ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
తొమ్మిదేళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రమాణ చిహ్నాలు సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ః సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
65 ఏళ్ళలో సాధించలేని దానిని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ తొమ్మిదేళ్ళలో సాధించిందిః సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
త్రిపురలో నైపుణ్యాల చొరవలను సమీక్షించిన సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
05 JUN 2023 7:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం, ఆయన చురుకైన, సానుకూల విధానాల కారణంగా గత తొమ్మిది ఏళ్ళలలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని సాధించిందని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి& వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్ & ఐటి సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం పేర్కొన్నారు.
సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ (పేదల సంక్షేమం) నరేంద్ర మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ళ ప్రయాణాన్ని నిర్వచిస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2014లో బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉందని, విస్త్రతమైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లెక్కలేనన్ని కుంభకోణాలు ఉనికిలో ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయడమే కాక పౌరులలో ప్రభుత్వం పట్ల ఆశ, గౌరవం, విశ్వాసాన్ని కలిగించే బాధ్యతను కూడా ఆయన తీసుకోవలసి వచ్చిందన్నారు. తొమ్మిదేళ్ళలో ఆయన చాలావరకూ వ్యవస్థను శుద్ది చేయడమే కాక, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నడిపించారని త్రిపురలోని అంబస్సాలో జరిగిన వ్యాపారి సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి వివరించారు.
దాదాపు 65 ఏళ్ళల్లో సాధించలేనిదానిని, ప్రధానమంత్రి మోడీజీ నాయకత్వంలో భారత్ తొమ్మిదేళ్ళలో సాధించిందన్నారు. త్వరలోనే యుఎస్, చైనా తర్వాత ప్రపచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం లోక్‌సభ ఎంపి రేవతి త్రిపురతో కలిసి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ, తొమ్మిదేళ్ళ పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. యుపిఎ పాలనకు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళనూ పోలుస్తూ, ప్రధానమంత్రి మోడీజీ అవినీతి, కుంభకోణాల, దుష్పరిపాలన, అవకాశవాద సంకీర్ణ రాజకీయాలు, కుటుంబపాలనా రాజకీయాల స్థానంలో సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ రాజకీయాలను తీసుకువచ్చారని అన్నారు.
త్రిపురలో మూడు రోజులు పర్యటించేందుకు మంత్రి సోమవారం ఉదయం అగర్తాలాను చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రం చేపడుతున్న నైపుణ్యాల అవకాశాలను సమీక్షించనున్నారు.
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవమైనందున, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఒక మొక్కను నాటి, ప్రతిరోజునూ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటించాలని ప్రజలకు పిలుపిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముందు అయన ధలాయ్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ సిద్ధార్థ్ శివ్ జైస్వాల్‌ను కలుసుకుని, జిల్లాలో స్వయం సహాయక బృందాల పనితీరును సమీక్షించారు. సామర్ధ్యాల నిర్మాణం, మార్కెట్ అనుసంధానతల విషయంలో ఈ బృందాలు ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చించారు. యువతకు స్థానికంగా ఉపాధిని సృష్టించేందుకు, వ్యవస్థాపకతల కోసం చేపట్టిన నైపుణ్యాలకు సంబంధించి చొరవల గురించి, వారు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చించారు.
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తర్వాత పార్టీ నాయకులైన శ్రీ తపస్ భట్టాచార్యను, బిజెపి మహిళా అధ్యక్షురాలు అజంతా భట్టాచార్జీని కలుసుకుని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడారు.
మంత్రి మంగళవారం కృష్ణపూర్‌లో పర్యటించి, ఇతర కార్యక్రమాలతో పాటుగా జనజాతి లబ్ధిదారుల సమ్మేళన్ ప్రతినిధులతో సంభాషించనున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ త్రిపురలో అధికారికంగా పర్యటించడం ఇది రెండవసారి. ఆయన ఆగస్టు 2022లో తొలి సారి పర్యటించి, తిరంగా రాలీ లో పాలుపంచుకున్నారు.
***
(Release ID: 1930098)
Visitor Counter : 153