల కూడా ఉన్నాయి.

 

కమిషన్ నిర్వహించిన ఇటీవలి కార్యక్రమాలు, సంస్కరణలు, గత ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రహావలోకనం, ఎన్నికల అధికారులు, ఇతర ఈఎంబి అధికారులకు శిక్షణ, కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 

 

ఐఐఐడిఈఎం గురించి... 

భారతదేశంలో ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తూ,  ఐఐఐడిఈఎం ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబిలు) కోసం శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 117 దేశాల నుండి 2,478 మంది అంతర్జాతీయ స్థాయిలో  ఐఐఐడిఈఎం  నిర్వహించిన 122 ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రయోజనం పొందారు. ఎన్నికల సమగ్రతపై కోహోర్ట్‌లో భారతదేశం అగ్రగామిగా ఉంది,  ఐఐఐడిఈఎం ఐటిఈసి డివిజన్‌తో కలిసి, ఎంఈఏ ప్రపంచవ్యాప్తంగా ఈఎంబిల నుండి అధికారుల కోసం నాలుగు నేపథ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్ఎస్)తో కలిసి  ఐఐఐడిఈఎం మాస్టర్స్ మొదటి బ్యాచ్‌ను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్ మోడ్‌లో 'ఇంటర్నేషనల్ ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రాక్టీసెస్' (ఎంఐఈఎంపి)లో ప్రోగ్రామ్. ఇది టిఐఎస్ఎస్,  ఐఐఐడిఈఎం  వద్ద ఫీల్డ్ ప్రాక్టీసెస్ నుండి క్లాస్‌రూమ్ టీచింగ్, ఇంటిగ్రేటె లెర్నింగ్‌తో కూడిన రెండు సంవత్సరాల బ్లెండెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వివిధ దేశాలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై ఉన్న ఎన్నికల అధికారుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఎన్నికల నిర్వహణ సంస్థల వృత్తిపరమైన ప్రమాణాలను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రారంభ బ్యాచ్‌లో మాల్దీవులు, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, భూటాన్‌లోని ఎలక్షన్ మేనేజ్‌మెంట్ బాడీస్ (ఈఎంబిలు) నుండి 5గురు తో సహా భారత ఎన్నికల సంఘం ద్వారా నామినేట్ అయిన,  స్పాన్సర్ చేసిన  25 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు.

 

****



(Release ID: 1930338) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Hindi , Tamil